Skip to main content

Literary Festival: హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం.. ఈసారి ఇలా..

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ వేదికగా జ‌న‌వ‌రి 24 నుంచి 26 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌’కు సర్వం సిద్ధమైంది.
All set for Hyderabad Literary Festival

నగరంలోని టీ–హాబ్‌ (సత్వ నాలెడ్జ్‌ సిటీ)లో నిర్వహిస్తున్న ఈ సాహితీ పండుగకు భారత్‌తో పాటు విదేశాల నుంచి సాహితీ ప్రియులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్‌లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లీనరీలు ఉంటాయని., మొదటి రోజు ప్లీనరీలో భాగంగా ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో ఆయన రాసిన 2024:

‘ది ఎలక్షన్‌ దట్‌ సర్‌ప్రైజ్‌ ఇండియా’ పుస్తకంపై సాహితీ ప్రముఖులు సునీతా రెడ్డి చర్చించనున్నారు. ఈ 15వ ఎడిషన్‌ ఫెస్టివల్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అంతరించిపోతున్న భారతీయ భాషలపై ప్రత్యేక సదస్సులు, కవిత్వానికి సంబంధించి ప్రత్యేకంగా కావ్యధార కార్యక్రమం ఉంటాయన్నారు.

చదవండి: MBA Turned Sarpanch: ఎంబీఏ చ‌దివింది.. ల‌క్ష‌ల‌ ప్యాకేజీని వ‌దిలింది.. మొదటి మహిళా స‌ర్పంచ్ అయ్యింది.. కానీ ఇప్పుడు మాత్రం..

మీట్‌ మై బుక్‌ పేరుతో పుస్తక ఆవిష్కరణలు, మూవింగ్‌ ఇమేజెస్‌ టాకీస్‌ సినిమా ప్రదర్శనలు, సైన్స్‌ అండ్‌ సిటీ సెషన్స్‌, స్టేజ్‌ టాక్‌లు, స్టోరీ టెల్లింగ్‌, వర్క్‌షాప్స్‌, యంగిస్తాన్‌ యూత్‌ ఈవెంట్స్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ సారి ఫెస్టివల్‌ ఆతిథ్య దేశంగా లూథియానా, దృష్టి సారించిన భాషగా సింధీ భాషను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు షబానా అజ్మీ, అరుణా రాయ్‌, నందితా భవానీ,రీతా కొఠారీ,సునీతా కృష్ణన్‌, హుమా ఖురేషి, సినీనటుడు సిద్దార్థ్‌, దర్శకులు విద్యా రావ్‌, సాహిత్య ప్రముఖులు రాజ్‌ మోహన్‌ గాంధీ, కల్పన కన్నబిరాన్‌ తదితరులు పాల్గొననున్నారు.

Published date : 24 Jan 2025 08:48AM

Photo Stories