Skip to main content

కాన్సెప్ట్స్‌ను అవగాహన చేసుకుంటూ..

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) లో వివిధ పోస్టుల భర్తీ కోసం ఐఈఎస్/ఐఎస్‌ఎస్-2014 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ కొలువును దక్కించుకోవడంతో పాటు.. ప్రభుత్వ పాలన విభాగంలో ఉన్నత కెరీర్ దిశగా మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఐఈఎస్/ ఐఎస్‌ఎస్ ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై విశ్లేషణ..

ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశల్లో 1200 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 1000 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆరు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు మాత్రమే ఐఈఎస్, ఐఎస్‌ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి సబ్జెక్ట్ పేపర్లు. ప్రతి సబ్జెక్ట్‌కు నాలుగు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా కన్వెషనల్ (ఎస్సే) రూపంలో ఉంటుంది. సమాధానాలను పూర్తిగా ఇంగ్లిష్‌లోనే రాయాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు.

ఈ పరీక్షలో విజయం సాధించాలంటే..స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లోని కాన్సెప్ట్స్‌ను (ప్రాథమిక భావనలు) అవగాహన చేసుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. సిలబస్ పరంగా చూస్తే స్టాటిస్టిక్స్‌లో పేపర్-1, 2 మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేపర్-1,2 మీద దృష్టి సారించడం మంచిది. నాలుగు సబ్జెక్ట్ పేపర్లలో పేపర్-4 క్లిష్టంగా ఉంటుంది. ఇందులోని ప్రశ్నలు అభ్యర్థులను తికమక పెట్టే విధంగా ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. సిలబస్‌లోని అంశాలను బేరీజువేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉపయుక్తం. జనరల్ అభ్యర్థులు 400 మార్కులు (1000 మార్కులకు) సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించవచ్చు. గత ప్రశ్నపత్రాలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
-రంగా శ్రీనివాసులు,
ఐఎస్‌ఎస్ (ప్రొబేషనరీ ఆఫీసర్),
నేషనల్ అకడమీ ఆఫ్
స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ (గ్రేటర్ నోయిడా).

నోటిఫికేషన్ సమాచారం:
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్:
15 ఖాళీలు
అర్హత: పీజీ ఇన్ ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 23 ఖాళీలు
అర్హత: పీజీ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ (ఏదైనా ఒక పేపర్‌గా)
వయసు: 30 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10, 2014.
రాత పరీక్షలు ప్రారంభం: మే 24, 2014 నుంచి.
వెబ్‌సైట్: www.upsc.gov.in

జనరల్ ఇంగ్లిష్
ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు మాత్రం అభ్యర్థుల ఇంగ్లిష్ భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రెసిస్ పేరాగ్రాఫ్ ప్రశ్నలు కూడా ఇస్తారు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వీటిలో పట్టు సాధిస్తే ఈ పేపర్‌లో 60 శాతం మార్కులు పొందినట్లే.

జనరల్ స్టడీస్
ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు(కరెంట్ ఈవెంట్స్), జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్న లు ఇస్తారు. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫి నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ స్టడీస్‌కు సంబంధించి.. సివిల్స్ స్థాయి లో కాకున్నా.. అంతకు కొద్దిగా తక్కువ స్థాయిలో అదే సిలబస్‌ను అనుసరించి చదవాలి. ప్రశ్నలు 2మార్కులకు, 3 మార్కులకు, పది మార్కులకు అడుగుతారు. ఈ నేపథ్యంలో ఏ ప్రశ్నను ఎన్ని మార్కులకు అడిగారో ఆ స్థాయి లోనే సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవర్చుకోవాలి.
రిఫరెన్స్ బుక్స్:
  • General English: Hindu News Paper; General English for Competitive Examinations by Tata McGraw Hill
  • General Studies: Lucent's General Knowledge
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్
పేపర్ సబ్జెక్ట్ మార్కులు
పేపర్-2 జనరల్ ఇంగ్లిష్ 100
పేపర్-1 జనరల్ స్టడీస్ 100
పేపర్-3 జనరల్‌ఎకనామిక్స్-1 200
పేపర్-4 జనరల్‌ఎకనామిక్స్-2 200
పేపర్-5 జనరల్‌ఎకనామిక్స్-3 200
పేపర్-6 ఇండియన్ ఎకనామిక్స్ 200
మొత్తం 1,000
1,000 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు)

