సరైన కెరీర్‌ను ఎంచుకోండిలా...
Sakshi Education
పవన్ చురుకైన విద్యార్థి.. చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ చూపేవాడు. దీంతో టీచర్లు, చుట్టాలు, తెలిసినవాళ్లు.. ఒకరేమిటి అందరూ.. భవిష్యత్‌లో పెద్ద స్థాయికి వెళ్తావ్ అంటూ పవన్‌ను అభినందించేవారు! సంవత్సరాలు గడిచాయి.. టాప్ గ్రేడ్‌లతో పవన్ చదువు పూర్తయింది.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు సొంతమైంది. ఆనందంగా ఉద్యోగంలో చేరిపోయాడు. తన పనితనంతో అందరి మెప్పూ పొందాలనుకున్నాడు. సంస్థలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలలు కన్నాడు. కానీ, చివరకు ఓ సాధారణ ఉద్యోగిగా మిగిలిపోయాడు! కారణం.. కెరీర్ ఎంపికలో జరిగిన పొరపాటు! అవును.. పవన్ ఒక్కడే కాదు.. ప్రస్తుతం ఎంతోమంది యువత తమకు నప్పే కెరీర్‌ను ఎంచుకోవడంలో పొరబడుతున్నారు! కెరీర్ ఎంపికలో విద్యార్థులు పూర్తి అవగాహనతో అడుగులు వేయలేకపోతున్నారు..! మరి సరైన కెరీర్‌ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?! కెరీర్ ఎంపికలో తల్లిదండ్రుల పాత్ర తదితర అంశాల గురించి తెలుసుకుందాం...
‘కెరీర్ 100 మీటర్ల స్ప్రింట్ కాదు.. అదో మారథాన్’అని అన్నాడో ప్రముఖుడు! ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే కెరీర్ మారథాన్‌లా సాగుతుంది లేదంటే స్ప్రింట్ తరహాలో త్వరగా, వేగంగా ముగిసిపోతుంది. కాబట్టి కెరీర్ ఎంపికలో అన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికీ చాలామంది మూస ధోరణిలోనే వెళ్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. కెరీర్ ప్రయాణం నిచ్చెనలా సాగాలి. అంతేకానీ, ఎదుగూ బొదుగూ లేని తిన్నని రేఖలా కాదు!
కెరీర్ ఎంపిక జరుగుతోందిలా..
కోర్సులో చేరడం దగ్గర నుంచి కెరీర్ ఎంపిక వరకూ.. విద్యార్థులను తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టూ ఉన్న సమాజం, జాబ్ మార్కెట్.. ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
తల్లిదండ్రులు: తమ స్వీయ అనుభవం, అవగాహన ఆధారంగా పిల్లల చదువు, కెరీర్‌ను నిర్ణయిస్తున్నారు. తమ కలలను పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని చూస్తుంటారు.
జాబ్ మార్కెట్: కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు తర్వాత జాబ్ మార్కెట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏ కోర్సులో చేరితే.. చదువు పూర్తికాగానే అధిక వేతనంతో ఉద్యోగం లభిస్తోందో..దాన్నే ఎంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కెరీర్ ఎంపికలో విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేసే అంశమిది.
ఉదా: ఐటీ, ఫార్మా.
నెట్‌వర్క్: కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, పరిచయమున్న వ్యక్తులు ఈ కేటగిరీ కిందకు వస్తారు. వీరిలో క్లోజ్ ఫ్రెండ్స్ ప్రభావం కెరీర్ ఎంపికపై అధికంగా ఉంటుంది. స్నేహితులు చేరిన కోర్సును ఎంచుకోవడం ద్వారా ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగించొచ్చనే అభిప్రాయంతో కెరీర్ ఎంపికలో స్వీయ ఆసక్తులు, ఇష్టాలను చాలామంది పట్టించుకోవడం లేదు.
మరెన్నో కారణాలు..
సరైన ఎంపిక ఇలా...
వేలల్లో ఆప్షన్లు.. వాటిలో మీకు నప్పే.. మీరు మెచ్చే కెరీర్‌ను ఎంచుకోవడం క్లిష్టమైన పనే! ఇష్టాలు, సామర్థ్యాలతోపాటు కొన్ని శాస్త్రీయ పద్ధతులను అనుసరించి కెరీర్ పరంగా సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ దిశగా పరిశీలించాల్సిన కీలక అంశాలు...
సహజ సామర్థ్యం :
ప్రతి ఒక్కరూ కొన్ని పనులను ఇతరులతో పోల్చితే సులభంగా, వేగంగా చేయగలుగుతారు. ఈ సహజ సామర్థ్యాన్ని పనిచేసే చోట ప్రదర్శించగలిగితే.. మంచి వేతనాలతో పాటు పదోన్నతులు దక్కుతాయి. అందుకే సహజ సామర్థ్య ప్రదర్శనకు వీలున్న కెరీర్‌ను ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.
