Free Govt Coaching for Civils 2022: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్, వసతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి.. అనుకున్న లక్ష్యాలు సాధించాలి.. ఇదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసి.. పేద, ప్రతిభ గల విద్యార్థులకు చేయూతనిస్తోంది. మరోవైపు ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష ఉన్న నిరుద్యోగులకు ఉచిత వసతి కల్పించి.. ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. వారికి కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తూ.. వారి భవితకు మార్గం చూపుతోంది. ముఖ్యంగా సివిల్స్‌కు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందు కోసం రుషికొండలో సుమారు రూ.4.50 కోట్లతో డా. బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవన్ నిర్మాణం చేపట్టింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ తదితర సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించే దిశగా నిరుద్యోగులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో ఇక్కడ ఉచితంగానే శిక్షణ అందజేస్తున్నారు. వాస్తవానికి ఈ స్టడీ సర్కిల్ రెండేళ్ల కిందట ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్ తదితర కారణాల దృష్ట్యా ప్రారంభం విషయంలో జాప్యం జరిగింది. 2022, జనవరి నుంచి ఇక్కడ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!
శిక్షణ పొందేందుకు అర్హులు వీరే..

రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక్కటే స్టడీ సర్కిల్. విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో ఈ భవన్‌లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఏటా జూలైలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం.. ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారు ఇక్కడ శిక్షణ పొందేందుకు అర్హత సాధిస్తారు. శిక్షణతో పాటు వసతి ఇతర సదుపాయాలన్నీ ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తుంది.
సకల సౌకర్యాలు..

ఇక్కడ అభ్యర్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నారు. మూడంతస్తుల భవన సముదాయంలో గ్రంథాలయం, శిక్షణ కార్యక్రమాలకు అనువుగా మూడు తరగతి గదులు, రెండు కాన్ఫెరెన్స్ హాళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు తదితర సౌకర్యాలు కల్పించారు. మహిళ, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా వసతి గృహాలు వంటి ఎన్నో సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.
రోజుకు నాలుగు తరగతులు..

సివిల్స్‌లో విజయం సాధించాలంటే కచ్చితంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పాటించాల్సిన మెలకువలపై అవగాహన అవసరం. అందుకే ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. రోజు తప్పించి రోజు మాక్ టెస్ట్ ఉంటుంది.
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
టాపర్‌గా నిలవాలనేది లక్ష్యం
సివిల్స్‌లో రాష్ట్ర టాపర్‌గా నిలవాలనేది ప్రధాన లక్ష్యం. ఇక్కడ స్టడీ సర్కిల్‌లో అన్ని సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం మా అదష్టం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మాలాంటి వారి కోసం సర్కిల్ భవనం ఏర్పాటు చేయడం మాకు మంచి అవకాశం. కష్టపడి చదివి ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకుంటాను. ఎ.రమణమూర్తి, విజయనగరం
సౌకర్యాలు బాగున్నాయి
ఇక్కడ స్టడీస్‌తో పాటు ఒక్కో విద్యార్థికి సుమారు 8 వేల విలువైన పుస్తకాలను ఉచితంగా అందజేశారు. కంప్యూటర్ ల్యాబ్స్, గ్రంథాలయం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో చదువుకునేందుకు ఎంతో అనువుగా ఉంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధిస్తాను. జె. వినయ్‌కుమార్, రాజమండ్రి
మంచి అవకాశం
సివిల్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలనుకునే విద్యార్థులకు స్టడీ సర్కిల్ మంచి అవకాశం కల్పిస్తోంది. ప్రతి విద్యార్థీ ఇక్కడ అవకాశాలను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఏటా ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు జూలైలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం.
నాగేశ్వరరావు, ఏవో, సాంఘిక సంక్షేమ శాఖ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్