Skip to main content

రైతు కొడుకు ఐపీఎస్సా..? అంటూ ఆశ్చర్యం..: బాలస్వామి, ఐపీఎస్

ఈ మిడిల్ క్లాస్ అబ్బారుులంతా నేడు ఐపీఎస్ అధికారులయ్యారు. కల సాకారం చేసుకున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులే మంచి ఉదాహరణ.
సివిల్స్ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్‌నెట్ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు.

తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటారుుంచింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్ మహాజన్, బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్ చెన్నూరి...అంతా లోకల్ బ్యాచ్. వీరిలో అఖిల్ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది.


దూరవిద్యలో డిగ్రీ.. ఏడోసారి సివిల్స్ రాసి ఎట్టకేలకు ఎంపికయ్యానిలా..
చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. మాది మహబూబ్‌నగర్‌లో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌లోనే జాబ్ రావడంతో చేరాను. అరుునా కల మీద మమ కారంతో దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. తరువాత ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. నిజాం కాలేజీలోనూ పాఠాలు బోధించా. ఏడోసారి సివిల్స్ రాసి ఎట్టకేలకు ఎంపికయ్యా. -బాలస్వామి, ఐపీఎస్
Published date : 07 Sep 2020 05:11PM

Photo Stories