Free Education: ఉచిత విద్య, ఉద్యోగావకాశాలు వినియోగించుకోవాలి
Sakshi Education
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతి, యువకులు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 8న శుక్రవారం ఉదయం 9గంటలకు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని యువజన శిక్షణ కేంద్రంలో ఎంపిక ఉంటుందని ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ సెప్టెంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉద్యోగ అవకాశం, ఉచిత విద్యలో ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు వయస్సు 17–20 సంవత్సరల మధ్య ఉండి పదో తరగతిలో 60 శాతం, ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ లేదా ఒకేషనల్‌కోర్స్ 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల ఉమ్మడి జిల్లా గిరిజన నిరుద్యోగ యువతి యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకై 9493535052 సంప్రదించాలని కోరారు.
చదవండి:
Educational Development: శాస్త్రీయపరమైన విద్యావిధానం అమలు
Published date : 06 Sep 2023 04:26PM