స్వీయ పరిశీలన :
ఆసక్తులు, సాఫ్ట్‌స్కిల్స్, అభిరుచులు, విలువలు, వ్యక్తిత్వం తదితరాల ఆధారంగా తమకు సరిపోయే కొన్ని రంగాలు, కెరీర్‌ల జాబితా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఆయా కెరీర్‌ల పట్ల పరిశోధన చేయడం ద్వారా ఓ జాబితాను రూపొందించుకోవచ్చు. సదరు జాబితాలోని కెరీర్‌ల గురించి మరింత పరిశోధన చేయడం, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా జాబితాను కుదించొచ్చు. దీనికోసం లింక్డిన్ బాగా ఉపయోగపడుతుంది. జాబితాలోని కెరీర్‌లు, రంగాలను ఒక్కోటి పరిశీలించుకుంటూ.. ప్రతికూల, సానుకూల అంశాలను రాసుకోవాలి. స్వీయ బలాలు, బలహీనతల ఆధారంగా విశ్లేషణ చేయాలి. అవసరమైతే ‘కెరీర్ టెస్టుల’ ఆధారంగా స్వీయ విలక్షణతలను గుర్తించగలిగితే.. సరిపోయే కెరీర్‌ను ఎంచుకోవడం తేలికవుతుంది. అదేవిధంగా కెరీర్ కౌన్సిలర్లను సంప్రదించడం ద్వారా సరైన కె రీర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
పక్కా ప్రణాళిక :
ప్రతివిద్యార్థి.. కెరీర్ పరంగా పక్కా ప్రణాళిక, లక్ష్యాలను కలిగుండాలి. అప్పుడే కెరీర్ సోపానంలో ముందువరుసలో ఉంటారు. ఉదాహరణకు మీ తక్షణ, ప్రథమ లక్ష్యం బిజినెస్ అనలిస్ట్ కావడమైతే.. తర్వాతి లక్ష్యాలు వరుసగా ఐటీ సపోర్ట్ మేనేజర్, డెరైక్టర్ ఆఫ్ సపోర్ట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సపోర్ట్ కావాలి! ఇలా ఎప్పటికప్పుడు స్థిరమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని సాధించేందుకు ప్రయత్నించినప్పుడే కెరీర్ నిచ్చెనలో పైకి చేరగలరు.
జీపీవీ ఫార్ములా..
కెరీర్ పరంగా గిఫ్ట్స్, ఫ్యాషన్స్, వాల్యూస్ (జీపీవీ).. ఫార్ములాను అనుసరించాలి. ఏయే రంగంలో ఏ విధమైన గ్రోత్ ఉంటుంది..స్వీయ ఇష్టాలు ఏ రంగం వైపు వెళ్లమంటున్నాయి.. తదితర అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. కెరీర్ ఎంపికలో విలువలను వదులుకోవాల్సిన అవసరం లేదు. విలువలకు భంగం కలగని కెరీర్‌ను ఎంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కొత్తదనం..
డాక్టర్, లాయర్, టీచర్, కంప్యూటర్ ఇంజనీర్.. ఇలా ఎప్పుడూ సంప్రదాయ కొలువులేనా.. యువత కెరీర్ ఎంపికలో కొత్తదనంపైనా దృష్టిపెట్టాలి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కొత్త కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఆయా ఉద్యోగాల్లో స్థిరపడటం ద్వారా ఇతర రంగాలతో పోల్చితే త్వరగా ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ :
కెరీర్ ఎంపికలో ఇంటర్న్‌షిప్ స్పష్టతనిస్తుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా సదరు డొమైన్‌లో నైపుణ్యాలు లభించడంతోపాటు శాశ్వత కొలువు దక్కే అవకాశం ఉంటుంది. నెట్‌వర్కింగ్ పెరిగి కెరీర్ పరంగా భవిష్యత్‌లో ప్రయోజనం దక్కుతుంది.
పరిశీలన ద్వారా..
కెరీర్ ఎంపికలో తడబాట్లను దిద్దుకునేందుకు ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు అందుబాటులో లేవా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తేదే. కొంత రీసెర్చ్, ఇతర అంశాల పరిశీలన ద్వారా కెరీర్ ఎంపికలో శాస్త్రీయంగా వ్యవహరించొచ్చు.
- ఎస్.వినయ్‌వర్థన్, కెరీర్ నిపుణులు.

- ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, స్కెచెస్ ఇష్టపడితే.. అతని కెరీర్ డిజైన్ డొమైన్‌లో.. అలాగే పరికరాల పట్ల ఆసక్తి ఉంటే.. అతని దృష్టి ఇంజనీరింగ్ వైపు వెళ్తుంది. దీనికి కారణం.. అలవాట్లు, ఇష్టాలను కెరీర్‌కు అన్వయించడమే.
- చాలామంది విద్యార్థులు విన్నదాని ఆధారంగా, ఎలాంటి అధ్యయనం చేయకుండా.. లోతుగా ఆలోచించకుండా కెరీర్‌పై నిర్ణయానికి వస్తుంటారు.
సరైన ఎంపిక ఇలా...
వేలల్లో ఆప్షన్లు.. వాటిలో మీకు నప్పే.. మీరు మెచ్చే కెరీర్‌ను ఎంచుకోవడం క్లిష్టమైన పనే! ఇష్టాలు, సామర్థ్యాలతోపాటు కొన్ని శాస్త్రీయ పద్ధతులను అనుసరించి కెరీర్ పరంగా సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ దిశగా పరిశీలించాల్సిన కీలక అంశాలు...
