Skip to main content

టీ టేస్టర్.. పెట్ గ్రూమింగ్.. ఇవీ కూడా ఉద్యోగాలే..!

కాలం గడుస్తున్న కొద్దీ.. సమాజం అవసరాలు మారిపోతుంటాయి.
మారుతున్న అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకుంటేనే మనుగడ సాధ్యమవుతుంది. టీ టేస్టర్, పెట్ గ్రూమింగ్, స్పా మేనేజ్‌మెంట్, జెరంటాలజీ వంటి వినూత్న కెరీర్స్.. అలా తెరపైకి వచ్చినవే! వీటికి సంబంధించిన స్కిల్స్ అందించేందుకు పలు కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు నేటి యువత సైతం భిన్నమైన కెరీర్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటోంది. ఆఫ్‌బీట్ కెరీర్స్‌వైపు మొగ్గు చూపుతోంది. ఇటీవల కాలంలో విద్యార్థులను ఆకర్షించడంలో ముందుంటున్న టీ టేస్టర్, జెరంటాలజిస్ట్, స్పా మేనేజ్‌మెంట్, పెట్ గ్రూమింగ్ కెరీర్స్ గురించి తెలుసుకుందాం...

టీ టేస్టర్...
{పస్తుతం తేనీరు(టీ) లేనిదే తెల్లారే పరిస్థితి లేదు. ప్రపంచ వ్యాప్తంగా టీ వినియోగం పెరగడమే కాని తగ్గిన దాఖలాలు లేవు. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. మనదేశంలో టీ పరిశ్రమ అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వివిధ రకాల తేయాకును ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా టీల రకాలు, రుచుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ‘టీ టేస్టర్స్’ పని. తేయాకు పరిశ్రమలో ఇదో ప్రత్యేకమైన కొలువు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిభావంతమైన కెరీర్స్‌లో టీ టేస్టర్ ఒకటిగా చెప్పవచ్చు. ఒకప్పుడు సంప్రదాయ టీ టేస్టర్లు తమ అనుభవం ఆధారంగా నివేదిక ఇస్తే.. ఆధునిక టీ టేస్టర్లు శాస్త్రీయ పద్ధతిపై ఆధారపడి రుచులను చెబుతున్నారు. టీల రకాలను బ్రాండింగ్ చేయడానికి వీరు సహాయపడతారు. దీనిని యువత ఆఫ్‌బీట్ కెరీర్‌గా ఎంచుకుంటున్నా.. నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉపాధి అవకాశాలు ఉజ్వలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

టీ టేస్టర్‌గా మారాలంటే..
  • టీ టేస్టర్‌గా మారడానికి పూర్తిస్థాయి డిగ్రీ కోర్సు ఏదీ అందుబాటులో లేదు. టీ పరీక్షా పద్ధతులు, తేనీరు సంబంధిత శాస్త్రీయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు మూడు నెలల నుంచి ఏడాది కాలపరిమితి గల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు మాత్రం అందిస్తున్నారుు. ఫుడ్ సైన్‌‌స, హార్టికల్చర్, అగ్రికల్చర్, బోటనీలో డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. టీ ఎస్టేట్‌లో పనిచేసిన అనుభవం కూడా వీటిల్లో చేరేందుకు ఉపయోగపడుతుంది.
  • టీ టేస్టర్‌గా మారాలంటే.. వారి నాలుకపై రుచి మొగ్గలు, ఆఘ్రాణ శక్తి(వాసన చూడడం) చురుకుగా పనిచేయాలి. తద్వారా టీ శాంపిల్స్‌లో ఆల్కలారుుడ్లను గుర్తించడంతో పాటు వివిధ రకాల వాసనలు పసిగట్టడం సులువవుతుంది.
  • టీ రకాలు, వివిధ రకాల తేయాకు తోటల పెంపకం, తయారీ ప్రక్రియల గురించి తెలుసుకోవాలి.
  • ధూమపానం, మద్యం, ఘాటైన మసాల ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలాంటి అలవాట్లు ఉంటే టీ రుచి సరిగా చెప్పలేరనే అభిప్రాయముంది.
  • టీ టేస్టర్లకు చొరవతో పాటు తేయాకు మార్కెట్ గురించిన పరిజ్ఞానం కూడా అవసరమే.
వేతనాలు..
నైపుణ్యాలుంటే.. టీ టేస్టర్లు ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. వీరికి ప్రారంభంలో ట్రైనీగా నెలకు రూ.30వేలకు పైనే దక్కుతుంది. ఆ తర్వాత అనుభవాన్ని బట్టి వేతనం నెలకు రూ.50 వేల వరకూ లభిస్తుంది. దీంతోపాటు టీ ఎస్టేట్‌లో అదనపు సౌకర్యాలు పొందవచ్చు.

