ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు షిఫ్ట్.. విశ్వవిద్యాలయం కొత్త నిర్ణయంపై భగ్గుమంటున్న అధ్యాపకులు, విద్యార్థులు!
Sakshi Education
న్యూఢిల్లీ: కొత్త విద్యా సంవత్సరం (2025–26) ప్రారంభానికి ముందు ఢిల్లీ విశ్వవిద్యాలయం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జూలై 31న జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, వర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలు మరియు అనుబంధ సంస్థలు సాధారణ పని దినాలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది.

వర్శిటీ నిర్ణయం వెనుక కారణం
వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, విద్యా కార్యకలాపాలను విస్తరించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ తెలిపింది. ఈ ఆదేశం జూలై 12న జరిగిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చర్చించిన తరువాత అమల్లోకి వచ్చింది.
కొత్త విద్యా సంవత్సరం ప్రత్యేకతలు
- 2025–26 విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (FYUP) అమలు.
- నాలుగో సంవత్సరం విద్యార్థులకు బోధన బాధ్యతలు సీనియర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి అప్పగింపు.
- పొడిగించిన పని గంటలను అధ్యాపకులు, సిబ్బంది పూర్తిగా ఉపయోగించుకోవాలని వర్శిటీ. సూచన.
చదవండి: Impact of AI: ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్.. ఇవే ఏఐ ప్రభావానికి గురయ్యే ఉద్యోగాలు!
అధ్యాపకులు, విద్యార్థుల ఆందోళనలు
- అసాధ్యమైన ఆదేశం – బోధనా సిబ్బంది, విద్యార్థులకు భారంగా మారే అవకాశం.
- మౌలిక సదుపాయాల లోపం – కొత్త సమయాలు అమలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లేవని ఆరోపణలు.
- దూర ప్రయాణ సమస్య – కళాశాలలకు దూరంగా నివసించే అధ్యాపకులు, విద్యార్థులకు ఇబ్బందులు.
- విద్యా వాతావరణం, పనిభారం పై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆందోళన.
![]() ![]() |
![]() ![]() |
Published date : 02 Aug 2025 12:49PM
Tags
- Delhi University 8AM to 8PM timings
- Delhi University new working hours
- DU extends college timings
- Delhi University faculty protests
- Delhi University student reactions
- Delhi University FYUP
- Delhi University latest news
- Delhi University extended working hours impact
- HigherEducationIndia
- Education policy
- AcademicYear2025