విద్య, ఉద్యోగం రెండు లక్ష్యాలను ఛేదించే ఎస్‌సీఆర్‌ఏ
Sakshi Education
భారతీయ రైల్వే.. ప్రపంచంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటి.. దాదాపు 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది.. ఇటువంటి వ్యవస్థలో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో మెకానికల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తోంది.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ) ఎగ్జామినేషన్ .. కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదంకెల జీతంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, బీటెక్ పట్టాను అందుకునే ఆరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది ఎస్‌సీఆర్‌ఏ.. 2014 సంవత్సరానికి సంబంధించి ఎస్‌సీఆర్‌ఏ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ప్రిపరేషన్ ప్లాన్, సంబంధిత వివరాలు..
విద్య, ఉద్యోగం రెండు లక్ష్యాలను ఒకేసారి ఛేదించే అద్భుత అవకాశం స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. ముఖ్యంగా ఇంజనీరింగ్ కెరీర్ దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులు.. ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామినేషన్ ద్వారా వారు కోరుకున్న బీటెక్ డిగ్రీతోపాటు రైల్వే శాఖలో మెకానికల్ ఇంజనీర్‌గా ప్రస్థానాన్ని మొదలు పెట్టే అవకాశం లభిస్తుంది.
రెండు దశలుగా
ఎస్‌సీఆర్‌ఏ ఎంపిక ప్రిక్రియ రెండు దశలుగా జరుగుతుంది. అవి.. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించి తర్వాతి దశ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
మూడు పేపర్లుగా
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్ మాధ్యమంలోనే రూపొందిస్తారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమల్లో ఉంది. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. రాత పరీక్షను మొత్తం మూడు పేపర్లుగా 600 మార్కులకు నిర్వహిస్తారు.

పేపర్ | సబ్జెక్ట్ | సమయం | మార్కులు |
పేపర్-1 | జనరల్ ఎబిలిటీ టెస్ట్ | 2 గంటలు | 200 |
పేపర్-2 | ఫిజికల్ సెన్సైస్ | 2 గంటలు | 200 |
పేపర్-3 | మ్యాథమెటిక్స్ | 2 గంటలు | 200 |
మొత్తం | 600 |
జనరల్ ఎబిలిటీ
జనరల్ ఎబిలిటీ విభాగంలో జనరల్ నాల్జెడ్, ఇంగ్లిష్, సైకలాజికల్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ భాషపై విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గ్రామర్, సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. వీటిలోని ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు బేసిక్ గ్రామర్, వొకాబ్యులరీ, యాంటానిమ్స్, సినానిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ తదితర ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి.
జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి సైన్స్ నుంచి సోషల్ స్టడీస్ వరకు ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో పర్యావరణం, సమకాలీన అంశాలు, జీవులు- జాతులు, వృక్షాలు-రకాలు, సమాజం, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటంలోని ముఖ్య సంఘటనలు, రాజ్యాంగం, పార్లమెంట్, భౌగోళిక అంశాలు, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అంతే కాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందుకోసం పరీక్ష తేదీకి ముందు ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు, రికార్డులు, కీలక సంఘటనల సమాచారం తెలుసుకోవాలి. ఇక ఈ పేపర్‌లోనే పార్ట్-బిగా నిర్వహించే సైకాలజీ టెస్ట్‌లో బేసిక్ ఇంటెలిజెన్స్, మెకానికల్ అప్టిట్యూడ్‌ను తెలుసుకునే రీతిలో ప్రశ్నలుంటాయి.
