Skip to main content

ఇంటర్‌లో తప్పా.. ఐఏఎస్‌ పాసయ్యా..

ఇంటర్మీడియట్‌లో తప్పిన నేను.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరుకోవాలనే బలమైన కోరకతో ఐఏఎస్‌ పాసయ్యాయని అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ కె.సత్యనారాయణ అన్నారు.

జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధించాలనే తపన చాలా బలంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే కోరికతో పాటుగా కష్టపడేతత్వం, క్రమశిక్షణ ఉండాలని చెప్పారు. మొక్కబడిగా చదవడం, రోజు వారి పనులు చేయడం అనేది మంచిది కాదన్నారు. చదువుకునే వయస్సులో మంచి ఆహారం తీసుకోవాలని దాని వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని తెలిపారు.

చాలా సార్లు ఫెయిల‌య్యాను..
తాను ఇంటర్‌తో పాటుగా సివిల్స్‌ను ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ప్రిలిమ్స్‌తో పాటుగా మెయిన్స్‌ చాలా సార్లు తప్పానని చెప్పారు. ఓటమి నుంచి తాను పాఠాలు నేర్చుకుంటూ చేసిన తప్పులను గుర్తించి దిద్దుకుంటూ ముందుకు సాగానని వివరించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే కాని కుంగిపోకూడదన్నారు. మన మీద మనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉండాలని, అప్పుడే విజయాలు సొంతం అవుతాయన్నారు.

Published date : 17 Sep 2021 07:36PM

Photo Stories