Skip to main content

ఆర్థికంలో సుస్థిర కెరీర్‌కు ఐఈఎస్/ఐఎస్‌ఎస్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష వివరాలు..
కెరీర్ స్కోప్: ఐఈఎస్/ఐఎస్‌ఎస్‌లో ఎంపికైన వారి కెరీర్ ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్ డెరైక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ హోదాతో (జూనియర్ టైం స్కేల్) ప్రారంభమవుతుంది. వీరిని ప్లానింగ్ కమిషన్, నేషనల్ శాంపుల్ సర్వే, లేబర్ బ్యూరో, ఆర్థిక సంఘం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమ, విద్య, వ్యవసాయం, వాణిజ్యం తదితర విభాగాల్లో నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా డిప్యూటీ డెరైక్టర్/అసిస్టెంట్ అడ్వైజర్ (సీనియర్ టైం స్కేల్), జాయింట్ డెరైక్టర్ /డిప్యూటీ అడ్వైజర్, సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ తదితర హోదాల నుంచి అత్యున్నత స్థాయి ప్రిన్సిపుల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్
  • పోస్టుల సంఖ్య: 15
  • వయసు: 2016, ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంది.
  • విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్/అప్లైడ్ ఎకనమిక్స్/బిజినెస్ ఎకనమిక్స్/ ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్.
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
  • రాతపరీక్ష:
    పరీక్ష 1000 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు (సబ్జెక్టివ్) మాత్రమే ఐఈఎస్, ఐఎస్‌ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి.

పేపర్

సబ్జెక్ట్

మార్కులు

పేపర్-1

జనరల్ ఇంగ్లిష్

100

పేపర్-2

జనరల్ స్టడీస్

100

పేపర్-3

జనరల్‌ఎకనామిక్స్-1

200

పేపర్-4

జనరల్ ఎకనామిక్స్-2

200

పేపర్-5

జనరల్ ఎకనామిక్స్-3

200

పేపర్-6

ఇండియన్ ఎకనామిక్స్

200

మొత్తం మార్కులు

1,000

(ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు)
ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
  • పోస్టుల సంఖ్య: 13
  • వయసు: 2016, ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంది.
  • విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా పీజీ.
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
  • రాతపరీక్ష: పరీక్ష 1000 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు మాత్రమే ఐఈఎస్, ఐఎస్‌ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా నిర్వహిస్తారు. స్టాటిస్టిక్స్-1, స్టాటిస్టిక్స్-2 పేపర్లకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. మిగిలిన పేపర్లకు డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి.

పేపర్

సబ్జెక్ట్

మార్కులు

సమయం (గంటలు)

పేపర్-1

జనరల్ ఇంగ్లిష్

100

3

పేపర్-2

జనరల్ స్టడీస్

100

3

పేపర్-3

స్టాటిస్టిక్స్-1

200

2

పేపర్-4

స్టాటిస్టిక్స్-2

200

2

పేపర్-5

స్టాటిస్టిక్స్-3

200

3

పేపర్-6

స్టాటిస్టిక్స్-4

200

3

మొత్తం మార్కులు

1,000

  • ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజును ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించవచ్చు.
ముఖ్య తేదీలు:
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2016.
  • రాత పరీక్షలు ప్రారంభం: మే 13, 2016.
  • పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
  • వెబ్‌సైట్: www.upsconline.nic.in
Published date : 22 Jan 2016 11:55AM

Photo Stories