భావనల ఆధారంగా:
ఫిజికల్ సెన్సైస్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్ల మధ్య సహ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్‌ను బాగా ప్రిపేర్ అయితే.. ఇందులోని కాన్సెప్ట్స్‌ను కొద్దిపాటి మార్పులతో గ్రావిటేషన్, మాగ్నటిజం చాప్టర్లకు కూడా అన్వయించుకోవచ్చు. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం టాపిక్స్.. ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లను చదివేటప్పుడు.. మొదటి సంవత్సరంలోని గ్రావిటేషన్, ట్రాన్స్‌మిషన్ ఆఫ్ హీట్, ఫ్లూయిడ్ డైనమిక్స్ చాప్టర్లను ప్రిపేర్ కావడం మంచిది. ఇందులోని కాన్సెప్ట్స్ ఒకే పోలికతో ఉండడంతో చాలా సమయం కలిసొస్తుంది. ఫిజిక్స్‌లో మంచి మార్కుల కోసం ప్రాథమిక భావనల మీద పట్టుతోపాటు బేసిక్ ప్రిన్సిపల్స్ మీద సమగ్ర అవగాహన ఉండాలి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌ను సాధించే స్కిల్స్ పెంచుకోవాలి. ఇందుకోసం థియరీ పార్ట్‌ను బాగా చదవాలి.
కెమిస్ట్రీ అధిక శాతం థియరిటికల్‌గా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు భావనల ఆధారంగా ఉంటున్నాయి. కెమిస్ట్రీ సిలబస్ మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది. అవి.. ఫిజికల్ అండ్ జనరల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, సాలిడ్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఎనర్జిటిక్ కీలక అంశాలు. ఈ విభాగంలో రాణించడానికి కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించడంతోపాటు వివిధ ఫార్ములాలు వినియోగిస్తూ న్యూమరికల్ ఆధారిత సమస్యలను సాధన చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడిజేషన్, ఐయూపీఏసీ నోమెన్‌క్లట్టర్, ఐసోమార్సిజం, రీసోన్సెస్, హైపర్‌కంజక్షన్, స్టీరియోఐసోమార్సిజం కీలకమైనవి. ఇందులో అత్యధిక మార్కుల కోసం సిలబస్‌లో పేర్కొన్న అన్ని ప్రతి చర్యా విధానాలను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. ఈక్వేషన్స్ ఆధారంగా ఉండే ప్రాబ్లమ్స్‌ను, తెలియని సమ్మేళనాన్ని గుర్తించడం వంటి ప్రాబ్లమ్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని మూలకాల సాధారణ ధర్మాల మధ్య పోలికలు, భేదాలను బేరీజు వేసుకుని వాటిని నోట్స్ రూపంలో పొందుపర్చుకోవాలి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, మెటలర్జీ, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్‌ను పునశ్చరణ చేసుకోవాలి.
మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో సాధించిన మార్కులే మెరిట్ జాబితాలో చోటు విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇందుకోసం అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, వెక్టార్స్-అప్లికేషన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీపై పూర్తి పట్టు సాధించాలి. ఈ క్రమంలో ఆయా ఫార్ములాలు, వాటి మూలాలు, సంబంధిత సి ద్ధాంతాలను పాయింటర్స్ రూపంలో పొందుపర్చుకో వాలి. ఒక ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసే సవుయుంలో కొన్ని సార్లు ఆబ్జెక్టివ్ ట్రిక్స్ తెలుస్తారుు. అలాంటి వాటిని వెంటనే నోట్ చేసుకోవాలి. షార్ట్‌కట్స్, టిప్స్‌ను అనువర్తిస్తూ ప్రాక్టీస్ చేయుడం వల్ల స్పీడ్ పెరుగుతుంది.
పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ):
నిర్దేశిత కటాఫ్ ఆధారంగా రాత పరీక్ష మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సాధారణంగా ఒక్కో ఖాళీకి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ దశలో వ్యక్తిత్వాన్ని, గుణగణాలను, సామాజిక అవగాహనను పరిశీలిస్తారు.
శిక్షణ ఇలా:
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించిన వారికి రైల్వే మెకానికల్ విభాగంలో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వీరిని అప్రెంటిస్‌లుగా పిలుస్తారు. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ కాల వ్యవధి మొత్తం నాలుగేళ్లు ఉంటుంది. ఈ సమయంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి థియరీ, ప్రాక్టికల్ నైపుణ్యాలను అందిస్తారు. నిర్దేశిత రైల్వే వర్క్‌షాప్‌లో ఈ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాలుగేళ్ల అప్రెంటిస్ సమయంలో అభ్యర్థులు ప్రఖ్యాత బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్)-మెర్సా నుంచి బీటెక్ డిగ్రీ అందుకునే అవకాశం కూడా ఉంది.
