ఉద్యోగ వేటకూ వ్యూహాలు..!
Sakshi Education
చదువు పూర్తిచేసుకోవడం ఒకెత్తయితే.. సరైన ఉద్యోగంలో స్థిరపడటం మరో సవాలు! ఏళ్ల తరబడి చదివిన చదువుకి ప్రతిఫలమే ఉద్యోగం. ఉద్యోగాన్వేషణ ప్రక్రియ ఊహించినంత సులభంగా ఉండదు. ఈ ప్రక్రియ కొన్నిసార్లు ఉద్యోగార్థులకు విసుగు తెప్పించొచ్చు. కానీ, స్వీయ సామర్థ్యం, నైపుణ్యాలకు తగిన ఉద్యోగం సాధించాలంటే.. అభ్యర్థులకు ముందస్తు సన్నద్ధత తప్పనిసరి! వాస్తవానికి నేటి పోటీ ప్రపంచంలో జాబ్ సెర్చింగ్ కూడా ఓ కీలకమైన నైపుణ్యమే అంటున్నారు నిపుణులు! ఈ నేపథ్యంలో ఉద్యోగ వేటలో ముందు నిలిపే రెజ్యూమె రూపకల్పన; కవర్ లెటర్, జాబ్ సెర్చ్ వ్యూహాల గురించి తెలుసుకుందాం..!
కాలం మారుతోంది..
రెజ్యూమె.. ఫస్ట్ ఇంప్రెషన్
ఉద్యోగాన్వేషణలో రెజ్యూమె కీలకం. రెజ్యూమె ద్వారానే అభ్యర్థిపై తొలి అభిప్రాయం ఏర్పడుతుంది. మంచి రెజ్యూమె ఉద్యోగాన్వేషణలో విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఉద్యోగార్థులు రెజ్యూమె రూపకల్పనపై తగిన శ్రద్ధ పెట్టాలి. రెజ్యూమె సంక్షిప్తంగా, రిక్రూటర్లను ఆకట్టుకొనేలా సూటిగా, స్పష్టంగా ఉండాలి. చాలామంది రెజ్యూమెను పూర్తిగా నైపుణ్యాల సమాహారంగా మార్చేస్తున్నారు. నిజానికి రెజ్యూమెను ఆసాంతం చదివే సమయం రిక్రూటర్లకు ఉండదు. కాబట్టి అభ్యర్థులు తమ అనుభవాన్ని, కీలకమైన నైపుణ్యాలను వరుస క్రమంలో పేర్కొనాలి. అదేవిధంగా రెజ్యూమెను రాసేటప్పుడు యాక్టివ్ వాయిస్‌ను ఉపయోగించాలి. రెజ్యూమెలో విద్యార్హతలతోపాటు సరి్టిఫికేషన్లు; ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి పేర్కొనాలి.
కవర్ లెటర్... కమిట్‌మెంట్
ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థులను కవర్ లెటర్ పంపమని కోరుతున్నాయి. కాబట్టి కవర్ లెటర్‌లో సదరు ఉద్యోగానికి మీరు ఏవిధంగా సరితూగుతారో పేర్కొనాలి. అదేవిధంగా ఉద్యోగం పట్ల మీకున్న ఆసక్తి, ఉత్సుకత, నిబద్ధత (కమిట్‌మెంట్)లను తెలియజేయాలి. ఇతరులతో పోల్చితే ఆ జాబ్‌కు మీరు ఏ విధంగా ఎక్కువ అర్హులు.. ఆ కొలువులోనే మీరెందుకు చేరాలనుకుంటున్నారో తెలపాలి. కవర్ లెటర్ సుదీర్ఘంగా, ఎస్సేలా ఉండకూడదు. ఒక పేజీలోనే సంక్షిప్తంగా, స్పష్టంగా రాయాలి. కవర్ లెటర్ రైటింగ్‌కు మంచి ఫాంట్‌ను ఎంచుకోవాలి. కవర్ లెటర్‌ను ఆసాంతం ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలి.
