సివిల్స్-2020విజయానికి సరైన మార్గాలు...
Sakshi Education
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. దేశంలో అత్యున్నత సర్వీసులుగా భావించే.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర 24 కేంద్ర సర్వీసుల్లో.. పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియ! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వచ్చే నెలలో (ఫిబ్రవరి-2020) సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మూడంచెల్లో సివిల్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూల్లో.. తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష మే 31వ తేదీన ఉంటుంది. అంటే.. దాదాపు ఇంకా ఐదు నెలల సమయం అందుబాటులో ఉంది. విస్తృతమైన సిలబస్ దృష్ట్యా అభ్యర్థులు నిర్దిష్ట ప్రణాళికతో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. సివిల్స్ ఎంపిక ప్రక్రియ... ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. సిలబస్ విశ్లేషణ.. ప్రిపరేషన్ గెడైన్స్...
తొలిదశ.. ప్రిలిమ్స్ :
మూడు దశల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష అత్యంత కీలకం. ఎందుకంటే... సివిల్స్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య వేయి లోపే! కాని పోటీ పడే అభ్యర్థుల సంఖ్య తొమ్మిది నుంచి పది లక్షల మంది!! ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మెయిన్‌కు ఎంపిక చేస్తారు. అంటే... ప్రిలిమ్స్‌కు దరఖాస్తుచేసుకునే పది లక్షల మంది నుంచి మెయిన్‌కు ఎంపికయ్యేది కేవలం 12 వేల మంది. దీన్నిబట్టే ప్రిలిమ్స్‌లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పోస్ట్‌ల సంఖ్య తక్కువయ్యే కొద్దీ మెయిన్‌కు పోటీ మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి ప్రిలిమ్స్‌లో గట్టెక్కడం అత్యంత కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే.. నోటిఫికేషన్ వెలువడే వరకూ వేచి చూడకుండా.. సాధ్యమైనంత ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్ పరిశీలన..
సివిల్స్ అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. ఇందుకోసం గత నోటిఫికేషన్‌ను ఆధారం చేసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలతోపాటు తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయిని అంచనావేసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్ పరంగా తాము ఎక్కువగా దృష్టిసారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా దేనికి ఎంత సమయం కేటాయించాలి? ఏ పుస్తకాలు చదవాలి? మనకు సులువైన, క్లిష్టమైన అంశాలేవో తెలుస్తుంది. తద్వారా నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించడానికి మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ సబ్జెక్టులకు ఎంత ప్రాధాన్యం లభిస్తోంది తదితర అంశాలపై అవగాహన కలుగుతుంది.
మెటీరియల్‌సేకరణతో..
ప్రిలిమ్స్ అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ సేకరణపై దృష్టిపెట్టాలి. మెటీరియల్ ఎంపిక కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలి. తొలుత అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించాలి. ప్రతి సబ్జెక్ట్ విషయంలోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని టాపిక్స్ సమగ్రంగా పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే ఆయా టాపిక్‌కు సంబంధించి నాలుగైదు పుస్తకాలకు బదులు ఏదో ఒక ప్రామాణిక మెటీరియల్‌ను నాలుగైదుసార్లు చదవడం మేలు చేస్తుంది. ముఖ్యంగా మొదటిసారి ప్రిలిమ్స్ రాస్తున్న అభ్యర్థులు ఇలాంటి వ్యూహం అనుసరించడం ఉపయుక్తం.
రెండు పేపర్లు..
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు.. జనరల్ స్టడీస్-1, జనరల్ స్టడీస్-2(సీశాట్) ఉంటాయి. అభ్యర్థులు రెండు పేపర్లకు భిన్నమైన ప్రిపరేషన్ వ్యూహాలు అనుసరించాలి. జనరల్ స్టడీస్-1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపర్ సీశాట్‌లో... రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం :
ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎందుకంటే... గత మూడు,నాలుగేళ్లుగా వర్తమాన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. వర్తమాన అంశాలతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన టాపిక్స్.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన దేశం తాజాగా ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి.
అనుసంధానం చేసుకుంటూ..
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ఆయా అంశాలను అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు-ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు అంశాలపైనా పట్టు లభిస్తుంది. ఇదే తరహాలో పాలిటీ-ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రభుత్వ నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణ.. జీఎస్‌టీనే తీసుకుంటే.. శాసన పరంగా తీసుకున్న ఈ నిర్ణయం.. ఆర్థిక, వాణిజ్య రంగాలపై చూపే ప్రభావం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇలా అనుసంధానించుకుంటూ చదివితే.. ఏకకాలంలో అనేక అంశాలపై పట్టు చిక్కుతుంది. అంతేకాకుండా ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.
డిస్క్రిప్టివ్ అప్రోచ్..
వాస్తవానికి ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరిగినా.. అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పద్ధతిలో చదవాలి. దీనివల్ల సదరు టాపిక్‌పై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్ ప్రిపరేషన్‌ను సులభం చేస్తుంది. కాబట్టి ఒక అంశానికి సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో పేర్కొన్న విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్‌కు కూడా ఉపయోగపడుతుంది.
పేపర్-2 (సీశాట్)కు ఇలా..
పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అర్హత పరీక్షగానే పేర్కొంటున్నారు. కాని ఈ పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్-1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆప్టిట్యూడ్ టెస్ట్‌పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్‌ను అధ్యయనం చేయాలి. ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.
టైమ్ మేనేజ్‌మెంట్..