జనరల్ ఎకనామిక్స్-1:
ఇందులో సిలబస్‌ను సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ ఎకనోమెట్రిక్ మెథడ్స్ ఆధారంగా రూపొందించారు. సూక్ష్మ అర్ధశాస్త్రానికి సంబంధించి వినియోగదారుని డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ, పంపిణీ అంశాలను పొందుపరిచారు. ఇందులోని పార్ట్-బిలో మ్యాథమెటికల్ మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ అంశాలకు చోటుకల్పించారు. ఈ విభాగంలో ప్రశ్నపత్రాన్ని మూడు సెక్షన్లుగా విభజించారు. సెక్షన్-1లో ఇచ్చే ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. మిగిలిన రెండు సెక్షన్‌లలో ఇచ్చే ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. ఈ పేపర్‌కు సంబంధించి అవగాహన పెంచుకోవాల్సినవి: లారెంజ్ వక్ర రేఖ, ఏంజెల్ సూత్రం, షాడో ప్రైస్, పారెటో పంపిణీ సిద్ధాంతం,స్వలకాల-దీర్ఘకాల వ్యయ రేఖలు, తదితరాలు.

జనరల్ ఎకనామిక్స్-2:
ఈ పేపర్ సిలబస్ స్థూల అర్థశాస్త్రం, ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్, అంతర్జాతీయ అర్థశాస్త్రం వంటి అనేక అంశాల కలయికగా ఉంటుంది. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రతి అంశాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చదువుకోవాలి. సాంప్రదాయ, కీన్స్, జాతీయాదాయం కొలమానం, గ్రీన్ నేషనల్ ఇన్‌కమ్, సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఫిలిప్స్ రేఖ, ద్రవ్యరాశి సిద్ధాంతం వంటివి కీలకమైనవి. ఆర్థికవృద్ధి, అర్థికాభివృద్ధి అంశంలో పలువురు ఆర్థిక వేత్తల వృద్ధి నమూనాలను పొందుపరిచారు. ప్రపంచ వాణిజ్య సంక్షోభం కారణాలు, యూరోజోన్ సంక్షోభం, ప్రపంచ వాణిజ్య సంస్థ, జీ-20 దేశాల ఆర్థిక అంశాలను పరిశీలించాలి.

జనరల్ ఎకనామిక్స్-3:
ప్రభుత్వ విత్త శాస్త్రం, పర్యావరణ అర్థశాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ అంశాల సమ్మిళితంగా ఈ పేపర్ సిలబస్ ఉంది. ఈ విభాగంలో అధికంగా దృష్టిసారించాల్సినవి: పన్ను సంస్కరణలు, గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం, ప్రభుత్వ వ్యయ సిద్ధాంతం, గ్రీన్ జీడీపీ, క్యోటో ప్రోటోకాల్, బాలి యాక్షన్ ప్లాన్, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్.

ఇండియన్ ఎకానమీ:
ఈ పేపర్‌లో మెరుగైన మార్కులు సాధించాలంటే..సిలబస్‌లోని ముఖ్యాంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. ఇందులో కీలకమైన అంశాలు: స్థిరీకరణ-నిర్మాణాత్మక సర్దుబాటు ప్యాకేజీ, విత్తరంగ సంస్కరణలు, ఆర్థిక సంఘం సిఫార్సులు-13వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్, టోకు ధరల సూచీ-రిటైల్ ధరల సూచీ, భారత ద్రవ్య మార్కెట్, ఎఫ్‌డీఐ,పట్టణాభివృద్ధి వ్యూహాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.

కీలకం: పోస్ట్ గ్రాడ్యుయేట్లను మాత్రమే అర్హులిగా పేర్కొన్న పరీక్షలో సిలబస్ పీజీ ఆపై స్థాయిలో ఉంటోంది. దాంతో విజయం సాధించాలంటే కేవలం సబ్జెక్టు పరిజ్ఞానమే కాకుండా విశ్లేషణాత్మక సామర్థ్యం, ప్రపంచ తాజా ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఎంతో అవసరం.

