టెలికం కొలువులకు పెంచుకోవాల్సిన నైపుణ్యాలు...
Sakshi Education
కొంత కాలం క్రితం..డిప్లొమా మొదలు ఎంటెక్ చదివిన వారి వరకు టెలికం రంగం.. కొలువుల తరంగం. లక్షల మందికి ఉపాధి వేదిక. ఈసీఈ పూర్తి చేస్తూనేఉద్యోగం ఖాయమనే భరోసా!
కానీ,ఇప్పుడు..పరిస్థితి తారుమారవుతోంది.. టెలికంలో ఎన్నడూ లేని ఒడిదుడుకులు. ఇప్పటికే పలు కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత. ముఖ్యంగా మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో భారీ లే-ఆఫ్‌ల అంచనా!
ఈ నేపథ్యంలో..టెలికం రంగంలో ప్రస్తుత హైరింగ్ పరిస్థితి.. ఔత్సాహికులు పెంచుకోవాల్సిన నైపుణ్యాలు.. దృష్టిసారించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై విశ్లేషణ.
లక్షల మంది ఉపాధికి వేదికగా నిలిచిన టెలి కమ్యూనికేషన్ రంగం ఇప్పుడు క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. మార్కెట్ పోటీ తట్టుకోలేని సంస్థలు కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. దీంతో విలీనాలు.. ఆస్తుల విక్రయాలు.. ఉద్యోగుల తొలగింపు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 3 లక్షల మందిపైగా ఉద్యోగులున్న ఈ రంగంలో ఇప్పటికే 75 వేలపైగా కొలువులకు కోత పడిందని, దీని ప్రభావం ఎక్కువగా మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయివారిపై ఉన్నట్లు పలు సర్వేల అంచనా. మరోవైపు కొత్త నియామకాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
మిడిల్ మేనేజ్‌మెంట్‌పై వేటు!
విలీనాలు, ఖర్చు తగ్గింపు వ్యూహాలతో కొన్నాళ్లుగా ఉద్యోగులపై వేటు పడుతోంది. గత 12 నెలల కాలంలో సంస్థలు 75 వేల మందికి ఉద్వాసన పలికినట్లు అంచనా. ఈ సంక్షోభం మున్ముందు మరింత కోతకు కారణం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రూ.లక్ష అంతకంటే ఎక్కువ వేతనం అందుకుంటున్న వారిని తొలగిస్తే అంతర్గతంగా, ఆర్థికంగా భారీ ఉపశమనం కలుగుతుందని సంస్థలు భావిస్తున్నాయి. దీంతో తొలి దశలో మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. జీఎం, ఏజీఎం హోదాల్లో పనిచేస్తున్నవారు ఇతర అవకాశాలను అన్వేషించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడనుంది.
విలీనాలే ప్రధాన కారణం
రుణభారాలు, విలీనాలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న లక్షల మందిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి పరిణామాల ప్రకారం ఏవైనా రెండు సంస్థలు కలిసిపోయే సందర్భంలో తక్షణం కనీసం 2 వేల మంది తొలగింపునకు గురవుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు.
వినియోగదారులు పెరుగుతున్నా ఎందుకిలా?
ఓవైపు దేశంలో మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ లెక్కల ప్రకారం దేశంలో 60 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్ వాడేవారు 30 కోట్లు. మార్కెట్ ఇంత భారీగా ఉన్నప్పటికీ సంస్థల ప్రస్తుత పరిస్థితి, ఉద్యోగాల కోతకు రెండు ప్రధాన కారణాలను చూపుతున్నారు.
ఈ పరిణామాల మధ్య మనుగడ సాగించాలంటే.. 'రీ స్కిల్లింగ్' ఒక్కటే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా వారేం సూచిస్తున్నారంటే..
ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తిచేసిన టెలికం రంగం ఔత్సాహికులు ప్రత్యామ్నాయ ఉపాధి వేదికలనూ పరిశీలించాలన్నది నిపుణుల సూచన. కొత్త సాంకేతికతను అమలు చేస్తున్న ఉత్పత్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగాలను వీరు ప్రధాన ప్రత్యామ్నాయాలుగా పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఆటోమొబైల్‌నే తీసుకుంటే.. డ్రైవర్ లెస్, ఎలక్ట్రిక్ కార్లపై పరిశోధనలు సాగుతున్నాయి. వీటికి ఎలక్ట్రానిక్స్ నైపుణ్యం ఉన్న అభ్యర్థుల అవసరం చాలా ఉంటుంది. ఉత్పత్తి రంగంలో సైతం మానవ రహిత సేవలు కీలకంగా మారుతున్నాయి. (ఉదా: రోబోలతో కార్యకలాపాల నిర్వహణ). రోబోల తయారీలో అవసరమైన సర్క్యూట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలు ఎలక్ట్రానిక్స్ నైపుణ్యాలున్న అభ్యర్థులకే సాధ్యం. కాబట్టి.. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రయత్నించాలి.
