వేసవి సెలవుల్లో నైపుణ్యాలను పెంచుకనే మార్గాలు ఇవే...
Sakshi Education
విద్యార్థులు వేసవి సెలవుల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు సులువైన మార్గాలు...
ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టి.. పరీక్షలు రాసిన విద్యార్థులకు కాస్త ఉపశమనం. కొందరు విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. మరికొందరు నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి అవసరమైన కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన పరిస్థితి! ఈ క్రమంలో వేసవి సెలవులను విద్యార్థులు ఓ వైపు ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆ సమయాన్ని స్కిల్స్ పెంచుకునేందుకు సద్వినియోగం చేసుకోవడమెలాగో చూద్దాం..
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో చివరి సంవత్సరంలో అడుగుపెట్టనున్న విద్యార్థులకు ఈ వేసవి సెలవులు ముఖ్యమైనవి. ప్రతి క్షణం ఎంతో విలువైన నేటి పోటీ ప్రపంచంలో వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే జాబ్ మార్కెట్లో అందరికంటే ఒక అడుగు ముందుండే అవకాశం లభిస్తుంది. ఫైనలియర్‌లో నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విజయంలో ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ వేసవిలో వాటిపై దృష్టిసారించాలి. సీనియర్లు, ప్రొఫెసర్లను సంప్రదించి ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం అన్వేషించాలి. ప్రస్తుతం ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నాస్కామ్, ఇంటర్న్‌శాల తదితర సంస్థలు.. తమ వెబ్‌సైట్లలో వివిధ కంపెనీల ఇంటర్న్‌షిప్స్ సమాచారాన్ని పొందుపరుస్తున్నాయి. వీటిని పరిశీలించడం ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ఆధునిక సాంకేతికతపై అవగాహన :
ప్రస్తుతం వివిధ కోర్సుల చివరి సంవత్సరంలో అడుగుపెట్టే విద్యార్థులు.. జాబ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్ వంటివి కీలకంగా మారుతున్నాయి. వీటికి సంబంధించిన అంశాలపై ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా అవగాహన పెంపొందించుకోవాలి. వీలుంటే షార్ట్‌టర్మ్ కోర్సులు పూర్తిచేయాలి. తద్వారా ఆయా అంశాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో కొలువుల సాధన, విధుల నిర్వహణ పరంగా ముందుండేందుకు వీలుంటుంది. మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు బిగ్ డేటా, డేటా మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో శిక్షణ పొందడం భవిష్యత్తు కెరీర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది.
సాఫ్ట్‌స్కిల్స్ :
సబ్జెక్టుపై పట్టు, ఇండస్ట్రీకి అవసరమైన తాజా స్కిల్స్‌తోపాటు యువతను కెరీర్ పరంగా విజయపథంలో నడిపించే నైపుణ్యం... కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రస్తుతం విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్ తదితరాలను పెంచుకునేందుకు కృషిచేయాలి. సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించాలి.
కంప్యూటర్ నైపుణ్యాలు :
ప్రస్తుతం అన్ని ఎంట్రన్స్‌లు ఆన్‌లైన్ విధానంలోకి మారుతున్నాయి. ఎంసెట్, నీట్, జేఈఈ, గేట్, క్యాట్ అన్నీ ఆన్‌లైన్‌లోనే. కాబట్టి విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అవసరం. దీనికోసం ప్రస్తుత వేసవిలో కంప్యూటర్ ఆపరేటింగ్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. వీలైతే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి శిక్షణ పొందితే.. డీసీఏ, పీజీ డీసీఏ వంటి సర్టిఫికెట్లు కూడా చేతికందుతాయి.
ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు భవిష్యత్తు పరంగా నిలదొక్కుకోవడానికి కంప్యూటర్ నైపుణ్యం చాలా అవసరం. ఇటీవల బీపీవో, కాల్‌సెంటర్, నాన్-వాయిస్ విభాగాల్లో ఉద్యోగ నియామకాల పరంగా సంప్రదాయ కోర్సుల విద్యార్థులకు సైతం సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి వేసవి సెలవుల్లో కంప్యూటర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, కంప్యూటర్స్ ఆపరేటింగ్‌పై పట్టుసాధించాలి.
