రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిలయ్యా...చివరికి విజయం సాధించానిలా..
Sakshi Education
* అవగాహనలేక రెండుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా
* ఆర్‌సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధ్యాపకుల సాయంతో లోపాలు సరిదిద్దుకున్నా
* సాక్షితో సివిల్స్ 163వ ర్యాంకు విజేత శ్వేత
సివిల్స్ సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు? ర్యాంకు ముందే ఊహించారా?
సివిల్స్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని చాలా బాధ్యతగా ఫీలవుతున్నా. నేను విజయం సాధించిన వెంటనే నాకన్నా మా ఆయన ఎక్కువ సంబరపడ్డారు. ఎందుకంటే సివిల్స్ రాసేలా నన్ను ప్రోత్సహించింది ఆయనే. వాస్తవానికి ఇది నా మూడో అటెంప్ట్. గతంలో 2009, 2010లో రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి, ఫెయిలయ్యా. ఈసారి విజయం సాధించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన.

మీ విద్యా? కుటుంబ నేపథ్యం?
మాది మహబూబ్‌నగర్ జిల్లా. ఒకటి నుంచి అయిదు వరకు బండ్లగూడలో చదివా. పదోతరగతి సైదాబాద్‌లో పూర్తిచేశా. ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఓ ప్రైవేటు కాలేజీలో పూర్తిచేశాను. అనంతరం ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌లో ఈఈఈ చేశాను. చివరి ఏడాదిలో అంటే... 2005లో కాలేజీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లో కాగ్నిజెంట్ టెక్నాలజీలో ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్లపాటు ఉద్యోగం చేశాక 2007లో జాబ్‌కు రిజైన్ చేశా. వెంటనే అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లి.. తిరిగి 2008లో హైదరాబాద్‌కు వచ్చి వివాహం చేసుకున్నా. మా ఆయన కూడా ఇంజనీర్ కావడంతో ఇద్దరం హైదరాబాద్‌లోనే సెటిల్ కావాలనే నిర్ణయం తీసుకుని తిరిగి ఇక్కడకు వచ్చేశాం.

వాస్తవానికి ఇంజనీర్‌గానే కెరీర్‌ను కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నాను. కాని మా ఆయన నేను సివిల్స్ రాసేలా అడుగడుగునా ప్రోత్సహించేవారు. ఐఏఎస్ అధికారి అయితే పదిమందికి సేవచేయవచ్చని..దాన్ని సాధించడం పెద్దకష్టం కాదని నాలో పట్టుదల పెంచారు. దీంతో 2009లో మొదటిసారి సివిల్స్‌కు దరఖాస్తుచేశాను. అప్పుడు ఇంటర్వ్యూవరకు వెళ్లి అక్కడ ఫెయిలైపోయా. మొదటి అటెంప్ట్‌లో మెయిన్స్‌లో 900మార్కులు, ఇంటర్వ్యూలో 165 కలిపి మొత్తం 1065మార్కులు వచ్చాయి. ఆతర్వాత రెండో అటెంప్ట్‌లో మెయిన్స్‌లో 971 మార్కులు, ఇంటర్వ్యూలో 144 మార్కులు కలిపి మొత్తం 1115 మార్కులు సాధించాను. కాని సివిల్స్‌కు ఫెయిలయ్యా. చివరకు మూడో అటెంప్ట్‌లో విజయం సాధించాను. 163వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది.
సివిల్స్‌లో విజయం సాధించలేకపోతే ఏం చేసేవారు?
సివిల్స్‌లో విజయం సాధించకపోయినా.. డీఎస్పీగా ఉద్యోగంలో చేరదామని నిర్ణయించుకున్నా. ఎందుకంటే.. ఇటీవల ఏపీపీఎస్సీ విడుదలచేసిన గ్రూప్1 ఫలితాల్లో 538 మార్కులు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యా. ఇప్పుడు సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడంతో అఖిల భారత సర్వీసుల్లోకి చేరడం సంతోషంగా ఉంది.

ఇంజనీరింగ్ చదివిన మీరు ఆర్ట్స్ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకోవడం కష్టమనిపించలేదా?
ఇంజనీరింగ్ విద్యార్థిని అయినప్పటికీ.. సివిల్స్‌లో ఈ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకుంటే అనుకున్న ఫలితాలు సాధించలేనని తెలిసింది. ఎందుకంటే.. ఆర్ట్స్ సబ్జెక్టులకు కోచింగ్ ఇచ్చే నిపుణులు చాలామంది ఉన్నారు. కాని సివిల్స్‌లో ఇంజనీరింగ్ సబ్జెక్టులకు కోచింగ్ ఇచ్చేవారు తక్కువ. పైగా ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పోల్చితే ఆర్ట్స్‌సబ్జెక్టులకు మెటీరియల్ విస్తృతంగా లభిస్తుంది. అందుకే లోతుగా ఆలోచించి ఆర్ట్స్ సబ్జెక్టులను ఎంచుకున్నా. ఈ ఆప్షనల్స్‌ను ఎంచుకున్నప్పుడు చదవడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. సబ్జెక్టులను ఇష్టపడి ఎంచుకోవడంతో ప్రిపరేషన్‌లో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.