కోర్సులు అందించే సంస్థలు..
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ టీ హజ్బెండరీ అండ్ టెక్నాలజీ, అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఊ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్, డార్జిలింగ్ ఊ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్, బెంగళూర్ వంటి వాటిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పెట్ గ్రూమింగ్..
  • పల్లెల్లో ప్రతి ఇంట్లో కోళ్లు, ఆవులు, గొర్రెలు, మేకలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. అలాగే నేడు నగరాలు, పట్టణాల్లో ఓ కుక్కనో, పిల్లినో పెంచుకోవడం హాబీగా మారింది. అయితే వాటి పెంపకం, పోషణపై పెంచేవారికి సరైన అవగాహన ఉండట్లేదు. దాంతో పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేందుకు.. వాటి ఆలనా, పాలనా చూసేందుకు పెట్ గ్రూమింగ్ నిపుణుల అవసరం పెరుగుతోంది. చాలామంది పెట్‌ల ఆరోగ్యం, భద్రతపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఇదే ఇప్పుడు పెట్ గ్రూమింగ్ కెరీర్‌కు దోహదం చేస్తోంది. మూగజీవాల పట్ల ఆసక్తి ఉన్న వారు ఈ పెట్‌గ్రూమింగ్‌ను ఆఫ్‌బీట్ కెరీర్‌గా మార్చుకోవచ్చు. సంబంధిత కోర్సులు, శిక్షణ పూర్తి చేసుకోవడం ద్వారా పెట్ గ్రూమింగ్ నిపుణుడిగా మారి.. ఆదాయం ఆర్జించవచ్చు.
  • పలు ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్న పెట్ గ్రూమింగ్ కోర్సులు చేసేందుకు కనీస అర్హత పదో తరగతి. ఆపై అర్హతలు ఉన్నవారు సైతం చేరొచ్చు. కోర్సు పూర్తయ్యాక పెంపుడు జంతువుల పెంపకం, పెట్‌షాప్స్ నిర్వహణ, సెలూన్‌‌స ఏర్పాటు వంటి వ్యాపారాలు ప్రారంభించొచ్చు. పెంపుడు జంతువుల పెంపకంలో అనుభవం ఉన్న వారు వాటికి చికిత్స అందించడంతో పాటు, శిక్షణనిచ్చేవారిగా కూడా సేవలందించవచ్చు. పెట్ లవర్స్ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పెట్ గ్రూమింగ్ కోర్సులు పూర్తి చేసినవారి ఉపాధికి ఎలాంటి ఢోకా లేదనే చెప్పవచ్చు. వీరు అవసరమైన వారికి ఫ్రీలాన్‌‌స సేవలు కూడా అందించవచ్చు.
జెరంటాలజిస్ట్..
వయసుతోపాటు వృద్ధులకు వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు.. వాటికి పరిష్కారాల గురించి అధ్యయనం చేసే నిపుణులను ‘జెరంటాలజిస్టులు’ అంటారు. మనుషులకు వార్థక్యం(ముసలితనం) సమీపిస్తున్నకొద్దీ శారీరక, మానసిక సమస్యలు సర్వసాధారణం. అయితే వయసుతోపాటు వచ్చే మార్పులను,సమస్యలను కొంతమంది జీర్ణించుకోలేక ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి సమయంలో వారికి జెరంటాలజిస్టుల సేవల అవసరం ఉంటుంది. జెరంటాలజీలో.. బయో జెరంటాలజీ, సోషల్ జెరంటాలజీ స్పెషలైజేషన్లు ఉన్నారుు. జెరంటాలజిస్టులు కమ్యూనిటీ సెంటర్లు, నివాస గృహాల్లో వృద్ధులకు సేవలు అందించవచ్చు. కౌన్సెలర్లు, సంరక్షకులుగా పనిచేయవచ్చు. నర్సింగ్ సేవలు, సోషల్ వర్కర్‌గా సేవ చేయవచ్చు. ప్రస్తుతం భారతీయుల ఆయు ప్రమాణం పెరుగుతున్న కొద్దీ దేశంలో వృద్ధుల సంఖ్య కూడా అధికమవుతోంది. దాంతో జెరంటాలజిస్టులకు డిమాండ్ నెలకొంది.