వ్యక్తిత్వం.. వికసించాలి
బ్రాండింగ్... నెట్‌వర్కింగ్
ప్రొఫైల్ అప్‌డేట్ :
ఆన్‌లైన్ జాబ్ సెర్చింగ్‌కి సంబంధించి జాబ్‌పోర్టల్స్, పలు సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో లింక్డిన్‌తోపాటు నౌకరీ, ఇండీడ్, టైమ్స్ జాబ్, మాన్‌స్టర్ జాబ్ పోర్టల్స్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలామంది వీటిద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా.. తమకెలాంటి ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని వాపోతున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. అభ్యర్థులు ఆయా జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసినప్పుడే రిక్రూటర్లని ఆకట్టుకోగలుగుతారు.
ఎడ్యుకేషన్: బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలకు సంబంధించి మీ విద్యార్హతలను వరుస క్రమంలో పేర్కొనాలి. దీంతోపాటు సర్టిఫికేషన్లు చేసినట్లయితే వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి.
అప్‌లోడ్స్: జాబ్ పోర్టల్స్‌లో రెజ్యూమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. దీంతోపాటు మీకు సంబంధించిన ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీడియోలు, ప్రజంటేషన్లు, స్పీచెస్‌ను అప్‌లోడ్ చేయడం లాభిస్తుంది.
హెడ్‌లైన్: జాబ్ పోర్టల్స్‌లో హెడ్‌లైన్ కీలకంగా నిలుస్తుంది. దీన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారు. హెడ్‌లైన్ దగ్గర కేవలం కంపెనీ ఇచ్చిన టైటిల్స్‌ను పేర్కొంటున్నారు. ఉదాహరణకు జావా డెవలపర్‌నే తీసుకుంటే.. వీరికి కంపెనీలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్/సిస్టమ్, నెట్‌వర్క్ ఇంజనీర్/టెక్నాలజీ అనలిస్ట్‌లు తదితర జాబ్ టైటిల్స్ ఇస్తున్నాయి. కేవలం హెడ్‌లైన్‌లో కంపెనీలు ఇచ్చే జాబ్ టైటిల్స్‌ను పేర్కొనడం వల్ల రిక్రూటర్లకు జాబ్‌రోల్ పరంగా మీ అనుభవం, నైపుణ్యంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి హెడ్‌లైన్‌లో ఉద్యోగార్థులు జాబ్ డిస్క్రిప్షన్‌ను పూర్తిగా పేర్కొనాలి.
అనుభవం: కంపెనీల్లో మీరు వివిధ బాధ్యతలు నిర్వహిస్తే.. వాటన్నింటినీ ఒకేసారి పేర్కొనకుండా, సంవత్సరాలు-నిర్వహించిన విధులు వారీగా రాస్తే రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించొచ్చు. ప్రస్తుతం చేస్తున్న, గతంలో పనిచేసిన ఉద్యోగాల్లో మీరు సాధించిన విజయాలను పేర్కొనాలి. దీంతోపాటు మీరు పొందిన పదోన్నతులను కాలక్రమంలో రాయాలి. తద్వారా రిక్రూటర్లకు మీ పనితనంపై, కెరీర్ పరంగా మీరు ఎదిగిన విధానంపై అవగాహన ఏర్పడుతుంది.
రికమండేషన్: లింక్డిన్ వంటి మాధ్యమాల్లో ‘రికమండేషన్’ ఫీచర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. వీటిలో మీ గురించి, మీ నైపుణ్యాల గురించి తెలిసినవారి వివరాలను పేర్కొనవచ్చు. ప్రస్తుత కంపెనీ మేనేజర్ లేదా గతంలో పనిచేసిన టీమ్ లీడర్‌ల గురించి ప్రస్తావించొచ్చు. ఫ్రెషర్స్ అయితే ఫ్రొఫెసర్స్ లేదా ఇంటర్న్‌షిప్ సందర్భంగా మీరు పనిచేసిన మేనేజర్ల పేర్లను పేర్కొనవచ్చు. ఆయా వ్యక్తులకు మీ వ్యక్తిత్వం, పనితీరు గురించి తెలుస్తుంది. కాబట్టి వారు మీ గురించి రిక్రూటర్లకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలుతారు. ఇది జాబ్ సెర్చింగ్‌లో విజయావకాశాలను మెరుగు పరుస్తుంది.
శోధించి... సాధించాలి
ఉద్యోగానికి దరఖాస్తు చేసిన కంపెనీ గురించి, దరఖాస్తులు కోరుతున్న ఉద్యోగం గురించి సమాచారం సేకరించేందుకు కొంత పరిశో దన చేయాలి. ఇందులో భాగంగా సదరు కంపనీకి సంబంధించిన సోషల్ నెట్‌వర్క్, లింక్డిన్ పేజీలను పరిశీలించాలి. కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగం కొత్తదా లేదా రీప్లేస్‌మెంటా అనే విషయాలను తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ కొలువుకు కావల్సిన అర్హతలు, నైపుణ్యాల గురించి అవగాహన కలిగుండాలి. ఇంటర్వ్యూ సమయంలో ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలతో సన్నద్ధం కావాలి!!
- ప్రస్తుతం జాబ్ మార్కెట్ చాలా డైనమిక్‌గా మారిపోయింది. ఫలితంగా ఉద్యోగ స్వభావం; కొనసాగింపు; ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. గతంలో ఒక వ్యక్తి ఓ ఉద్యోగంలో చేరితే 20 నుంచి 30 ఏళ్లపాటు అదే కొలువులో కొనసాగేవారు! కానీ, ప్రస్తుతం ఎవరూ స్థిరంగా ఒకేచోట, ఒకే ఉద్యోగంలో ఉండటంలేదు. ప్రపంచీకరణ, పోటీతత్వం ఫలితంగా ఒక ఉద్యోగి.. ఐదేళ్ల కాలవ్యవధిలోనే సగటున రెండు, మూడు కంపెనీలు మారుతున్నట్లు అంచనా!
- వేతనాలు; కంపెనీల మధ్య నెలకొన్న పోటీ; అదే సమయంలో కంపెనీలు జీతాల భారం తగ్గించుకునేందుకు సీనియర్లను సాగనంపి.. తక్కువ జీతానికి వచ్చే ఫ్రెషర్స్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవల 200 మంది సీనియర్లను తొలగించింది. ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ ఆఫర్ సొంతం చేసుకోవడంతోపాటు ఉద్యోగంలో స్థిరపడేందుకు మొదట్నుంచే నిర్దిష్ట సన్నద్ధతతోపాటు పలు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరముంది అంటున్నారు నిపుణులు.
- జాబ్ సెర్చింగ్ పరంగా సర్టిఫికేషన్స్, రీస్కిల్లింగ్ వంటి అంశాలకు ఇటీవల కాలంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. వాస్తవానికి ఇవే కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఆయా డొమైన్స్‌లో వస్తున్న కొత్త సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకొని పూర్తిచేయడం ద్వారా పోటీని తట్టుకొని నిలబడొచ్చు. రీస్కిల్లింగ్ వల్ల కొత్త టెక్నాలజీలను అందుకొని వినూత్నంగా, నూతన ఉత్సాహంతో పనిచేసే సామర్థ్యాలు లభిస్తాయి. తద్వారా జాబ్ సెర్చింగ్ సమయంలో ఉద్యోగార్థులకు విజయావకాశాలు మెరుగ వుతాయి.
