Skip to main content

Success Story: నా కోరిక ఐఏఎస్.. ఎలా సాధించాలో కూడా తెలియదు.. కానీ చివరికి..

చాలా మంది యువతీ యువకులు చిన్నతనం నుంచే ఐఏఎస్‌ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు.
Aparajita Sharma, IAS
Aparajita Sharma, IAS

అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి యూపీఎస్సీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. అందుకోసం ఎన్నో రోజులు కృషి, పట్టుదలతో చదువుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ అధికారి అంటే ఏమిటో కూడా తెలియని ఓ అమ్మాయి ఎంతో శ్రమించి ఐఎస్ఎస్ అధికారిణి అయ్యింది. ఐఏఎస్ అధికారిణి అప్రజితా శర్మ విజ‌య‌ర‌హ‌స్యం మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం : 
అపరాజిత తండ్రి IRS అధికారిగా పదవీ విరమణ పొందారు. తల్లి ప్రొఫెసర్.

ఎడ్యుకేష‌న్ : 
బనారస్ లో పాఠశాల విద్యను అభ్యసించిన అపరాజిత ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు.

మొదటి ప్రయత్నంలోనే టాప‌ర్‌...నా ల‌క్ష్యం ఇదే​​​​​​​

చిన్ననాటి కలను ఇలా.. 

IAS


బనారస్ కు చెందిన అపరాజిత శర్మకు ఐఏఎస్ అధికారి అంటే ఎవరో తెలియదు. ఆ పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలో కూడా తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి IAS అధికారి కావాలనే కోరిక ఉంది. ఇక మనవరాలు ఏదో ఒకరోజు అధికారిణి అవుతుందని ఆమె తాత అందరికీ చెప్పారు.. చిన్నప్పుడు ఆఫీసర్ అంటే ఎవరో తెలియదు.. కానీ వయసు వచ్చే కొద్దీ ఐఏఎస్ చదవాలని గట్టిగా సంకల్పించుకున్నారు. ఐఏఎస్ ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అపరాజిత 2017 సంవత్సరంలో ఆల్ ఇండియా లో 40 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సివిల్స్ సాధించారు. దీంతో ఆమె చిన్ననాటి కల నెరవేర్చుకున్నారు.

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

కొన్ని సంఘటనలు..
చదువు పూర్తయ్యాక అపరాజితకు ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆమె డిపార్ట్‌మెంట్‌లోఅపరాజిత ఒక్కతే అమ్మాయి. అయితే కంపెనీలో జరిగిన కొన్ని సంఘటనలు అపరాజితకు స్ఫూర్తినిచ్చాయి. దీంతో అపరాజిత సివిల్ సర్వీసెస్ పరీక్షను రాయాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ప్రయత్నించాలని.. గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. 

ప్రిప‌రేష‌న్ ఇలా..

IAS Story


పరీక్షలకు సిద్ధం కావడానికి సీనియర్స్ ను అడిగి ప్రణాళిక బద్దంగా చదువుకోవడం మొదలు పెట్టారు. సిలబస్‌ను పరిశీలించి ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలను సేకరించి తాను అనుకున్నది చివరికి సాధించారు. అందుకనే సివిల్స్ చదువుకునేవారికి కూడా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళితే.. సక్సెస్ మీ సొంతం అని చెబుతున్నారు.అపరాజిత ఐఏఎస్ ప్రిలిమ్స్ కు ప్రిపేర్‌ అయ్యే సమయంలో బేసిక్స్ తో పాటు… వార్తాపత్రికలపై దృష్టి సారించారు. ప్రిపరేషన్ సమయంలో మూడు వార్తాపత్రికలు చదివారు.

Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా ప‌నిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..

ఇంటర్వ్యు సమయంలో..

aparajita sharma ias


ఐఏఎస్ కు సిద్దమవుతున్న వారికి ఒకటే చెబుతున్నారు అపరాజిత. ఇంటర్వ్యూ సమయంలో అబద్ధం చెప్పకూడదు. అక్కడ కూర్చున్న వారు మీ కంటే తెలివైన వారు, వారు మీ అబద్ధాన్ని సెకన్లలో పట్టుకుంటారు. మీకు సమాధానం తెలియకపోతే క్షమించండిని అని నిజాయతీగా చెప్పాలని సూచిసున్నారు. అంతేకాదు ఇంటర్వ్యు సమయంలో మీ మనసులో ఉంది చెప్పడం మంచిది. ఎందుకంటే అక్కడ జరిగేది మీ నిజయతీకి పరీక్ష.. మీ జ్ఞానానికి తెలివి తేటలకు కాదు అంటున్నారు ఐఎఎస్ అపరాజిత.

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 22 Feb 2022 06:12PM

Photo Stories