Skip to main content

Education Department: విద్యార్థి భవితకు మొదటిమెట్టు..!

students future

నిజామాబాద్‌: విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఏడాది మళ్లీ తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొంత మెరుగయ్యారు. దీంతో అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా తొలిమెట్టు కార్యక్రమా న్ని నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యా శాఖ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు గుణాత్మక విద్యను పెంపొందించడం తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, గణితంలో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

మండలానికి ఆరుగురు టీచర్లకు శిక్షణ
జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 21, 22, 24 తేదీల్లో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మండల స్థాయిలో తెలుగు, గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. అనంతరం తొలిమెట్టు కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఆగస్టు నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాలో డీఈవో పరిధిలో 666 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 192 మంది ఉపాధ్యాయులు ఆయా బడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

తొలిమెట్టుతో పాటు ఎఫ్‌ఎల్‌ఎం కార్యక్రమాన్ని కూడా ఇది వారికే అమలు చేశారు. ఇందులో విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించిన అధికారులు రెండోసారి తొలిమెట్టు కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పిస్తారు. వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించి చదువులో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించారు.

ఉన్నత విద్యార్థులకు ‘లిప్‌’
ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌(లిప్‌) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో దీనిని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. విద్యార్థులకు మాతృభాషతో పాటు ద్వితీయ భాష, తృతీయ భాషలో స్పష్టంగా మాట్లాడడం, తప్పులు లేకుండా రాయడం నేర్పడం దీని ఉద్దేశం. స్వీయ సామర్థ్యాల పెంపు, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో విద్యార్థులు ప్రతిభ చాటేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

విద్యార్థులకు ఎంతో ఉపయోగం
గతేడాది తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యా లు మెరుగయ్యాయి. ప్రస్తు తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. – వెనిగళ్ల సురేశ్‌, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పకడ్బందీగా చేపడుతాం
ఈ ఏడాది తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతాం. ఇప్పటికే రాష్ట్ర స్థా యిలో రిసోర్స్‌సర్సన్‌లు శిక్ష ణ తీసుకున్నారు. 21 నుంచి జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు చేపడతాం. విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. – దుర్గాప్రసాద్‌, డీఈవో

Published date : 19 Jul 2023 08:14PM

Photo Stories