సహజ సామర్థ్యం :
ప్రతి ఒక్కరూ కొన్ని పనులను ఇతరులతో పోల్చితే సులభంగా, వేగంగా చేయగలుగుతారు. ఈ సహజ సామర్థ్యాన్ని పనిచేసే చోట ప్రదర్శించగలిగితే.. మంచి వేతనాలతో పాటు పదోన్నతులు దక్కుతాయి. అందుకే సహజ సామర్థ్య ప్రదర్శనకు వీలున్న కెరీర్‌ను ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.
స్వీయ పరిశీలన :
ఆసక్తులు, సాఫ్ట్‌స్కిల్స్, అభిరుచులు, విలువలు, వ్యక్తిత్వం తదితరాల ఆధారంగా తమకు సరిపోయే కొన్ని రంగాలు, కెరీర్‌ల జాబితా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఆయా కెరీర్‌ల పట్ల పరిశోధన చేయడం ద్వారా ఓ జాబితాను రూపొందించుకోవచ్చు. సదరు జాబితాలోని కెరీర్‌ల గురించి మరింత పరిశోధన చేయడం, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా జాబితాను కుదించొచ్చు. దీనికోసం లింక్డిన్ బాగా ఉపయోగపడుతుంది. జాబితాలోని కెరీర్‌లు, రంగాలను ఒక్కోటి పరిశీలించుకుంటూ.. ప్రతికూల, సానుకూల అంశాలను రాసుకోవాలి. స్వీయ బలాలు, బలహీనతల ఆధారంగా విశ్లేషణ చేయాలి. అవసరమైతే ‘కెరీర్ టెస్టుల’ ఆధారంగా స్వీయ విలక్షణతలను గుర్తించగలిగితే.. సరిపోయే కెరీర్‌ను ఎంచుకోవడం తేలికవుతుంది. అదేవిధంగా కెరీర్ కౌన్సిలర్లను సంప్రదించడం ద్వారా సరైన కె రీర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
పక్కా ప్రణాళిక :
ప్రతివిద్యార్థి.. కెరీర్ పరంగా పక్కా ప్రణాళిక, లక్ష్యాలను కలిగుండాలి. అప్పుడే కెరీర్ సోపానంలో ముందువరుసలో ఉంటారు. ఉదాహరణకు మీ తక్షణ, ప్రథమ లక్ష్యం బిజినెస్ అనలిస్ట్ కావడమైతే.. తర్వాతి లక్ష్యాలు వరుసగా ఐటీ సపోర్ట్ మేనేజర్, డెరైక్టర్ ఆఫ్ సపోర్ట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సపోర్ట్ కావాలి! ఇలా ఎప్పటికప్పుడు స్థిరమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని సాధించేందుకు ప్రయత్నించినప్పుడే కెరీర్ నిచ్చెనలో పైకి చేరగలరు.
జీపీవీ ఫార్ములా..
కెరీర్ పరంగా గిఫ్ట్స్, ఫ్యాషన్స్, వాల్యూస్ (జీపీవీ).. ఫార్ములాను అనుసరించాలి. ఏయే రంగంలో ఏ విధమైన గ్రోత్ ఉంటుంది..స్వీయ ఇష్టాలు ఏ రంగం వైపు వెళ్లమంటున్నాయి.. తదితర అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. కెరీర్ ఎంపికలో విలువలను వదులుకోవాల్సిన అవసరం లేదు. విలువలకు భంగం కలగని కెరీర్‌ను ఎంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కొత్తదనం..
డాక్టర్, లాయర్, టీచర్, కంప్యూటర్ ఇంజనీర్.. ఇలా ఎప్పుడూ సంప్రదాయ కొలువులేనా.. యువత కెరీర్ ఎంపికలో కొత్తదనంపైనా దృష్టిపెట్టాలి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కొత్త కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఆయా ఉద్యోగాల్లో స్థిరపడటం ద్వారా ఇతర రంగాలతో పోల్చితే త్వరగా ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ :
కెరీర్ ఎంపికలో ఇంటర్న్‌షిప్ స్పష్టతనిస్తుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా సదరు డొమైన్‌లో నైపుణ్యాలు లభించడంతోపాటు శాశ్వత కొలువు దక్కే అవకాశం ఉంటుంది. నెట్‌వర్కింగ్ పెరిగి కెరీర్ పరంగా భవిష్యత్‌లో ప్రయోజనం దక్కుతుంది.
పరిశీలన ద్వారా..
కెరీర్ ఎంపికలో తడబాట్లను దిద్దుకునేందుకు ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు అందుబాటులో లేవా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తేదే. కొంత రీసెర్చ్, ఇతర అంశాల పరిశీలన ద్వారా కెరీర్ ఎంపికలో శాస్త్రీయంగా వ్యవహరించొచ్చు.
- ఎస్.వినయ్‌వర్థన్, కెరీర్ నిపుణులు.
Published date : 25 Dec 2018 08:49PM