Skip to main content

High Court: 4 వారాల్లోగా పునర్నియామకం జరగాలి

మెడికల్‌ కాలేజీల్లో సీట్లు కోల్పోయిన విద్యార్థుల పునర్నియామకం 4 వారాల్లో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, National Medical Council (NMC)ని హైకోర్టు ఆదేశించింది.
High Court
4 వారాల్లోగా పునర్నియామకం జరగాలి

టీఆర్‌ఆర్, ఎంఎన్‌ఆర్, మహావీర్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్‌ సీట్లను, 100 పీజీ సీట్లను ఎంఎన్‌సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. సీట్ల రద్దు, ఇతర కాలేజీల్లో సర్దుబాటు కారణంగా తప్పు చేయకున్నా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. పునర్నియామకానికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని, NMCని ఆదేశించాలంటూ డా. పవన్‌కుమార్, మరో 48 మంది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై జూలై 11న జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సామ సందీప్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్, కాళోజీ నారాయణరావు వర్సిటీ అధికారులు వాదనలు వినిపించారు.

చదవండి: 

Published date : 12 Jul 2022 03:37PM

Photo Stories