స్కూల్ అసిస్టెంట్ సాధించాలంటే.. సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్ సాగించండిలా..
Sakshi Education
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు.. ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్య పుస్తకాలను ఉపయోగించుకోవాలి.
మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టి సారించాలి.
- బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
- సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలను చదవాలి.
మెథడాలజీ..
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్ స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించింది. కాని బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి.
ఇంకా చదవండి: part 5: మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి..
Published date : 16 Mar 2021 04:42PM