JNV: నవోదయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనవరి 9న ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,105 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి హాల్‌టికెట్లు కేటాయించామని, ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఆరోతరగతిలో 80 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
చదవండి: JNVST 2024: ఈ చాన్స్ మిస్ చేసుకోకండి... మీరు దరఖాస్తు చేసుకున్నారా..?
దరఖాస్తులో కులం కేటగిరీ, అర్బన్, రూరల్, పుట్టిన తేదీ, జెండర్ తదితరాల నమోదులో తప్పిదాలు జరిగితే అన్ని ఆధారాలతో జనవరి 16వ తేదీలోపు జవహర్ నవోదయ విద్యాలయ అధికారులను సంప్రదించి, సవరించుకోవాలని సూచించారు.
విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయించనున్నామని తెలిపారు, నవోదయలో సీటు ఇప్పిస్తామంటూ వచ్చే దళారుల మాట నమ్మి మోసపోవద్దన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు హాల్ టికెట్‌తోపాటు ఆధార్ కార్డు లేదా ప్రధానోపాధ్యాయులచే ఫొటో ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.