Kurmanath: ప్రభుత్వ కళాశాలలో చేరిన పీవో కుమారుడు
Sakshi Education
ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు ఆంథ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్.
తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్ హైసూ్కల్‌లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటరీ్మడియెట్ మొదటి సంవత్సరంలో చేరి్పంచారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేరి్పంచానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
Published date : 03 Sep 2021 04:43PM