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్‌లను చదవాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల అన్ని అంశాలను పూర్తి చేయడం కష్ట సాధ్యమవుతుంది. అలాగే ప్రిపరేషన్ సమయంలో మెమొరీ టిప్స్, మైండ్ మ్యాపింగ్స్ అనుసరించడం ద్వారా ముఖ్యమైన అంశాలను బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అభ్యర్థులు తమకు అనుకూలమైన టిప్స్, షార్ట్‌కట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, చార్ట్ బేస్డ్ నోట్స్ వంటి వ్యూహాలు పాటించాలి.
రివిజన్... రివిజన్ :
ప్రిలిమ్స్‌కు సబ్జెక్ట్‌లపై పట్టు ఎంత ముఖ్యమో.. రివిజన్ కూడా అంతే ప్రధానమని గుర్తించాలి. ప్రిలిమినరీ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించాలి. ఈ సమయంలో రివిజన్‌తోపాటు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది.
ప్రిలిమ్స్ పరీక్ష స్వరూపం :
పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. అవి..
ప్రిలిమ్స్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు.
ప్రిలిమ్స్.. సిలబస్ :
పేపర్-1(జనరల్ స్టడీస్) :
ఇందులో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్.
పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్ - సీశాట్) :
కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్.
చరిత్ర :

పేపర్ | అంశం | ప్రశ్నలు | మార్కులు |
పేపర్-1 | జనరల్ స్టడీస్ | 100 | 200 |
పేపర్-2 | ఆప్టిట్యూడ్ టెస్ట్ | 80 | 200 |
ప్రిలిమ్స్.. సిలబస్ :
పేపర్-1(జనరల్ స్టడీస్) :
ఇందులో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్.
పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్ - సీశాట్) :
కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్.
చరిత్ర :
- ఆధునిక చరిత్ర
- జాతీయోద్యమం
- ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక- ఆర్థిక చరిత్ర అంశాలు చదవాలి. అలాగే ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన-పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేక తిరుగుబాట్లు-ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలు కీలకం.
- రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు-వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
- రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, ప్రభుత్వం, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
- పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె. రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
- ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన ఎలా జరుగుతుంది? అందులో ప్రముఖ భాగస్వాములెవరు? విధానాల అమలు, వాటి సమీక్ష.
- ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు
- కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, తాజాగా చర్చనీయాంగా మారిన అంశాలు.
- ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు -మూలధన వనరుల పాత్ర.
- ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం).
- ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక-సాంఘికాభివృద్ధి.
- పారిశ్రామిక తీర్మానాలు-వ్యవసాయ విధానం.
- పంచవర్ష ప్రణాళికలు, ప్రణాళిక రచన-వనరుల కేటాయింపు
- 10,11 పంచవర్ష ప్రణాళికలు.
- బ్యాంకింగ్ రంగం ప్రగతి-సంస్కరణలు.
- డీ మానిటైజేషన్, జీఎస్‌టీ. - తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు,
- ఎకనామిక్ సర్వే, బడ్జెట్.
- పరీక్షకు ముందు ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు.
- ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు - కారకాలు.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
- రక్షణ రంగంలో మిస్సైల్స్ ప్రయోగాలు
- ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు.
- ఏడాది కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు.
- రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్
- ఎకాలజీ ప్రాధాన్యత గల అంశాలు
- ఆయా సంస్థల నివేదికలు - గణాంకాలు - సిఫార్సులు, బ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు- వ్యక్తులు.
- ఏప్రిల్ రెండు లేదా మూడో వారం వరకు ప్రిలిమ్స్, మెయిన్ టాపిక్స్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఆ తర్వాత పూర్తిగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్, రివిజన్‌కు కేటాయించాలి.
- కనీసం మూడు మాక్ టెస్టులు లేదా మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
- ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా సమయం విభజించుకోవాలి.
- ప్రతి చాప్టర్/యూనిట్ పూర్తయిన తర్వాత అందులోని ముఖ్యాంశాలతో సంక్షిప్త నోట్స్ రాసుకోవాలి.
- పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకు ముందు ఏడాది కాలంలో జరిగిన కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి.
120 మార్కులు లక్ష్యంగా చదవాలి..
సివిల్స్ అభ్యర్థులు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్‌లో కనీసం 120 మార్కులు సాధించేలా కృషి చేయాలి. ఫలితంగా మలిదశ మెయిన్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో గత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. అదే విధంగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
తొలిసారే లక్ష్యం సాధించేలా..
ప్రిలిమ్స్ తొలిసారి హాజరయ్యే అభ్యర్థులు ప్రాక్టీస్‌గా భావిస్తారు. కానీ.. తొలి ప్రయత్నంలోనే లక్ష్యం సాధించేలా మలచుకోవాలి. ప్రతిరోజు ప్రిపరేషన్, ప్రాక్టీస్ సాగించడం ఎంతో ముఖ్యం. మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం, గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
- ఇమ్మడి పృథ్వితేజ,సివిల్స్-2018 ఫలితాల్లో 24వ ర్యాంకర్

సివిల్స్ ప్రిలిమ్స్-2020 పరీక్ష సమాచారం:
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
నోటిఫికేషన్ వెల్లడి: ఫిబ్రవరి 12, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3, 2020
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 31, 2020
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
నోటిఫికేషన్ వెల్లడి: ఫిబ్రవరి 12, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3, 2020
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 31, 2020
Published date : 06 Jan 2020 05:50PM