Rajesh Patil, IAS : ఒకప్పుడు కూరగాయలు అమ్మేవాడిని..ఇప్పుడు ఐఏఎస్

పేద కుటుంబంలో జన్మించి బతకడం కోసం చిన్నతనంలో కూరగాయలమ్మిన మహారాష్ట్ర వాసి అప్పట్లో చదువుపై ఆసక్తి చూపకపోయినా క్రమేణా కష్టపడి అనుకున్నది సాధించాడు.
కుటుంబ నేపథ్యం:
రాజేష్ పటేల్...మహారాష్ట్రలోని జల్గావ్ గ్రామంలో జన్మించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలో రాజేష్ చాలా అల్లరి పిల్లవాడు. చదువంటే అంత ఆసక్తి ఉండేది కాదు. అయితే తల్లిదండ్రులు తనను చదివించడానికి పడే కష్టాలను చూసి అతనిలో మార్పు వచ్చింది. అందరి లాగానే రాజేష్ తల్లిదండ్రులకు కూడా అప్పుల బాధలు తప్పలేదు. అందుకే రాజేష్ వారికి సహాయంగా కూరగాయలు, పండ్లు ,బ్రెడ్డు అమ్మేవాడు.
అతి కష్టమ్మీద...
విద్యపై ఆసక్తి అంతంతమాత్రమే కావడంతో పదోతరగతి అతికష్టమ్మీద ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత చదువంటే ఆసక్తి పెరిగింది.ఇంటర్‌లో మెరుగైన మార్కులు తెచ్చుకున్నాడు. అయితే ఈ మార్కులతో పెద్ద కాలేజీల్లో సీటు రాదని భావించిన రాజేశ్. తల్లిదండ్రులకు భారం కాకుండా సాధారణ స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ చేశాడు.
నా లక్ష్యం మాత్రం ఇదే..

అయితే అతని లక్ష్యం మాత్రం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో విజయం సాధించడం. అందుకే కష్టపడి చదివి 2005 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటాడు. శిక్షణ అనంతరం ఒడిశాలోని అత్‌ఘర్‌లో సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్‌గా 2006లో చేరాడు. రైతుబిడ్డ కావడంతో ప్రజల కష్టాలను సత్వరంగా తీర్చగలిగాడు. 2008లో వచ్చిన వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు, గిరిజనలకు ‘రెడీ టూ ఈట్’ పేరుతో వారికి ఆహారం అందేలా చేసి మన్ననలందుకున్నాడు. 2009లో కోరాపుత్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి దానిని అభివృద్ధికి కృషిచేశాడు.
అవార్డుల పరంపర...
కలెక్టర్‌గా రాజేశ్ చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించి అనేక అవార్డులతో సత్కరించింది. 2014లో ప్రెసిడెంట్ అవార్డు, ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ అమలుకోసం చేసిన కృషికి ప్రైమ్ మినిష్టర్ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా 2016లో సోలార్ సహాయంతో తాగునీరు అందించి నేషనల్ అవార్డు, చీఫ్ మినిష్టర్ అవార్డు అందుకున్నాడు.
ఆ మాట నిజమైంది
‘చిన్నతనంలో అప్పుడప్పుడూ అమ్మతో సరదా గా కలెక్టర్ మమ్ అనేవాడిని. ఆ మాట నిజమైంది’ అని చెప్పాడు రాజేష్.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.
Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే
Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Civils Results : సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు...ఐఏఎస్ అయ్యాడిలా..