Skip to main content

Online Classes: గ్రామీణ ప్రాంత విద్యార్ధుల కోసం JNTUH ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించింది. ఈ కార్యక్రమం నైపుణ్యాల పెంపు, విద్యార్ధుల మెరుగైన అభ్యాసాన్ని అందించేందుకు, సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడింది.
JNTUH launches online classes for rural students   JNTUH online classes for rural students

ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇతర సాంకేతిక కోర్సుల విద్యార్థులకు అధునాతన బోధనా విధానాలు, పరిశ్రమకు అనుగుణంగా ఉన్న విద్యా విధానాలు అందించనున్నారు.

చదవండి: Free Coaching: RRB, SSC, Banking ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే!

JNTUH వైస్ చాన్సలర్‌ ప్రొఫెసర్ డా. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, "ఈ కార్యక్రమం గ్రామీణ విద్యార్థులకు అధునాతన విద్యా అవకాశాలను అందించడంతో పాటు, విద్యా నాణ్యతను పెంచే దిశగా ముందడుగు." అని అన్నారు.

ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తుందని, ఇది భవిష్యత్‌లో మరిన్ని విద్యా సంస్కరణలకు దారి తీస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Published date : 08 Feb 2025 08:30AM

Photo Stories