నా కృషికి ప్రతిఫలం ఈవిజయం - సివిల్స్ 131 ర్యాంకర్ రాజీవ్ గాంధీ
Sakshi Education
అనుకున్నది సాధించాలనే పట్టుదల, విజయాన్ని చేరుకునే వరకూ సడలని నిబద్ధత, ఇవే తన విజయానికి కారణాలని అంటున్నారు సివిల్స్ 131వ ర్యాంకర్ రాజీవ్ గాంధీ. పోటీ పరీక్షల విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుందని పేరుపడిన శ్రీకాకుళం నుంచి సివిల్స్‌కు ఎన్నికై తన జిల్లాకున్న పేరు ప్రఖ్యాతుల్ని గాంధీ తనవిజయంతో మరింత ఇనుమడింపజేశారు. ఈ విజేతతో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.
మీకుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం గురించి తెలపండి?
మాది శ్రీకాకుళం. నాతల్లిదండ్రులిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. నాన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అమ్మ టీచర్. నా సోదరి డాక్టర్ రజనీ గాంధీ, నేను, నాభార్య ఇదీ నా కుటుంబం.
నేను పదవతరగతి పోలంకి ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని నారాయణ జూనియర్ కళాశాలలోను చదివాను. అనంతరం ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుంచి కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను.
మీరు సివిల్స్ రాయాలని ఎప్పుడనుకున్నారు? మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్‌వైపు రావడానికి కారణం?
ఇంటర్ వరకూ సివిల్స్ రాయాలనే ఆలోచన నాకు లేదు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే నేను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. అందుకు ప్రథాన కారణం సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలనే నా సంకల్పం. మానవ సేవే మాధవ సేవ అనేది నాకు అత్యంత ఇష్టమైన సూక్తి. ఏదో సంస్థలో అత్యధిక వేతనానికి ఉద్యోగంలో చేరి ఉద్యోగం, ప్రాజెక్టు, హైక్ ... ఈవిధంగా జీవితం గడిపేయడం నాకు కష్టంగా తోచింది. అందుకే బాగా ఆలోచించి సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.
మీరు ఎంచుకున్న ఆప్షనల్స్ ఏమిటి? ప్రిపేరేషన్ సమయంలో మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
నా ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ. నేను ఎంచుకున్న ఆప్షనల్స్‌ను కూళంకషంగా చదివాను. ఓవిధంగా చెప్పాలంటే ప్రిపరేషన్ సమయంలో ఆప్షనల్స్‌పై మంచి పట్టుసంపాదించాను. ఇంటర్వ్యూ సమయంలో ఇది నాకు బాగా ఉపయోగపడింది. నాకు స్వతహాగా ఓపిక ఎక్కువ, దీంతో ప్రిపరేషన్ సమయంలో మెటీరియల్ సంపాదించడంలోను, ఆయావిభాగాలని, అధ్యాయాలని కూళంకషంగా చదవడంలోను నా తత్వం నాకు ఉపయోగపడింది. ఓవిధంగా చూస్తే నావిజయంలో ఈ నిబద్ధతదే ప్రముఖ పాత్ర.
సివిల్స్‌ని ఎన్నో అటెంప్ట్‌లో సాధించారు?
ఇప్పటికి నేను మూడుసార్లు పరీక్షకి హాజరయ్యాను. నా రెండో అటెంప్టులో రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు సెలక్టయ్యాను. అయితే ఐఏఎస్ అవ్వాలనే నా ఆకాంక్ష నన్ను మూడో ప్రయత్నంలో విజేతను చేసింది.
మీరు కోచింగ్ తీసుకున్నారా? సివిల్స్ సాధనలో కోచింగ్ ప్రాముఖ్యతని తెల్పండి?
నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు న్యూఢిల్లీలోని పవన్‌కుమార్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఆంత్రోపాలజీకి మునిరత్నంరెడ్డి మెటీరియల్ ఉపయోగపడింది. నా దష్టిలో సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర ఉంది. ముఖ్యంగా సైన్స్ బ్యాగ్రౌండ్ విద్యార్థులకు ఆయా ఆప్షనల్స్‌పై సరైన అవగాహన ఉండదు. అందుకు కారణం వారు ఆయావిభాగాలని ప్రాథమిక దశలోనే వదిలేసి ఉంటారు కాబట్టి. అలాంటప్పుడు కోచింగ్ ఉపకరిస్తుంది. అలా అని కోచింగ్ మీదే పూర్తిగా ఆధారపడాలని నా ఉద్దేశం కాదు. అయితే నిపుణుల సలహాలు, సూచనలు, తోటి సివిల్స్ అభ్యర్థులతో చర్చలు ఇవన్నీ విజయసాధనలో ఉపకరించేవే. కాబట్టీ ఆయా ఆప్షనల్స్‌ను బట్టి కోచింగ్ తీసుకోవాలో, సొంతంగా ప్రిపేరవ్వాలో ఆయా అభ్యర్థులే నిర్ణయించుకోవాలి.
మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు?
నా సోదరి డాక్టర్. రజనీ గాంధీ, ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. నిబద్ధత, సాధించేవరకూ అలుపెరగని కృషి చేయడం నేను ఆమె నుంచి నేర్చుకున్నవే. ప్రిపరేషన్ సమయంలో నాతల్లిదండ్రులు, నాభార్య అందించిన తోడ్పాటు మరువలేనిది. వారికి నేనెంతో రుణపడి ఉంటాను.
సివిల్స్ రాయలనుకుంటున్న అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
మిమ్మల్నెవరితోనూ పోల్చుకోకండి. మీరనుకున్నది సాధించే వరకూ విశ్రమించకండి. మీ కృషి మిమ్మల్ని తప్పకుండా ఉన్నత స్థానంలో నిలుపుతుంది.

Published date : 05 May 2012 07:26PM