RGUKT Old Student 11th rank in Civil Services: సివిల్స్‌లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక్
Sakshi Education

నూజివీడు : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఒంగోలు క్యాంపస్‌లో 2016–22 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని సాయి శివాని యూపీఎస్‌సీ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించింది. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి దేశంలో అత్యున్నత స్థాయిలో ర్యాంకు సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు, అభ్యాసన పట్ల చూపిన నిబద్ధతకు నిదర్శనం.
సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ట్రిపుల్ ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్‌చార్జి చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయ్‌కుమార్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఆమెకు అభినందనలు తెలిపారు.
Published date : 26 Apr 2025 08:27AM
Tags
- Rajiv Gandhi University of Knowledge Technologies Ongole
- Sai Shivani UPSC result 11th rank
- Rural background overcoming challenges UPSC
- Best UPSC rank achieved by RGUKT student
- UPSC Civil Services Exam Success story
- Triple IT Telangana student UPSC achievement
- Rajiv Gandhi University of Knowledge Technologies success
- UPSC 11th rank top achiever
- Rural student success in UPSC
- Achievements of Sai Shivani RGUKT
- Chancellor and Vice Chancellor congratulates UPSC rank holder
- Sai Shivani UPSC rank Triple IT Ongole
- UPSCResults