ఆత్మవిశ్వాసంతో ముందడుగు...తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్
Sakshi Education
ఎన్‌ఐటీ నుంచి బీటెక్ పట్టా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు.. విదేశాల్లోనూ పని చేసే అవకాశం.. ఇవేవీ కోయ శ్రీహర్షకు సంతృప్తి ఇవ్వలేదు. చిన్ననాటి కల ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం వదులుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించి, యువతకు ఆదర్శంగా నిలిచిన శ్రీహర్ష సక్సెస్ స్టోరీ...
మాది ఖమ్మం జిల్లా. నాన్న కోయ నాగేశ్వరరావు, అమ్మ సులోచన. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయులు. ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నా. ఆరు నుంచి పదో తరగతి వరకు ఖమ్మం ఎస్‌ఎఫ్‌ఎస్‌లో చదివాను. ఇంటర్ హైదరాబాద్‌లో, ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌లో ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌ను 2012లో పూర్తిచేశాను. ఐఏఎస్ అవ్వాలనే ఆలోచన నాకు స్కూల్ స్థాయి నుంచే ఉంది.
ఉద్యోగం వదిలేశా :
ఇంజనీరింగ్ ఫైనలియర్‌లో ఉండగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్‌లో ప్రాజెక్టు ఇంజనీర్‌గా మంచి ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా. ఉద్యోగంలో భాగంగా ప్రాజెక్టు అవసరాల మేరకు విదేశాల్లోనూ విధులు నిర్వర్తించా. 2012 నుంచి నాలుగేళ్ల పాటు పనిచేశాక.. 2016లో ఉద్యోగానికి రాజీనామా చేశా.
14 గంటల ప్రిపరేషన్...
తొలుత సివిల్స్ పరీక్ష సరళి, ప్రశ్నల విధానం, ఏయే ఆప్షనల్‌కు ఎక్కువ మార్కులు వస్తున్నాయి.. ఏ పుస్తకాలు చదవాలి.. కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి.. తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేశా. 2016 జూన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో చేరా. ముగ్గురు మిత్రులతో కలిసి ఫ్లాట్ అద్దెకు తీసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టాను. కోచింగ్‌లో రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున రెండున్నర గంటల పాటు క్లాసులు జరిగేవి. అక్కడ ఎలా చదవాలి? ఏం చదవాలనే దానిపై గెడైన్స్ ఇస్తారు. అప్పటికి చదవడం ఆపేసి నాలుగేళ్లవుతుంది. పుస్తకాలను అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. క్రమేణా ప్రిపరేషన్ ప్రారంభించి... రోజుకు 12 నుంచి 14 గంటల వరకు స్థిరంగా చదవడం అలవాటు చేసుకున్నా.
ప్రిలిమ్స్ :
2016 జూలైలో మొదలైన నా సన్నద్ధత 2017 జనవరి వరకు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగించా. 2017, జూన్ 18 ప్రిలిమ్స్ పరీక్ష ఉంటే... ఫిబ్రవరి నుంచి ప్రిలిమ్స్ కోసం చదివాను. మాక్‌టెస్టులకు ఎక్కువగా హాజరయ్యా.
మెయిన్స్‌కు రైటింగ్ ప్రాక్టీస్ :
విద్యార్థులు అందరూ దాదాపు ఒకే పుస్తకాలు చదువుతారు. అందరికీ దాదాపు ఒకేవిధమైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. కానీ, పరీక్షలో మూడు గంటల్లో ఏం రాశామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అందుకే నేను రైటింగ్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చా. మెయిన్స్‌కు పది రోజుల ముందు డెంగ్యూ బారిన పడడంతో ఆందోళన చెందా. అసలు పరీక్షలు రాయగలనా అని భయపడ్డా. ఎంతో ఒత్తిడికి గురయ్యా. అయితే ఆత్మవిశ్వాసంతో కోలుకొని పరీక్షలకు హాజరయ్యాను.
ఆప్షనల్ ఎంపిక :
ఆప్షనల్ సబ్జెక్టు ఎంపికలో తర్జనభర్జనపడ్డా. నా మిత్రుడు అభిషేక్ ఇగ్నోలో ఆంథ్రోపాలజీలో పీజీ చేస్తున్నాడు. అతను సహాయం చేస్తాననడం, మెటీరియల్ లభ్యత, గత రెండు మూడేళ్లుగా ఆంథ్రోపాలజీకి మంచి మార్కులు వస్తుండటం తదితర కారణాల వల్ల ఆంథ్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నా. సన్నద్ధతలో 60 శాతం సమయాన్ని దానికే కేటాయించాను. అందుకే ఇందులో 500కు 338 మార్కులు వచ్చాయి.
రిపీటెడ్‌గా చదివా :
ప్రతి సబ్జెక్టుకు ఎక్కువ పుస్తకాలు కాకుండా.. ఒకట్రెండు పుస్తకాలనే రిపీటెడ్‌గా చదివేవాడిని. సమాధానాలు రాయడంలోనూ ప్రత్యేకత కనబర్చడం నాకు లాభించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లోతుగా రాయాల్సి ఉంటుంది. నేను ఒక్కో ప్రశ్నకు నేరుగా సమాధానాలు రాయడం అలవర్చుకున్నా. బుల్లెట్ పాయింట్ల రూపంలో, భిన్న కోణాల్లో సమాధానాలు రాయడం వల్ల వాల్యూయేటర్‌ను ఇంప్రెస్ చేయగలిగానని నమ్ముతున్నాను.
ఇంటర్వ్యూ ...
నా జాబ్ ప్రొఫైల్, బ్రెజిల్ (నా ఉద్యోగంలో భాగంగా అక్కడ పనిచేశా) గురించి, ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్‌పైనా, నా బలాలు- బలహీ నతలు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌పై ప్రశ్నలు అడిగారు. పీకే జోషి బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో మార్కులు కాస్త నిరాశ పర్చాయి.

Published date : 13 Aug 2018 06:36PM