ఈఆర్‌పీ... కొలువుకు దారి
సంప్రదాయ కోర్సుల పరంగా.. ఇటీవల కార్పొరేట్ రంగంలో క్రేజీ కోర్సు బీకాం. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి సంస్థల్లో ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వేర్ ఆధారంగా విధులు నిర్వహించడం తప్పనిసరిగా మారుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఈఆర్‌పీ సొల్యూషన్స్ అని పిలుస్తున్నారు. ఇందులో ప్రముఖంగా నిలుస్తున్న శాప్, అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాక్సేషన్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం మేలు చేస్తుంది. ప్రస్తుతం కామర్స్ గ్రాడ్యుయేట్లకు డిమాండింగ్ విభాగం.. జీఎస్‌టీ రిటర్న్స్ ఫైలింగ్ నైపుణ్యం. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా శిక్షణ తీసుకుంటే.. బీకాం పూర్తయ్యేసరికి జీఎస్‌టీపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఆపై జీఎస్‌టీ కన్సల్టెంట్‌గా స్వయం ఉపాధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
విదేశీ భాషలో శిక్షణ :
ప్రస్తుతం యువతకు అవసరమైన మరో నైపుణ్యం.. ఫారెన్ లాంగ్వేజ్. మాతృభాష, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంతోపాటు విదేశీ భాషల్లో నైపుణ్యం పోటీ ప్రపంచంలో ముందుండేలా చేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉన్నత కెరీర్ ఔత్సాహికులకు ఇది అవసరంగా మారుతోంది. అందువల్ల ఈ వేసవిలో కనీసం ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రోజుకు కొంత సమయం కేటాయించాలి. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ భాషలు భవిష్యత్తు కెరీర్ పరంగా ముందంజలో నిలిపేందుకు దోహదం చేస్తున్నాయి. కేవలం ఫార్మా, ఐటీ ఉద్యోగులే కాకుండా.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిద్వారా బీపీవో, కాల్ సెంటర్, టూరిజం సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఇంటర్మీడియెట్ తర్వాత?
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్ తర్వాత అందుబాటులో ఉండే అవకాశాల గురించి అన్వేషించాలి. ఇంటర్ తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ లక్ష్యంగా అడుగులు వేస్తారు. దీనికోసం ఇప్పటి నుంచే జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ తదితర పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తర్వాత నిర్వహించే ఈ పరీక్షల్లో నిరుత్సాహ ఫలితాలు ఎదురైతే.. ప్రత్యామ్నాయంగా ఏ దిశగా వెళ్లాలనే దానిపై ఇప్పుడే స్పష్టత ఏర్పరచుకోవాలి.
ఫ్రీలాన్స్ ఉద్యోగాలు :
డిగ్రీ చివరి సంవత్సరంలోకి అడుగుపెడుతూ.. ఆర్థికంగా కొంత చేయూత కావాలనుకుంటున్న యువతకు చక్కటి మార్గం ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ విధానంలో ట్రాన్స్‌లేషన్, హోం ట్యూషన్స్, ఈ-ట్యూషన్స్ తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వేసవి విరామంలో ఉద్యోగ అనుభవంతోపాటు ఎంతోకొంత సంపాదించొచ్చు. ఆ మొత్తాన్ని చదువుకు ఉపయోగించుకోవచ్చు.
పదో తరగతి తర్వాత..
పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు... అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపాధ్యాయులు, సీనియర్లను సంప్రదించి తెలుసుకోవాలి. వివిధ కెరీర్ మార్గా లకు సంబంధించిన సమాచారం సేకరించాలి. తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులు, వాటికి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు.. వాటిలో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో చేరాల్సిన గ్రూప్‌ల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకునేందుకు కృషిచేయాలి.
సద్వినియోగం చేసుకోండిలా..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత.. సమయం ఎంతో విలువైం దన్న విషయాన్ని గుర్తించాలి. కొద్దిపాటి సమయం లభించినా.. దాన్ని కొత్త నైపుణ్యాల సాధనకు ఉపయోగించుకోవాలి. దీనికి ఇప్పుడు ఎన్నో మార్గాలు (ఉదా: ఆన్‌లైన్ కోర్సులు) అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.
- ఎం.రామకృష్ణ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్.

- సాఫ్ట్‌వేర్, టెక్నికల్ విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర నైపుణ్యాలపై దృష్టిసారించాలి.
- మేనేజ్‌మెంట్ విద్యార్థులు అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు.
- ఐబీఎం, సిస్కో, ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల ఆధ్వర్యంలోని ఆన్‌లైన్ కోర్సుల్లో చేరొచ్చు.
- పవేశ పరీక్షల ఔత్సాహికులు ఆన్‌లైన్ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి.
- పదోతరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు మార్గాలపై దృష్టిసారించాలి.
- ఉన్నతవిద్యను లక్ష్యంగా నిర్దేశించుకున్నవారు సంబం ధిత ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకోవచ్చు.
- భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో ముందుండేందుకు వీలుగా ఇంటర్న్‌షిప్స్ ద్వారా క్షేత్ర స్థాయి నైపుణ్యాలు పెంపొందిం చుకోవడంపై దృష్టిసారించాలి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత.. సమయం ఎంతో విలువైం దన్న విషయాన్ని గుర్తించాలి. కొద్దిపాటి సమయం లభించినా.. దాన్ని కొత్త నైపుణ్యాల సాధనకు ఉపయోగించుకోవాలి. దీనికి ఇప్పుడు ఎన్నో మార్గాలు (ఉదా: ఆన్‌లైన్ కోర్సులు) అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.
- ఎం.రామకృష్ణ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్.
Published date : 10 Apr 2018 02:30PM