బీటెక్ ఇలా:
నిబంధనల ప్రకారం ఎస్‌సీఆర్‌ఏ ద్వారా ఎంపికైన విద్యార్థులు పూర్తి చేయాల్సిన బీటెక్ మెకానికల్ డిగ్రీ మొత్తం నాలుగేళ్లు.. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఎంపికైన ప్రతి అభ్యర్థి ప్రతి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. అన్ని సబ్జెక్టుల్లో సగటున 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు నిర్దేశిత రైల్వే వర్క్‌షాప్‌లో నిర్వహించే అప్రెంటిస్ ట్రైనింగ్‌లో 60 శాతం మార్కులు సాధిస్తేనే.. రైల్వే కొలువు దిశగా తదుపరి దశకు అర్హత లభిస్తుంది.
స్టైపెండ్
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్‌గా ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల శిక్షణలో మొదటి రెండేళ్లు రూ. 9,100; మూడో ఏడాది రూ. 9,400; నాలుగో ఏడాది మొదటి ఆరు నెలలు రూ. 9,700; చివరి ఆరు నెలలు రూ. 9,700 చొప్పున నెలవారీ స్టైపెండ్ అందజేస్తారు. అప్రెంటీస్‌షిప్‌నకు ఎంపికైన వారు.. శిక్షణకు చేరే ముందే.. శిక్షణ పూర్తయిన తర్వాత రైల్వే శాఖలో ప్రొబేషనరీ మెకానికల్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తామని అగ్రిమెంట్ రాయడం తప్పనిసరి.
ప్రొబేషన్
నాలుగేళ్ల అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేయడంతోపాటు; నిర్దేశిత బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు భార తీయ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో 18 నెలల ప్రొబేషన్‌కు ఎంపికవుతారు. ఒకవేళ అభ్యర్థులెవరైనా ఎని మిది సెమిస్టర్ల బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించకపోయినా.. సప్లి మెంటరీ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. అయితే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. సర్టిఫికెట్ చేతిలో పడిన తర్వాతే ప్రొబేషనరీ మెకానికల్ ఇంజనీర్‌గా ఎంపిక చేస్తారు. ప్రొబేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రైల్వే శాఖలో శాశ్వత ప్రాతిపదికన మెకానికల్ ఇంజనీర్‌గా రిక్రూట్ చేసుకుంటారు.
రిఫరెన్స్ బుక్స్:
- జేఈఈ-మెటీరియల్
- ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 11వ తరగతి పుస్తకాలు
- పియర్సన్ గైడ్ ఫర్ ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామ్
- క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్‌ఎస్ అగర్వాల్
- అర్హింత్ ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామ్
జేఈఈ స్థాయిలో..
ఎస్‌సీఆర్‌ఏ పరీక్షలో విద్యార్థిలోని గ్రహణ శక్తి, తార్కిక, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ విభాగంలోని ప్రశ్నలు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు.. జేఈఈ, బిట్‌శాట్ వంటి పరీక్షల మాదిరిగా ప్రాబ్లమ్ బేస్డ్‌గా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌లో మూడు అంశాలను గుర్తుంచుకోవాలి. అవి.. కాన్సెప్ట్ బిల్డింగ్ (మౌలిక భావనలపై పట్టు), అప్లికేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్ (భావనలను అన్వయించే సామర్థ్యం), ప్రాక్టీస్. ఉదాహరణకు ఒక సమస్యను తీసుకుంటే.. దాన్ని సాధించే క్రమంలో భావనలు/సూత్రాలను అన్వయించి ఏ విధంగా సాధిస్తున్నారో గమనించాలి. దాని ఆధారంగా షార్ట్‌కట్ మెథడ్స్‌ను రూపొందించుకోవాలి. వేగం కీలకంగా ఉండే ఇటువంటి పరీక్షల్లో ఈ తరహా పద్ధతులు ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఒక సమస్యను సాధించేటప్పుడు దాని సమాధానాన్ని ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మంచిది. తద్వారా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సమయం అధికంగా వెచ్చించాల్సి వచ్చినప్పటికీ..తద్వారా వచ్చే అవగాహన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అకడమిక్ పరీక్షల్లో లభించే చాయిస్ సౌలభ్యం కాంపిటీటివ్ పరీక్షల్లో లభించదు. కాబట్టి అభ్య ర్థులు ప్రతి అంశంపైనా పట్టు సాధించే దిశగా కృషి చేయాలి. ‘ఎలిమినేషన్’ ప్రాసెస్‌కు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గరవుతారని గుర్తించాలి.