రెజ్యూమె.. ఫస్ట్ ఇంప్రెషన్
ఉద్యోగాన్వేషణలో రెజ్యూమె కీలకం. రెజ్యూమె ద్వారానే అభ్యర్థిపై తొలి అభిప్రాయం ఏర్పడుతుంది. మంచి రెజ్యూమె ఉద్యోగాన్వేషణలో విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఉద్యోగార్థులు రెజ్యూమె రూపకల్పనపై తగిన శ్రద్ధ పెట్టాలి. రెజ్యూమె సంక్షిప్తంగా, రిక్రూటర్లను ఆకట్టుకొనేలా సూటిగా, స్పష్టంగా ఉండాలి. చాలామంది రెజ్యూమెను పూర్తిగా నైపుణ్యాల సమాహారంగా మార్చేస్తున్నారు. నిజానికి రెజ్యూమెను ఆసాంతం చదివే సమయం రిక్రూటర్లకు ఉండదు. కాబట్టి అభ్యర్థులు తమ అనుభవాన్ని, కీలకమైన నైపుణ్యాలను వరుస క్రమంలో పేర్కొనాలి. అదేవిధంగా రెజ్యూమెను రాసేటప్పుడు యాక్టివ్ వాయిస్‌ను ఉపయోగించాలి. రెజ్యూమెలో విద్యార్హతలతోపాటు సరి్టిఫికేషన్లు; ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి పేర్కొనాలి.
కవర్ లెటర్... కమిట్‌మెంట్
ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థులను కవర్ లెటర్ పంపమని కోరుతున్నాయి. కాబట్టి కవర్ లెటర్‌లో సదరు ఉద్యోగానికి మీరు ఏవిధంగా సరితూగుతారో పేర్కొనాలి. అదేవిధంగా ఉద్యోగం పట్ల మీకున్న ఆసక్తి, ఉత్సుకత, నిబద్ధత (కమిట్‌మెంట్)లను తెలియజేయాలి. ఇతరులతో పోల్చితే ఆ జాబ్‌కు మీరు ఏ విధంగా ఎక్కువ అర్హులు.. ఆ కొలువులోనే మీరెందుకు చేరాలనుకుంటున్నారో తెలపాలి. కవర్ లెటర్ సుదీర్ఘంగా, ఎస్సేలా ఉండకూడదు. ఒక పేజీలోనే సంక్షిప్తంగా, స్పష్టంగా రాయాలి. కవర్ లెటర్ రైటింగ్‌కు మంచి ఫాంట్‌ను ఎంచుకోవాలి. కవర్ లెటర్‌ను ఆసాంతం ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలి.
వ్యక్తిత్వం.. వికసించాలి
- ఉద్యోగ అన్వేషణలో ‘వ్యక్తిత్వ వికాసం’ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనిగురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదు. వ్యక్తిత్వ వికాసంలో భాగమైన స్వీయ ఆసక్తి, పరిజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు, కెరీర్ లక్ష్యాలు.. ఉద్యోగ ఎంపికలో కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఉద్యోగార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలు, కెరీర్ లక్ష్యాల గురించి ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత తమకు సరితూగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. అప్పుడే వేగంగా కొలువును దక్కించుకోవడవంతోపాటు కెరీర్ సైతం సుస్థిరంగా సాగుతుంది.
- కొలువుల వేటలో ముందుగా స్వీయ ఆసక్తిపై స్థిరమైన అభిప్రాయానికి రావాలి. ఒకసారి ఆసక్తిని గుర్తించగలిగితే అభ్యర్థులు సరైన దిశలో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించొచ్చు. దాంతోపాటు అభ్యర్థులు ముందుగా స్వీయ పరిజ్ఞానంపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందే సదరు ఉద్యోగం మీ సామర్థ్యాలకు సరితూగుతుందా లేదా అని సరిచూసుకోవాలి. తద్వారా సమయం ఆదా అవడంతోపాటు సరితూగే మరొక ఉద్యోగంపై దృష్టిపెట్టే వీలు దక్కుతుంది.
- ఇంటర్వ్యూయర్ అభ్యర్థుల ఇష్టాలు, ఉద్యోగం దిశగా సాగించిన ప్రయత్నాల్ని తెలుసుకునేందుకు ప్రశ్నలు అడుగుతారు. ఆ సందర్భంలో ఉద్యోగార్థులు తమ అనుభవాలను సంక్షిప్తంగా చెప్పగలగాలి. సదరు జాబ్ పట్ల తమ ఆసక్తిని ఇంటర్వ్యూయర్‌కి అర్ధమయ్యేలా వివరించగలిగితే ఉద్యోగం సొంతమైనట్లే !
బ్రాండింగ్... నెట్‌వర్కింగ్
- ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధించాలంటే.. స్వీయ బ్రాండింగ్ తప్పనిసరి! ఈ బ్రాండింగ్ మీ నైపుణ్యాలను తెలిపేదిగా ఉండాలి. లింక్డిన్, ఇతర సోషల్ మీడియా ద్వారా సొంత ఇమేజ్ సృష్టించుకోవాలి. బ్లాగ్స్, లింక్డిన్‌లో ఆర్టికల్స్ రాయడం, సదస్సులు, సెమినార్లలో స్పీచెస్ ఇవ్వడం ద్వారా స్వీయ బ్రాండింగ్ పెంచుకోవచ్చు.
- ఉద్యోగాన్వేషణలో రిఫరెన్స్‌లు సైతం ముందువరుసలో నిలుస్తున్నాయి. కాబట్టి మీ రంగంలోని సీనియర్లతో సోషల్ మీడియా ద్వారా సత్సంబంధాలు కొనసాగించాలి. అదేవిధంగా గతంలో మీతో కలసి పనిచేసినవారు కూడా రిఫరెన్స్ పరంగా కీలకంగా మారుతారు. దీంతోపాటు సదరు కంపెనీ మేనేజర్లు, రిక్రూటింగ్ టీమ్‌తో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండటం లాభిస్తుంది.
ప్రొఫైల్ అప్‌డేట్ :
ఆన్‌లైన్ జాబ్ సెర్చింగ్‌కి సంబంధించి జాబ్‌పోర్టల్స్, పలు సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో లింక్డిన్‌తోపాటు నౌకరీ, ఇండీడ్, టైమ్స్ జాబ్, మాన్‌స్టర్ జాబ్ పోర్టల్స్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలామంది వీటిద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా.. తమకెలాంటి ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని వాపోతున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. అభ్యర్థులు ఆయా జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసినప్పుడే రిక్రూటర్లని ఆకట్టుకోగలుగుతారు.
ఎడ్యుకేషన్: బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలకు సంబంధించి మీ విద్యార్హతలను వరుస క్రమంలో పేర్కొనాలి. దీంతోపాటు సర్టిఫికేషన్లు చేసినట్లయితే వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి.
అప్‌లోడ్స్: జాబ్ పోర్టల్స్‌లో రెజ్యూమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. దీంతోపాటు మీకు సంబంధించిన ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీడియోలు, ప్రజంటేషన్లు, స్పీచెస్‌ను అప్‌లోడ్ చేయడం లాభిస్తుంది.
- లింక్డిన్, ఇతర జాబ్ పోర్టల్స్‌లో చాలా మంది ప్రొఫైల్ ఫోటోను ఉంచట్లేదు. రిక్రూటర్లను ఆకట్టుకోవాలంటే.. తప్పనిసరిగా ఫోటోను అప్‌డేట్ చేయాలి. సదరు ఫోటో పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఉపయో గించే ఫోటోలను జాబ్ పోర్టల్స్‌లో ఉప యోగించకూడదు. బ్లేజర్ లేదా మంచి ఫార్మల్ షర్ట్‌లో దిగిన ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా రిక్రూటర్లకు మంచి అభిప్రాయం కలుగుతుంది. ప్రొఫైల్ కోసం చిరు మందహాసంతోపాటు స్పష్టంగా కనిపిస్తున్న హెడ్‌షాట్ ఫోటోలను వాడాలి.
- అదేవిధంగా ఉద్యోగార్థులు జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసేటప్పుడు ఎలాంటి అక్షర, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి.
