Apprenticeship Mela: ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా
Sakshi Education
కాటారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా (పీఎంఎన్‌ఏఎం) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు.
Apprenticeship Mela
ఆదర్శ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోట ర్స్, శ్రీధర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరి కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాల్లో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకొని మేళాకు హాజరుకావాలని సూచించారు.
ఆసక్తిగల అభ్యర్థులు బయోడెటా, అప్రె ంటిషిప్ రిజిస్ట్రేషన్, ఎస్‌ఎస్‌సీ మెమో, ఐటీఐ మెమో, ఎన్టీసీ, కుల ధృవీకరణపత్రం, ఆధార్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.