Degree: డిగ్రీలో 3.65 లక్షల సీట్లు
ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విద్యార్థులకు సీట్లను కేటాయిం చనుంది. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం సెప్టెంబర్ 16నే ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీలు, సీట్ల అంశం తేలకపోవడం, ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రి యపై న్యాయవివాదం తలెత్తడంతో అది నిలిచిపో యింది. తాజాగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడంతో ఆన్ లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను మండలి చేపట్టింది. ఆన్ లైన్ వెబ్ ఆప్షన్ల నమోదును అక్టోబర్ 8న నుంచి ప్రారంభించింది. విద్యార్థులు అక్టోబర్ 15 వరకు https://oamdc.ap.gov.in ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన అక్టోబర్ 20న ఉన్నత విద్యామండలి సీట్లను కేటాయిస్తుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 21న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల సంఖ్య ఇలా..
మేనేజ్‌మెంట్ |
కన్వీనర్ |
ఈడబ్ల్యూఎస్ |
మొత్తం |
ప్రభుత్వ |
53,866 |
5,392 |
59,258 |
ఎయిడెడ్ |
2,442 |
318 |
2,760 |
అ¯ŒS ఎయిడెడ్ |
2,72,414 |
28,065 |
3,00,479 |
యూనివర్సిటీ కాలేజీలు |
2,787 |
279 |
3,066 |
మొత్తం |
3,31,509 |
34,054 |
3,65,563 |
చదవండి: