Skip to main content

Inspiring Success Story: భార్య‌, భ‌ర్త ఇద్ద‌రు ఐఏఎస్‌లే.. ఈ స‌మ‌స్య‌ల‌తో పోరాడి.. చివ‌రికి

ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే అని పెద్దలు ఏనాడో సెలవిచ్చారు. భర్త ఐఏఎస్, తాను కూడా ఆ హోదాను అందుకుని ప్రజాసేవ చేయాలని తపించారామె.
దివ్యప్రభ, రామ్‌ ప్రసాత్‌ మనోహర్‌
దివ్యప్రభ, రామ్‌ ప్రసాత్‌ మనోహర్‌

ఎన్ని అడ్డంకులు ఎదురైనా సొంతంగా ప్రిపరేషన్‌ చేపట్టి లక్ష్యాన్ని సాధించారు క‌లెక్ట‌ర్ దివ్యప్రభ.

22 ఏళ్ల వయసులోనే ఐఏఎస్‌..
సమయం ఏదైనా, కష్టాలు ఎలాంటివైనా, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటున్నారు యువ ఐఏఎస్‌ అధికారిణి దివ్యప్రభ. బళ్లారి నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా కూడా ప‌నిచేశారు. 22 ఏళ్ల వయసులో 2014 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 82వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌ ఎంచుకున్నారు. 

ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర మహా నగరాల్లో పెద్ద పెద్ద కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారంటే పొరపాటే. గర్భవతిగా ఉండగానే, కష్టపడి చదివి తాను కలలుగన్న ఐఏఎస్‌ సర్వీస్‌ను అందుకున్నారు. ఈ ఐఏఎస్‌ దంపతుల స్వస్థలం తమిళనాడు అయినప్పటికీ కన్నడలో బాగా మాట్లాడడం విశేషం. దివ్యప్రభ విజయగాథ గురించి ఆమె మాటల్లోనే..

అప్పటికే పెళ్లి.. కానీ
నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ చదవాలనే తపన ఉండేది. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ అయిన తర్వాత సివిల్స్‌ పరీక్షలు రాసి, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుకు ఎంపికై కొంతకాలం అందులో పనిచేశాను. అయితే ఎలాగైనా ఐఏఎస్‌ కావాలని అనుకున్నా. అప్పటికే పెళ్లి కూడా అయింది. నా భర్త రామ్‌ ప్రసాత్‌ మనోహర్‌ ఐఏఎస్‌ అధికారి. బళ్లారి జిల్లా కలెక్టర్‌గా కూడా ప‌నిచేశారు.

గర్భంతో ఉన్నప్పటికీ..
పెళ్లి అయిన తర్వాత మా వారు కూడా ఐఏఎస్‌ సాధించాలని ప్రోత్సహించారు. గర్భంతో ఉన్నప్పటికీ పట్టుదలతో సివిల్స్‌ పరీక్షలు ప్రిలిమినరి, మెయిన్స్‌లో పాసయ్యాను. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. జాతీయస్థాయిలో 82వ ర్యాంకు రావడం ఎనలేని సంతోషం కల్గించింది.

Success Story: ఈ కసే.. న‌న్ను ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యేలా చేసిందిలా..

సొంతంగా పుస్తకాలు చదివా..
ప్రిపరేషన్‌ కోసం సొంతంగా పుస్తకాలు చదివా. సివిల్స్‌ చేయాలనుకునే విద్యార్థులు ఎవరైనా సరే వారు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌ను సివిల్స్‌ పరీక్షల ఆప్షన్‌లో పొందుపరచాలి. నేను డిగ్రీలో అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చేశా. సివిల్స్‌లోనూ నేను అగ్రికల్చర్‌ సంబంధిత సబ్జెక్ట్‌ ఎంచుకోవడం వల్ల సులభంగా పాస్‌ కావడానికి వీలైంది. ఇలా కాకుండా చాలా మంది విద్యార్థులు తెలియకుండా తమకు ఏదో తోచిన విధంగా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంతో వారి లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

నా అదృష్టంగా..
డెహ్రాడూన్‌లో ఐఏఎస్‌ శిక్షణ పూర్తి చేసిన తర్వాత కార్వారలో ప్రొబేషన్‌ పూర్తి చేశా. అనంతరం రాయచూరు జిల్లా లింగసూగూరులో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేసిన తర్వాత బళ్లారిలో ప్రప్రథమంగా నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టా. ఆ స‌మ‌యంలో జిల్లా కలెక్టర్‌ అయిన నా భర్త నుంచి నగరాభివృద్ధికి ఆయన సహకారం, సలహాలు కూడా తీసుకుని అభివృద్ధికి కృషిచేశాను.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

​​​​​​​IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Published date : 14 Mar 2022 06:09PM

Photo Stories