CBSE 10th, 12th Class Results 2025 Live Updates: రేపు ఉదయం 11 గంటలకు సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల? బోర్డు ఏం చెప్పిందంటే..

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 6వ తేదీన ఉదయం 11గంటలకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు పేరుతో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ప్రకటనపై తాజాగా సీబీఎస్‌ఈ బోర్డు స్పందించింది.
ఈ వార్తలో నిజం లేదని, అది ఫేక్ లెటర్ అంటూ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది. అంతేకాకుండా తమ అఫీషియల్ అకౌంట్‌లో త్వరలోనే రిజల్ట్స్ ప్రకటన తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24.12 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 17.88 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాశారు.
సీబీఎస్‌ఈ ఫలితాలు ఎప్పుడు?
సీబీఎస్‌ఈ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాల విడుదలకు సంబంధించి బోర్డు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గతేడాది కూడా మే రెండో వారంలోనే ఫలితాలను విడుదల చేశారు. దీంతో ఈసారి కూడా మే రెండో వారంలో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- CBSE 10th Result 2025
- CBSE 12th Result 2025
- CBSE Board Exam Results 2025
- CBSE Result Date 2025
- CBSE Class 10 Result Release Date
- CBSE Class 12 Result Updates
- CBSE Results May 2025
- CBSE Official Result Website
- How to check CBSE results online
- CBSE Term 2 Results 2025
- CBSE 10th 12th Results Live Updates
- CBSE Result 2025 News in Telugu
- CBSE Board Marks 2025
- CBSE Board Results Announcement Date
- CBSEOfficialWebsite
- CBSEResults
- cbse results latest update
- CBSE fake result notice
- CBSE result official update
- CBSE 2025 result live
- CBSE result tomorrow
- CBSE result live update