Skip to main content

TSCHE: 54 ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత

మూడేళ్లుగా ఎలాంటి ప్రవేశాలు లేని 54 ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మూసివే యాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.
TSCHE
54 ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా వర్సిటీలకు ఆదేశాలు పంపినట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మే 5న ఆయన మాట్లాడుతూ, వివిధ కాలేజీల్లో విద్యార్థులు చేరని కోర్సులను కూడా గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. వాటి స్థానంలో ఇతర కోర్సులకు అనుమతిపై సంబంధిత అధికారులను నివేదిక కోరినట్టు చెప్పారు. వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో క్లస్టర్ విధానాన్ని మరింత పక్కాగా నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో 10 కాలేజీల చొప్పున నెట్వర్క్ ఏర్పాటు చేశామని, దీనిలో భాగంగా విద్యార్థి తనకు నచ్చిన ఒక సబ్జెక్టును ఏ కాలేజీలోనైనా చేసే వీలు కల్పిస్తామన్నారు. ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగానే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజులపై మే 26న నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.

Sakshi Education Mobile App
Published date : 26 May 2022 04:17PM

Photo Stories