సమాంతరంగా..
నిర్దేశిత సిలబస్‌పై అవగాహన పెంపొందించుకోవడం కూడా కీలకమే. ముందుగా మూడు సబ్జెక్ట్‌ల పరంగా మన రాష్ట్ర సిలబస్‌కు.. యూపీఎస్సీ సిలబస్‌ను అంశాల వారీగా బేరీజు వేసుకోవాలి. తేడాలు ఉన్న అంశాలను నోట్ చేసుకోవాలి. అందుకు తగ్గ ప్రిపరేషన్ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. జనవరిలో పరీక్షను నిర్వహిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం 80 రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయాన్ని అంశాల వారీగా విభజించుకోవాలి. కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తప్పకుండా కేటాయించాలి. మొదటి దశలో ద్వితీయ సంవత్సరం అంశాలకు, రెండో దశలో మొదటి సంవత్సరానికి ప్రాధాన్యతినివ్వాలి. చివరగా వారం రోజులు గత పేపర్ల ప్రాక్టీస్‌కు, పునశ్చరణకు కేటాయించాలి. సాధారణంగా ఈ సమయంలో విద్యార్థులందరూ ఇంజనీరింగ్ పోటీ పరీక్షల లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. జేఈఈ కోణంలో.. ఆయా సబ్జెక్టుల నిపుణులు కూడా డిసెంబర్ చివరి నాటికి ఇంటర్మీడియెట్ సిలబస్‌ను పూర్తి చేయాలని, తర్వాత సమయాన్ని రివిజన్, బోర్డ్ పరీక్షలకు కేటాయించాలనే సూచిస్తున్నారు. కాబట్టి ఇదే వ్యూహాన్ని ఎస్‌సీఆర్‌ఏకు అనుసరించడం మంచిది. సిలబస్‌లో పెద్దగా తేడా ఉండదు. కాబట్టి జేఈఈ, ఎస్‌సీఆర్‌ఏ పరీక్షలకు ఏకకాలంలో సమాంతరంగా ప్రిపేర్ కావొచ్చు. అదనంగా చదవాల్సిన జనరల్ నాలెడ్జ్ కోసం ప్రతి రోజు ఒక గంట కేటాయిస్తే సరిపోతుంది.
ఎస్‌సీఆర్‌ఏ 2015 సమాచారం
ఖాళీలు: 42
అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో ప్రథమ/ద్వితీయ శ్రేణిలో ఇంటర్మీడియెట్/తత్సమానం లేదా మ్యా థమెటిక్స్, ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో గ్రాడ్యుయేషన్ లేదా నిర్దేశించిన ఇతర అర్హతలు. శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 17 నుంచి 21 ఏళ్లు (జనవరి 1, 2015 నాటికి, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థు లకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు ఫీజు: రూ. 100
(ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్/మహిళా అభ్యర్థులకు మినహా యింపునిచ్చారు)
దరఖాస్తు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 7, 2014
రాత పరీక్ష తేదీ: జనవరి 18, 2014
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్నం.
వివరాలకు: www.upsc.gov.in

Published date : 17 Oct 2013 05:25PM