రచయిత అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఇదిగో దారి!

పలు హాలీవుడ్ చిత్రాలకు కథలను కూడా అందించింది. ఆమె తొలినాళ్లలో ఏం చేసేదో చాలాకొద్ది మందికి మాత్రమే తెలుసు. బీఏ ఫ్రెంచ్ చదువుకున్న రౌలింగ్.. టీచర్గా పనిచేసేది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు రచయిత్రిగా మారింది.
చేతన్ భగత్.. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న రచయిత. ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్, వన్ నైట్ ఎట్ ది కాల్సెంటర్, టు స్టేట్స్: ది స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్, ది త్రి మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, హాప్ గర్ల్ఫ్రెండ్’.. ఇలా ఎన్నో నవలలు రాసి, పేరు, డబ్బు సంపాదించాడు. ఇతను ఐఐటీ ఢిల్లీలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐఎం– అహ్మదాబాద్లో ఎంబీఏ చదివాడు. రచయితగా మారక ముందు చేతన భగత్ హాంకాంగ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉద్యోగం చేసేవాడు.
యండమూరి వీరేంద్రనాథ్..
పాపులర్ తెలుగు నవలా రచయిత. ఎన్నో సూపర్హిట్ సినిమాలకు కథలు అందించారు. పర్సనాలిటీ డవలప్మెంట్పై పుస్తకాలు రాశారు. ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ చదువుకొని.. ఆ తర్వాత కాలంలో రచయితగా రాణించారు.
....ఈ ముగ్గురు రచయితలు.. వారు చదువుకున్న డిగ్రీలకు, వారి కెరీర్కు సంబంధం లేదు. కానీ వారిలో కామన్గా కనిపించే లక్షణం రచనలు చేయడం. రచనల ద్వారా డబ్బు, సమాజంలో గుర్తింపు సొంతమవుతుందని వీరు నిరూపించారు. రచనలు చేయడాన్ని వృత్తిగా మార్చుకోవచ్చని చాటిచెప్పారు. అయితే, నేటికీ చాలామందికి రచయితగా మారాలనే కోరిక ఉన్నా..ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఈ నేపథ్యంలో.. నేటి యువత రచయితగా మారడమెలాగో తెలుసుకుందాం...
ప్రేరణ.. శైలి..
రచనలు చేయడం ఓ కళ. సృజనాత్మకంగా ఆలోచించే లక్షణం ఉంటే.. అదే రచనలు చేయడానికి తొలిమెట్టు అవుతుంది. తొలుత ఏం రాయాలనుకుంటున్నారో గుర్తించాలి. రచనల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సాహిత్యం, కవిత్వం వంటివి. ఇందులో సైన్స్ ఫిక్షన్, మిస్టరీస్, ప్రయోగాత్మక రచన, ట్రావెల్స్ జర్నీ వంటివి ప్రధానమైనవి. వీటిలో ఏ అంశంపై ఆసక్తి ఉందో.. సొంత ఆలోచనా సరళి ఎలా ఉందో గుర్తించాలి. మన మనసు ఏ అంశాన్ని ఇష్టపడుతుందో దాన్నే కథా వస్తువుగా తీసుకోవాలి. మన అభిరుచిని రచనలో చూపించినప్పుడు పాఠకులు ఆ కథలను చదివేందుకు ఆసక్తి చూపుతారు. ఫిక్షన్, ప్రేమ, కుటుంబం, హర్రర్.. ఇలా బాగా ప్రభావితమైన ఏ అంశాన్నైనా వస్తు కేంద్రంగా తీసుకొని రచనలు ప్రారంభించవచ్చు.
అనుకూల సమయం..
మంచి ఆలోచనలు రావాలన్నా.. వాటికి అక్షర రూపం ఇవ్వాలన్నా.. చక్కటి వాతావరణం అవసరం. ఇష్టమైన సమయంలో, నచ్చినచోట కూర్చొని ఆలోచించినప్పుడు మనసులో వెల్లువెత్తే భావాలను పేపర్పై రాసేందుకు సిద్ధమవ్వాలి. ఒకసారి మొదలు పెడితే.. మెదడు సృజనాత్మకంగా ఆలోచించేందుకు, చక్కగా పనిచేసేందుకు అలవాటుపడుతుంది. కొంతమంది రచయితలు పూర్తి నిశబ్దంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటే.. మరికొందరు జన సమూహంలో ఉండి, రణగొణ ధ్వనుల మధ్య కూడా రాయగలుగుతారు. కొందరు సంగీతం వింటూ ఆలోచనలను అక్షరబద్ధం చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ సమయాన్ని మలచుకుంటారు. కొందరు తెల్లవారుజా మునే రచనలు చేస్తే.. మరికొందరు అందరూ నిద్రపోయాక రాయడం మొదలు పెడతారు. అలా మన జీవన సరళికి తగ్గ సమయాన్ని రచనలు చేసేందుకు ఎంచుకోవాలి.
రీడింగ్.. లెర్నింగ్..