టెలికంలో ఉద్యోగాలు కోరుకునే యువత అకడమిక్స్ నుంచే తగిన నైపుణ్యాలు పొందాలి. సంస్థల అవసరాలను తెలుసుకుని వాటిపై శిక్షణ తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ రంగంలో అనిశ్చితి కొద్ది కాలమే అని చెప్పొచ్చు.
-ప్రొ॥కె. శ్రీ రామమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ-హెచ్.

- పెరుగుతున్న వినియోగదారులు.. ఒకటి లేదా రెండు పెద్ద కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ వైపు గంపగుత్తగా మొగ్గుచూపుతుండటం.
- పోటీ కారణంగా ఓవైపు తగ్గుతున్న ఆదాయం.. మరోవైపు అధికమవుతున్న నిర్వహణ భారం. పర్యవసానంగా ఆర్థిక ఇబ్బందులు. వీటిని తగ్గించే క్రమంలోనే విలీనాలు. మానవ వనరుల్లో కోత.
ఈ పరిణామాల మధ్య మనుగడ సాగించాలంటే.. 'రీ స్కిల్లింగ్' ఒక్కటే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా వారేం సూచిస్తున్నారంటే..
- ప్రస్తుతం సూపర్‌వైజరీ, మేనేజర్ స్థాయి విధులు నిర్వహిస్తున్నవారు సాంకేతికత కోణంలో 'అప్లికేషన్ డెవలప్‌మెంట్', 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీస్', 'హ్యాండ్ సెట్ టెక్నాలజీస్' తదితరాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
- వినియోగదారులను ఆకర్షించేందుకు సంస్థలు దృష్టిసారిస్తున్న 5-జి, ఎం టు ఎం (M to M) టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలి.
- నాన్-టెక్నాలజీ విభాగాలకు సంబంధించి సేల్స్ మేనేజ్‌మెంట్, కస్టమర్ ఎక్విజిషన్, కస్టమర్ బిహేవియర్ తదితర అంశాల్లో మరింత మెరుగ్గా రాణించేలా నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరముంది.
- తాజా గ్రాడ్యుయేట్లు టెలికం కంపెనీల్లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే.. ఇందులోనూ అమల్లోకి వస్తున్న ఐఓటీ, ఆటోమేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు డిజైన్, అప్లికేషన్, డేటా మేనేజ్‌మెంట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. అవసరమైతే శిక్షణ తీసుకోవాలి.
ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తిచేసిన టెలికం రంగం ఔత్సాహికులు ప్రత్యామ్నాయ ఉపాధి వేదికలనూ పరిశీలించాలన్నది నిపుణుల సూచన. కొత్త సాంకేతికతను అమలు చేస్తున్న ఉత్పత్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగాలను వీరు ప్రధాన ప్రత్యామ్నాయాలుగా పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఆటోమొబైల్‌నే తీసుకుంటే.. డ్రైవర్ లెస్, ఎలక్ట్రిక్ కార్లపై పరిశోధనలు సాగుతున్నాయి. వీటికి ఎలక్ట్రానిక్స్ నైపుణ్యం ఉన్న అభ్యర్థుల అవసరం చాలా ఉంటుంది. ఉత్పత్తి రంగంలో సైతం మానవ రహిత సేవలు కీలకంగా మారుతున్నాయి. (ఉదా: రోబోలతో కార్యకలాపాల నిర్వహణ). రోబోల తయారీలో అవసరమైన సర్క్యూట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలు ఎలక్ట్రానిక్స్ నైపుణ్యాలున్న అభ్యర్థులకే సాధ్యం. కాబట్టి.. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రయత్నించాలి.
- ఐటీఐ, డిప్లొమా అర్హతలతో అడుగుపెట్టి.. ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులకు ఉన్న మరో మార్గం స్వయం ఉపాధి. ఈ కోణంలో హ్యాండ్ సెట్ టెక్నీషియన్స్, కంప్యూటర్ టెక్నీషియన్స్, టీవీ టెక్నీషియన్స్‌గా రాణించేందుకు అవకాశం ఉంది.
- మరోవైపు రెండు నెలల క్రితం టెలికంలో అవకాశాలపై సర్వే చేసిన 'అసోచామ్-కేపీఎంజీ' సంస్థలు 2021 నాటికి అదనంగా మరో 8.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొనడం గమనార్హం.
టెలికంలో ఉద్యోగాలు కోరుకునే యువత అకడమిక్స్ నుంచే తగిన నైపుణ్యాలు పొందాలి. సంస్థల అవసరాలను తెలుసుకుని వాటిపై శిక్షణ తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ రంగంలో అనిశ్చితి కొద్ది కాలమే అని చెప్పొచ్చు.
-ప్రొ॥కె. శ్రీ రామమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ-హెచ్.
Published date : 20 Nov 2017 12:31PM