Skip to main content

Inspiring Success Story : ఈ నిరుపేద.. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఐఏఎస్ సాధించాడిలా..

అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి క‌లెక్ట‌ర్‌ అయ్యాడు మధ్యప్రదేశ్‌కు చెందిన నిరీష్ రాజ్‌పుత్.
Nirish Rajput, IAS
Nirish Rajput , IAS

చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు ఈ యువ‌కుడు. అతడి సక్సెస్ స్టోరీ మీకోసం..

ఆర్థికంగా ఇబ్బందులు..

ఎందరో సామాన్య  యువకులకు ఆదర్శంగా నిలిచాడు ఈ యువ ఐఏఎస్ అధికారి. చాలా మంది యువత ఐఏఎస్‌లు కావాలని కలలు కంటుంటారు. వారి స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) సివిల్స్ పరీక్షలను నిర్వహిస్తున్న విష‌యం తెల్సిందే. దేశంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఇది ఒకటి. ఇందులో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు. ఎక్కువ మంది ఔత్సాహికులు కోచింగ్ సెంటర్లలో చేరితే.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు సొంతంగా ప్రిపేర్ అవుతుంటారు. 

Inspirational Story: పేదరికంపై ఉన్న క‌సితోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించానిలా..

కోచింగ్ లేకుండానే..
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన నిరీష్ రాజ్‌పుత్ కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యాడు. ఆల్ ఇండియా స్థాయిలో 370వ ర్యాంకు సాధించి IAS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నాడు.

కుటుంబ నేప‌థ్యం : 

Nirish Rajput IAS Family


పేదరికం వెంటాడుతున్నా ఐఏఎస్ అధికారి కావాలన్న తన తన చిరకాల స్వప్నాన్ని ఎన్నో కష్టనష్టాలను భరించి నెరవేర్చుకున్నాడు. వీరి ఇళ్లు కేవలం 300 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. తండ్రి వీరేంద్ర రాజ్‌పుత్.. టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిరీష్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు.

Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా ప‌నిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..

చ‌దువు : 
నిరీష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకున్నాడు. పరీక్షల ఫీజుల కోసం ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు నిరీష్. గాల్వియర్‌లోని ప్రభుత్వ కళాశాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ఇందు కోసం అతని సోదరులు సహాయం చేశారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే ముందు ఐఎఎస్ అధికారి ఎలా కావాలో అతనికి తెలియదు. కానీ, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధిస్తే ప్రజల జీవితాలను మార్చవచ్చన్న సంగతి అతనికి తెలుసు.

యూపీఎస్‌సీ పరీక్షల స్టడీ మెటీరియల్స్ కోసం..
ఆర్థిక ఇబ్బందులు కారణంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఇంటిలోనే ప్రిపేర్ అయ్యాడు. ఇందుకు అతని సోదరులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో, ఉత్తరాఖండ్‌‌లో కొత్తగా ప్రారంభించిన కోచింగ్ సెంటర్‌లో భోదించడానికి తన స్నేహితుల్లోని ఒకరు నిరీష్‌ను సంప్రదించారు. ప్రతిఫలంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్స్ ఇస్తానని అతను నిరీష్‌కు హామీ ఇచ్చాడు.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

స్నేహితుడు మోసంతో..
రెండేళ్లు గడిచేసరికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాగా వృద్ధి చెందింది. దీంతో నిరీష్ అవసరం లేదని భావించిన అతని స్నేహితుడు మోసం చేశాడు. రెండేళ్ల పాటు కోచింగ్ సెంటర్‌లో పాఠాలు చెప్పినా ప్రతిగా ఎటువంటి ప్రతిఫలం పోందలేదు నిరీష్. చేసేది లేక కట్టుబట్టలతో ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ యూపీఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు.

తన చిరకాల కోరిక..
యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఢిల్లీలో సన్నద్ధమవుతున్న అనేక మంది ఔత్సాహికులను కలుసుకున్నాడు. ప్రిపరేషన్‌‌ ఎలా అవ్వాలో వారు నిరీష్‌ కు వివరించారు. ఎటువంటి కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ తీసుకోకుండానే తన నాలుగో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా లెవల్‌లో 370వ ర్యాంకుతో సాధించి తన చిరకాల కోరిక ఐఏఎస్‌ను సాధించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందినవారు తాము సివిల్స్‌లో విజయం సాధించలేమని నిరాశ పడుతుంటారు. ఆ భావన సరికాదు. ఎవరికైనా పట్టుదల, కృషి ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది.

Success Story: పేదరికంలో పుట్టా.. సివిల్స్ కొట్ట‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డానిలా..

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Published date : 05 Mar 2022 05:57PM

Photo Stories