Prof G Haragopal: విద్యార్థుల్లో ప్రశ్నించే సామర్థ్యం పెంచాలి
Sakshi Education
కోదాడ రూరల్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి అన్నారు.
ఏప్రిల్ 9న కోదాడ పట్టణ పరిధిలోని తేజ విద్యాలయంలో శ్రీసమకాలీన పాఠశాల విద్యలో మార్పులు–సమాజంపై ప్రభావంశ్రీ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో వారు మాట్లాడారు. ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే సమాజంలో అవినీతి, అక్రమాలు తగ్గుతాయన్నారు. విద్యలో మానవీయకోణం అవసరమని, చదువుతో పాటు సమాజంపై అవగాహన కలిగే విధంగా పాఠాలు బోధించాలన్నారు.
చదవండి: Skill Training: విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్’ శిక్షణ
మానవ విలువలు, క్రమశిక్షణ లేని విద్య ఎంత ఉన్నా నిరుపయోగమేనని పేర్కొన్నారు. ప్రస్తుత చదువులు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా కొనసాగుతున్నాయని, అది సమాజానికి మంచిది కాదన్నారు. మహిళలను గౌరవించాలని, తోటి వారికి సహాయం చేయాలనే భావజాలం విద్యార్థుల్లో పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: APNRTS: పరీక్షల భయం ఉండదిక
Published date : 10 Apr 2023 06:02PM