మెటీరియల్ ఎలా సమకూర్చుకున్నారు? ఏ బుక్స్ ఫాలో అయ్యారు?
ఆప్షనల్ సబ్జెక్టులకు మెటీరియల్ నా సొంతంగానే తయారు చేసుకున్నా. ప్రధానంగా సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలు చదివి ఎప్పటికప్పుడు చాప్టర్‌వైజ్‌గా నోట్స్ సిద్ధం చేసుకునేదాన్ని. అంతేకాకుండా.. కోచింగ్‌సెంటర్లో సబ్జెక్టు నిపుణుల సలహాలు, సూచనలు అనుసరించా. వారు బోధించేటప్పుడు ముఖ్యమైన అంశాలను గుర్తించి, సొంతంగా పాయింట్లు రాసుకునేదాన్ని. పైగా 2009, 2010లో రెండుసార్లు ఇవే ఆప్షనల్స్‌తో సివిల్స్ అటెంప్ట్‌చేసి విజయం సాధించడంతో.. ప్రిపరేషన్ అలవాటైపోయి అనేక మెళకువలు నేర్చుకున్నా. అంతేకాకుండా కాన్సెప్ట్యువల్‌గా సబ్జెక్టును చదివి, వెంటనే లాజికల్‌గా ఆలోచించేదాన్ని. ఫలితంగా ఎప్పటికప్పుడు చదివిన సబ్జెక్టు గుర్తిండిపోయి రివిజన్ సమయంలో సులువుగా అనిపించేది. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్ కొనసాగించా. కాన్సెప్ట్‌లపై క్లారిటీ ఉంటే.. విజయానికదే దగ్గరిదారి. పుస్తకాల విషయానికివస్తే... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ పుస్తకాలు, మొహిద్ బట్టాచార్య న్యూ హారిజాన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బుక్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) పుస్తకాలు, జాగ్రఫీ సబ్జెక్టుకు కుల్డర్, సవిందర్‌సింగ్ పుస్తకాలు చదివాను.

సక్సెస్ కోసం ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహాన్ని అనుసరించారు?
ప్రిపరేషన్ ప్రారంభించేముందు స్పష్టతతో ముందడుగేశాను. సబ్జెక్టుల్లో ఏది చదవాలనే కన్ఫ్యూషన్ లేకుండా జాగ్రత్తపడ్డా. ఏం చదవాలో స్పష్టత లేకపోతే విజయంపై ఆశలుపెట్టుకోకూడదు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేశాను. గతంలో రెండుసార్లు మెయిన్స్‌లో విజయం సాధించడంతో.. ఆ అనుభవం మూడోదఫా పరీక్షకు చాలా ఉపయోగపడింది. చదివిన ఆప్షనల్స్ కాబట్టి ఎక్కడా ఒత్తిడికి గురవలేదు. అంతేకాకుండా.. చాప్టర్‌వైజ్‌గా ప్రిపరేషన్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు
చాప్టర్ పూర్తయ్యాక ప్రతిటాపిక్‌ను మళ్లీ మననం చేసుకుని విశ్లేషణాత్మకంగా సమీక్ష చేసుకునేదాన్ని. అంతేకాకుండా మెయిన్స్‌లో చాలామంది సమయం సరిపోక తెలిసిన ప్రశ్నలు సైతం రాయలేరు. దీనివల్ల మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రిపరేషన్ జరిపినన్నాళ్లు ప్రతిరోజూ రైటింగ్ ప్రాక్టీస్‌చేసేదాన్ని. ప్రశ్నలు నేనే తయారుచేసుకుని, వాటికి సమాధానాలు రాసి వాటికి నిజాయతీగా మార్కులు వేసుకునేదాన్ని. దీనివల్ల అసలు ప్రిపరేషన్‌లో నా స్థాయి ఏంటి? ఎంతవరకు పోటీలో జయించగలను? అనేదానికి ఈ కసరత్తు ద్వారా సమాధానం లభించేది.

మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది. ఏం ప్రశ్నలు అడిగారు?
ఆల్కాశిరోహీ బోర్డు సుమారు 25 నిమిషాలపాటు నన్ను ఇంటర్వ్యూచేసింది. ప్రధానంగా విద్యా నేపథ్యంతోపాటు, పలు సమాకాలీన అంశాలపై ప్రశ్నలు అడిగారు.
* ఎల్‌ఈడీ, దాని నిర్మాణం గురించి చెప్పండి?
* భారతదేశ ఆర్థికవ్యవస్థ ముందున్న ప్రస్తుత సవాళ్లు?
* వాటిని ఏవిధంగా పరిష్కరించాలి?
* అమర్త్యసేన్ గురించి మీకేం తెలుసు?
* ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు జరుగుతుండడానికి కారణం? దీనికి పరిష్కారం మీరైతే ఏం చూపుతారు?
* తెలంగాణపై మీ అభిప్రాయం?
* చైనా ఆర్థికంగా బలోపేతం కావడానికున్న సానుకూల అంశాలు?
* 1963 భారతదేశ విదేశాంగ విధానం గురించి చెప్పండి?
* ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ అంటే?
* సియాచిన్ గ్లేసియర్‌పై మీకున్న సమాచారం చెప్పండి?
* భారత్,పాక్ శత్రుదేశాలుగా మారడానికి కారణం. రెండు దేశాల మధ్య వివాదాలపై మీ అభిప్రాయం?
* కాగ్ బయటపెట్టిన బొగ్గు కుంభకోణం నేపథ్యం వివరించగలుగుతారా?

ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ప్రశ్నల సరళి ఎలా ఉంది?
2009లో నేను రాసిన మొదటి సివిల్స్ పరీక్షకు, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ప్రిలిమ్స్‌లోను, మెయిన్స్‌లో ప్రశ్నలు అడిగేతీరులో ఎన్నో మార్పులొచ్చాయి. ఇప్పుడు కేవలం అభ్యర్థి ఎనలిటికల్ స్కిల్స్‌తోపాటు, సమాకాలీన అంశాలపై అభ్యర్థికి ఎంతమేర పట్టుంది? అతని ఆలోచన విధానాన్ని పసిగట్టేలా? ప్రశ్నలు అడుగుతున్నారు. మెయిన్స్‌లో చదువుకున్న సిలబస్‌లోంచే ప్రశ్నలు వచ్చినా.. అడిగే విధానంలో మాత్రం సమాకాలీన అంశాలను తప్పనిసరిగా ప్రస్తావించే విధంగా అడుగుతున్నారు. అంటే.. చదువుకున్న సిలబస్ నుంచే సమాధానాలు రాయడంతోపాటు వాటికి ప్రస్తుత పరిస్థితులు జోడించి ఆన్సర్స్ రాస్తేనే మెయిన్స్‌లో నెగ్గుకువచ్చే పరిస్థితి ఇప్పుడు. ఒక్క విషయం ఏంటంటే.. ఆప్షనల్స్ సబ్జెక్టులకు సంబంధించి పూర్తి నాలెడ్జ్‌తోపాటు సమగ్ర అవగాహన, విశ్లేషణాత్మక శక్తి స్థాయి ఎంతుందనే దానిపైనే యూపీఎస్సీ బోర్డు అభ్యర్థులను పరీక్షిస్తోంది.

రెండుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యారు? లోపమేంటి? ఎలా సరిదిద్దుకున్నారు?
గత రెండు ఇంటర్వ్యూ అటెంప్ట్‌లను ఒక్కసారి విశ్లేషించుకున్నా. రెండోసారి ఇంటర్వ్యూకన్నా మొదటిసారే ఎక్కువ మార్కులు వచ్చాయి. సమాధానాలు చెప్పేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేకపోవడం, చిరునవ్వుతో కాకుండా బిగుసుకుపోయి సమాధానాలు చెప్పడం, ముఖకవళికలు సరిగ్గా లేకపోవడంతో మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు రెండో ఇంటర్వ్యూకి అసలు సరిగ్గా ప్రిపేర్‌కాకుండానే వెళ్లడంతో చాలా యావరేజ్‌గా అటెంప్ట్‌చేశాను. దాంతో నాలో లోపాలను నేనే గుర్తుచేసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. ఆర్‌సీరెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్ అధ్యాపకులు కృపాదానం తదితర ఫ్యాకల్టీ వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ ఎక్స్‌ప్రెషన్స్‌పై శిక్షణ తీసుకున్నా. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ వద్ద కూడా అనలిటికల్ స్కిల్స్, చిరునవ్వుతో సమాధానం చెప్పవడం వంటి స్కిల్స్ నేర్చుకున్నా.

ఐఏఎస్ రాయాలనుకుంటున్న అభ్యర్థులకు మీరిచ్చే సూచన?
సివిల్స్ రాయాలనుకునేవారెవరైనా ముందు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. పోటీలో ఎంతమంది ఉన్నా.. 100లోపు ర్యాంకు నాదేననుకుని ప్రిపరేషన్ చేయాలి. ఒకటి రెండుసార్లు అపజయాలు ఎదురైనా ఏ మాత్రం కుంగిపోవద్దు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని వాటిని సరిదిద్దు కోవాలి. పరీక్ష ప్యాట్రన్స్ బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆప్షనల్ సబ్జెక్టులు ఏవి ఎంచుకున్నా.. సబ్జెక్టు పరిధిని పూర్తిగా తెలుసుకుని చదవాలి. అంతేకాకుండా.. రెండు ఆప్షనల్స్‌ను ఒకేసారి చదవకుండా ఒకదానిపై కొంత పట్టుసాధించాక రెండోదానిపై దృష్టిసారించాలి.

Published date : 22 May 2012 07:50PM