Skip to main content

సుస్థిర కెరీర్‌కు పునాది..పాలిటెక్నిక్ డిప్లొమా

కొలువులో వేగంగా స్థిరపడాలన్నా, ఇంజనీర్‌గా ఎదగాలన్నా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఒకవైపు నైపుణ్యాల లేమితో బీటెక్ విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే.. డిప్లొమా విద్యార్థులకు మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇటీవల డిప్లొమా కోర్సులకు డిమాండ్ పెరిగింది. తెలంగాణలో ఏప్రిల్ 21న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్ష (2018-19) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రకటించింది. ఏపీలో ఈ పరీక్ష ఏప్రిల్ 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహికుల కోసం ముఖ్య సమాచారం...
పదోతరగతి అర్హతతో ఇంజనీరింగ్ దిశగా బాటలు వేసుకునే అవకాశం పాలిటెక్నిక్ కోర్సులతో లభిస్తుంది. పాలిటెక్నిక్ కోర్సుల కరిక్యులంలో ప్రాక్టికల్ లెర్నింగ్‌కు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో డిప్లొమా విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటోంది. ఇదే అంశం కెరీర్ పరంగా వారికి ఉపయోగపడుతోంది.

ప్రవేశం ఇలా..
ఆయా రాష్ట్రాల బోర్డులు (టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) నిర్వహించే పాలీసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మార్చిలో పరీక్షలు రాయనున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష స్వరూపం..
ప్రవేశ పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.

విభాగం

ప్రశ్నల సంఖ్య

సబ్జెక్టు

సెక్షన్ ఎ

1 -60

గణితం

సెక్షన్ బి

61 - 90

ఫిజిక్స్

సెక్షన్ సి

91 - 120

కెమిస్ట్రీ

l పశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్‌ను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో రూపొందిస్తారు.

డిప్లొమా కోర్సులు..
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సిరామిక్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఆసక్తి మేరకు కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. కోర్సులు మూడు నుంచి మూడున్నర ఏళ్ల వ్యవధిలో ఉంటాయి.

ప్రయోజనాలు
  • కంపెనీల్లో పాలిటెక్నిక్ అర్హతతో నిర్వర్తించే సూపర్‌వైజరీ, సైట్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య పెరుగుతోంది. కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టి పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు ఉద్యోగాలు అందిస్తున్నాయి.
  • మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టారు.
  • కోర్సులో భాగంగా నేర్చుకునే ల్యాబ్ పరిజ్ఞానం వల్ల బీటెక్ అభ్యర్థులతో పోల్చితే డిప్లొమా విద్యార్థులు ఉద్యోగ సాధనలో ముందుంటున్నారు.
  • డిప్లొమా పూర్తిచేస్తే ప్రారంభంలోనే నెలకు రూ.15 వేలకు అందుకోవచ్చు. ఈ కోర్సుల ద్వారా ఆర్థిక వెసులుబాటు లేని విద్యార్థులు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను పూర్తిచేయొచ్చు.
  • ఇంటర్, ఇతర సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారితో పోల్చితే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ.

ఉన్నత విద్య :
పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం పొందొచ్చు. దీనికోసం ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. బీటెక్ తర్వాత సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంటెక్, ఎంఈ కోర్సులు చేయొచ్చు. గేట్ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్సీ తదితర జాతీయ స్థాయి సంస్థల్లో; పీజీఈసెట్‌ల ద్వారా రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్ పూర్తి చేయొచ్చు.
Published date : 13 Feb 2018 12:58PM

Photo Stories