రిఫరెన్స్ బుక్స్:
  • Microeconomics: Pindyck;
  • Microeconomics: Errol D'Souza;
  • Public Finance:H L Bhatia;
  • International Economics: Joseph Cherunilam; nIndustrial Economics: R.R.Barthwal; n The Economics of Development and Planning: M.L.Jhingan;
  • Indian Economy: Misra & Puri;
  • Environmental Economics: U.Shankar; n Business Mathematics & Statistics:Agarwal B.M; n Yojana; n Kurukshetra;
  • Economic and Political Weekly.
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
పేపర్ సబ్జెక్ట్ మార్కులు
పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100
పేపర్-2 జనరల్ స్టడీస్ 100
పేపర్-3 స్టాటిస్టిక్స్-1 200
పేపర్-4 స్టాటిస్టిక్స్-2 200
పేపర్-5 స్టాటిస్టిక్స్-3 200
పేపర్-6 స్టాటిస్టిక్స్-4 200
మొత్తం 1,000
(ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు)
  • స్టాటిస్టిక్స్-1 పేపర్‌లో రాణించాలంటే పలు సిద్ధాంతాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్, న్యూమరికల్ అనాలిసిస్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
  • స్టాటిస్టిక్స్-2 పేపర్‌లో లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్, హైపోథిసిస్ టెస్టింగ్, మల్టీవెరైటీ అనాలిసిస్ (ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్, తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • స్టాటిస్టిక్స్-3 పేపర్‌లో శాంప్లింగ్ టెక్నిక్స్, ఎకనామిక్ సాటిస్టిక్స్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • స్టాటిస్టిక్స్-4 పేపర్‌లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ,డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్, కంప్యూటర్ సిస్టమ్- సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు.
స్ట్రాటజీ:
డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే ఈ పేపర్లలో చక్కని స్కోర్ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ముఖ్యంగా స్టాటిస్టిక్స్ విషయంలో ఆయా సిద్ధాంతాలు వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి. మరో కీలక అంశం..సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పొందాలి. కారణం.. పరీక్ష ఒకే రోజు రెండు పేపర్లు చొప్పున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ఏ పేపర్‌లో ఏ సిలబస్ ఉందో అవగాహన లేక చివరి నిమిషంలో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతారు. దీనికి పరిష్కారం సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోవడమే. సిలబస్‌లోని అన్ని అంశాలను చదవడం కంటే పట్టున్న అంశాలనే వీలైనంత ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తం.

రిఫరెన్స్ బుక్స్:
Statistics Paper - I:
Fundamentals of Mathematical Statistics by S.C.Gupta & V.K. Kapoor; Applied statistics by S.C.Gupta & V.K.Kapoor; An Introduction to Probability and Statistics (Wiley Series in Probability & Statistics) By Vijay K.Rohatgi & A.K.Md. Ehsanes Saleh.

Statistics Paper - II:
Statistical Inference by Vijay Rohatgi; Kshirsagar A.M.(1972): Multivariate Analysis. Maral Dekker; Johnosn, R.A. and Wichern . D.W (2002): Applied multivariate Analysis- 5th Ad. Prentice Hall; Kshirsagar A.M.(1983): Course in Linear Modelss- Marcel dekker.

Statistics Paper - III:
William G.Cochran (1977): Sampling Techniques IIIrd edition - John and Wieley sons Inc; Theory And Analysis Of Sample Survey Designs by Daroga Singh; Chakravarti. M.C.(1962): Mathematics of Design of Experiments Asia Publishing House, Bombay; Gujarati, Damodar N. Basic Econometrics. New York: McGrawHill,1978.

Statistics Paper - IV:
Medhi J. (1982): Stochastic Process Wiley Eastern; Stochastic Processes by Sheldon Ross; Kanti Swaroop & Gupta M. M.(1985): Operations Research, Sultan Chand & Co; Operation Research theory and Applications. (2003) IInd edition J.K.Sharma Macmillan India ltd; Applied statistics by S.C.Gupta & V.K.Kapoor; Computer Fundamentals by P.K.Sinha.
Published date : 20 Feb 2014 03:53PM

Photo Stories