రచయితగా మారేందుకు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. బాగా చదివే అలవాటు! దీంతోపాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి..భిన్నంగా ఆలోచించగలగడం.. ఒకసారి చదివిన అంశాన్ని మళ్లీమళ్లీ చదవడం.. విషయాన్ని త్వరగా అవగాహన చేసుకొని విశ్లేషించడం వంటి లక్షణాలు తప్పనిసరి. ఏదైనా రచనలో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఈంశాలను మళ్లీ మళ్లీ చదవాలి. ఆ అంశాలు లేదా పుస్తకాలు ఎంతగా ప్రభావితం చేసాయో తెలుసుకోవాలి. ఇష్టమైన కవిత రచనా శైలి లేదా నచ్చిన నవలలోని పాత్రల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదివేటప్పు డు బాగా ప్రభావితం చేసిన పాత్రలపై విశ్లేషణ రాసేందుకు ప్రయత్నించాలి. దానివల్ల మనకు ఏం అర్థమైందో.. మన మనసు దాని గురించి ఏం చెబుతుందో తెలుస్తుంది. అంతేకా దు.. రచయిత ఆ పదబంధాలను ఎందుకు ఎంచుకున్నాడో.. ఆ నేపథ్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. దీనిద్వారా ఓ సొంత శైలి మనలో రూపుదిద్దుకుంటుంది. తద్వారా రచనలు చేసే శక్తి మెరుగవుతుంది. ఒక్కో రచయిత ఒక్కో శైలిలో రాస్తుంటారు. వాటన్నింటిపైనా విశ్లేషణ చేయాలి. ఒక పుస్తకం చదువుతుంటే.. అది ఏ ప్రయోజనం కోసం చదువుతు న్నామో తెలియాలి. దాని నుంచి ఏం ప్రేరణ పొందామో గుర్తించాలి.
అన్వేషణ..
మంచి రచనలు చేసేందుకు మూల కథ చాలా అవస రం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రచయితగా అన్వేషించాలి. ఒక్కోసారి మనం ఉంటున్న ఇంట్లోనే కథకు మూల అంశం దొరుకుతుంది. కొన్నిసార్లు ప్రయాణ సమయంలో.. చుట్టుప క్కల తిరిగే మనుషుల నేపథ్యం నుంచి మూల కథ లభిస్తుం ది. అందుకోసం అన్వేషణ మొదలుపెట్టి.. కొత్త విష యాలు తెలుసుకోవాలి. జరిగిన ప్రతి సంఘటనకు ఓ మూలం ఉం టుంది. మనకు కనిపించేది ఆ సంఘటన అయితే.. అందుకు కారణమై కనిపించకుండా ఉండేదే మూలం. రచయిత ఆ మూలాల్లోకి వెళ్లాలి. అప్పుడే దాని వెనుకున్న రహస్యాలు తెలుస్తాయి. దానిపై మనసు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. వాటికి సమాధానాలు వెతకాలి. చూసిన విషయాన్ని చూసి నట్టు రాసేందుకు ప్రయత్నించకుండా.. నేపథ్యాన్ని వస్తువుగా తీసుకొని మనసు ఏం చెబుతుందో దాన్ని అక్షరబద్ధం చేయాలి. అప్పుడే సదరు రచన మరింత బలంగా ఉంటుంది. రోజూ చదివే పత్రికల్లో ఎన్నో స్ఫూర్తినిచ్చే విషయాలు కనిపిస్తుంటాయి. వాటి నుంచి కూడా ప్రేరణ పొందవచ్చు.
రచనా ప్రారంభం..
మన దగ్గర కథా వస్తువు ఉంది.. రాయలని ఉంటుంది.. కానీ, పెన్ను కదలదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాదు. భావాలకు అక్షర రూపం ఇవ్వడం అంతతేలిక కాదు. అప్పుడే రచయితలోని సృజన బయట పడుతుంది. ఇలాంటప్పుడు ఓ పెన్ను, నోట్బుక్ తీసుకొని కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాల్లో బాగా ఆకట్టుకున్న అంశాన్ని అక్షరబద్ధం చేయాలి. దానికి మన సృజనను, ఊహలను జత చేయాలి. ఒక్కసారి ఆలోచనల అమరిక కుదిరాక పదాల వరద పొంగుకొస్తుంది. ఇదే అద్భుతమైన రచనలకు ఆరంభం అవుతుంది! ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ప్పుడు మనుషుల సంభాషణను రికార్డు చేసుకొని.. దానిని కాగితంపై అక్షరబద్ధం చేసేందుకు ప్రయత్నించొచ్చు. వారి సంభాషణలో మీరు గుర్తించిన భయం, కోపం, ప్రేమ.. ఇలా భావం చెడిపోకుండా పర్యాయ పదాలతో రాయాలి.
సొంత బ్లాగ్..
రచయితగా మీ ఆలోచనలను ఇతరులతో పంచుకునేం దుకు సొంతంగా ఓ బ్లాగ్ నిర్వహించడం మేలు. మీరు చెప్పదలచుకున్న కథలను అక్కడ పోస్ట్ చేయాలి. వాటిని చదివినవారు తమ అభిప్రాయాలను చెబుతారు. రచనా శైలి బాగుందనో.. కథనం బాగుందనో, బాగాలేదనో ఏదో ఒకటి చెబుతుంటారు. లేదా.. అలాంటి సంఘటన తమ జీవితంలో ఎదురైందనో లాంటి అభిప్రాయాలను పంచుకుంటారు. పాఠకుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీ శైలిని మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించొచ్చు.
అర్హతలు–కోర్సులు..
పూర్తిస్థాయిలో రచయితగా మారే ముందు కనీసం డిగ్రీ పూర్తి చేసుకోవడం మేలు. ముఖ్యంగా ఇంగ్లిష్, తెలుగు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా భాషతోపాటు సాహిత్యంపై అవగాహన పెరుగుతుంది. ఇది మంచి రచనలు చేసేందుకు దోహదపడుతుంది. దీంతోపాటు అవకాశం ఉంటే క్రియేటివ్ రైటింగ్ కోర్సుల్లో చేరడం ద్వారా స్క్రిప్ట్ రైటింగ్, ప్లే రైటింగ్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.