  • విదేశాలతో పోలిస్తే మన దేశంలో జెరంటాలజీ డిగ్రీ కోర్సులు అందించే సంస్థలు చాలా తక్కువ. కానీ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ జెరంటాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నారుు. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన సోషల్ వర్క్, సైకాలజీ, సోషియాలజీ, ఇతర ఆరోగ్య సంబంధిత కోర్సుల్లో జెరంటాలజీని ప్రత్యేక అంశంగా నేర్చుకోవచ్చు. ఇందులో ఇంటర్మీడియెట్ తర్వాత డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేయవచ్చు. కొన్ని సంస్థలు డిగ్రీ తర్వాత పీజీ డిప్లొమాకు అనుమతిస్తున్నారుు.
  • జెరంటాలజీ కోర్సు చేసేముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వృద్ధులకు సేవలందించడాన్ని ఆనందంగా స్వీకరించాలి. వృద్ధుల పట్ల సహనం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంపై ఆసక్తి ఉండాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినడం, ఈ రంగంలో రాణించాలనే నిబద్ధత, ఆత్మవిశ్వాసం చాలా అవసరం.
కోర్సులు అందించే సంస్థలు..
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్, న్యూఢిల్లీ
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్‌‌స, న్యూఢిల్లీ
  • టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, ముంబై
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కౌన్సెలింగ్, న్యూఢిల్లీ
స్పా మేనేజ్‌మెంట్...
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమల్లో స్పా అండ్ బ్యూటీ ఒకటని చెప్పొచ్చు. శరీర సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఇప్పుడు యువతులు, మహిళలతో పాటు యువకులూ పోటీ పడుతున్నారు. అంతేకాదు.. తమ పిల్లలను అందంగా చూసుకునేందుకు తల్లిదండ్రులు స్పాలను ఆశ్రరుుస్తున్నారు. స్టార్ హోటళ్లు, టూరిస్ట్ కంపెనీలు స్పా నిపుణులను నియమించుకుంటున్నారుు. ఈ రంగంలో అవకాశాలు అందుకునేందుకు.. స్పా మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకోవడం ద్వారా ఆయా నైపుణ్యాలు అందిపుచ్చుకోవచ్చు. ఆ క్రమంలో స్పా ట్రీట్‌మెంట్, హాస్పిటాలిటీ, బిజినెస్ విధానంపై అవగాహన పొందాలి. స్పా మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా...
  • లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్
  • డే/రిసార్ట్ స్పా
  • అనాటమీ అండ్ ఫిజియాలజీ
  • స్కిన్ అనాలసిస్
  • హిస్టరీ ఆఫ్ అరోమా థెరపీ
  • ఎసెన్షియల్ ఆరుుల్స్ వంటి ఎన్నో అంశాలను అధ్యయనం చేస్తారు.
  • స్పా మేనేజ్‌మెంట్‌లో మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు నుంచి ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా వరకు ఉన్నారుు. ఆయా కోర్సును బట్టి ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతలు ఉండాలి.
Published date : 28 May 2020 01:05PM

Photo Stories