హెడ్‌లైన్: జాబ్ పోర్టల్స్‌లో హెడ్‌లైన్ కీలకంగా నిలుస్తుంది. దీన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారు. హెడ్‌లైన్ దగ్గర కేవలం కంపెనీ ఇచ్చిన టైటిల్స్‌ను పేర్కొంటున్నారు. ఉదాహరణకు జావా డెవలపర్‌నే తీసుకుంటే.. వీరికి కంపెనీలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్/సిస్టమ్, నెట్‌వర్క్ ఇంజనీర్/టెక్నాలజీ అనలిస్ట్‌లు తదితర జాబ్ టైటిల్స్ ఇస్తున్నాయి. కేవలం హెడ్‌లైన్‌లో కంపెనీలు ఇచ్చే జాబ్ టైటిల్స్‌ను పేర్కొనడం వల్ల రిక్రూటర్లకు జాబ్‌రోల్ పరంగా మీ అనుభవం, నైపుణ్యంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి హెడ్‌లైన్‌లో ఉద్యోగార్థులు జాబ్ డిస్క్రిప్షన్‌ను పూర్తిగా పేర్కొనాలి.
అనుభవం: కంపెనీల్లో మీరు వివిధ బాధ్యతలు నిర్వహిస్తే.. వాటన్నింటినీ ఒకేసారి పేర్కొనకుండా, సంవత్సరాలు-నిర్వహించిన విధులు వారీగా రాస్తే రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించొచ్చు. ప్రస్తుతం చేస్తున్న, గతంలో పనిచేసిన ఉద్యోగాల్లో మీరు సాధించిన విజయాలను పేర్కొనాలి. దీంతోపాటు మీరు పొందిన పదోన్నతులను కాలక్రమంలో రాయాలి. తద్వారా రిక్రూటర్లకు మీ పనితనంపై, కెరీర్ పరంగా మీరు ఎదిగిన విధానంపై అవగాహన ఏర్పడుతుంది.
రికమండేషన్: లింక్డిన్ వంటి మాధ్యమాల్లో ‘రికమండేషన్’ ఫీచర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. వీటిలో మీ గురించి, మీ నైపుణ్యాల గురించి తెలిసినవారి వివరాలను పేర్కొనవచ్చు. ప్రస్తుత కంపెనీ మేనేజర్ లేదా గతంలో పనిచేసిన టీమ్ లీడర్‌ల గురించి ప్రస్తావించొచ్చు. ఫ్రెషర్స్ అయితే ఫ్రొఫెసర్స్ లేదా ఇంటర్న్‌షిప్ సందర్భంగా మీరు పనిచేసిన మేనేజర్ల పేర్లను పేర్కొనవచ్చు. ఆయా వ్యక్తులకు మీ వ్యక్తిత్వం, పనితీరు గురించి తెలుస్తుంది. కాబట్టి వారు మీ గురించి రిక్రూటర్లకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలుతారు. ఇది జాబ్ సెర్చింగ్‌లో విజయావకాశాలను మెరుగు పరుస్తుంది.
శోధించి... సాధించాలి
ఉద్యోగానికి దరఖాస్తు చేసిన కంపెనీ గురించి, దరఖాస్తులు కోరుతున్న ఉద్యోగం గురించి సమాచారం సేకరించేందుకు కొంత పరిశో దన చేయాలి. ఇందులో భాగంగా సదరు కంపనీకి సంబంధించిన సోషల్ నెట్‌వర్క్, లింక్డిన్ పేజీలను పరిశీలించాలి. కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగం కొత్తదా లేదా రీప్లేస్‌మెంటా అనే విషయాలను తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ కొలువుకు కావల్సిన అర్హతలు, నైపుణ్యాల గురించి అవగాహన కలిగుండాలి. ఇంటర్వ్యూ సమయంలో ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలతో సన్నద్ధం కావాలి!!
Published date : 24 Oct 2018 06:16PM