ఫ్రీలాన్సింగ్ జాబ్ కు అంకురం...!
Sakshi Education
‘స్టార్టప్ నెలకొల్పి.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే.. సృజనాత్మక ఆలోచనతోపాటు అనుభవం కావాలి. అన్నింటికీ మించి పెట్టుబడి లక్షల్లో ఉండాలి’.. ఇది సాధారణంగా స్టార్టప్‌తో.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకునే యువతలో ఉండే అభిప్రాయం. జైపూర్ యువకుడు ఆయుష్ గోయల్ మాత్రం.. మంచి ఆలోచన ఉంటే మిగిలినవి సమస్యలే కావని నిరూపిస్తున్నాడు. 21 ఏళ్ల ఆయుష్ కేవలం రూ.20 వేల పెట్టుబడితో ‘మిషన్‌క్యా’ పేరుతో ఫ్రీలాన్సింగ్ జాబ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. ఏడాది వ్యవధిలో దాదాపు రూ.22 లక్షల ఆదాయాన్ని ఆర్జించడంతోపాటు 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. సంస్థలకు చక్కటి మానవ వనరులు.. ఫ్రీలాన్సింగ్ విధానంలో లభించే అవకాశం కల్పిస్తూ ఆన్‌లైన్ మ్యాన్‌పవర్ మార్కెట్లో దూసుకెళ్తున్నాడు.
బీటెక్ పూర్తి కాకుండానే..
గతేడాది జూలైలో ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ (www.missionkya.com) ను ఏర్పాటు చేసే సమయానికి ఆయుష్ గోయల్ బీటెక్ మూడో సంవత్సరం పూర్తి చేసుకొని.. నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతున్నాడు. మిగిలిన స్నేహితులంతా బీటెక్ ఫైనలియర్‌లో రాణించడంపై దృష్టి పెడుతూ.. ప్రాజెక్ట్ వర్క్స్, పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. కానీ, ఆయుష్ గోయల్ ఆలోచనలు మాత్రం స్టార్టప్ ఏర్పాటు చుట్టూ తిరుగుతున్నాయి. దాంతో అకడమిక్‌గా ప్రతికూల ప్రభావం పడింది. తక్కువ మార్కులు వచ్చాయి. ‘చక్కగా మంచి మార్కులతో సీఎస్‌ఈ పూర్తిచేస్తే సాఫ్ట్‌వేర్ కొలువు సొంతమవుతుంది. జీవితం హాయిగా గడిచిపోతుందని ఇంజనీరింగ్‌లో చేర్పిస్తే.. ఇలా చేస్తున్నాడేంటి?’ అని కుటుంబ సభ్యుల్లో ఒకటే ఆందోళన!
స్టార్టప్ ఆలోచనకు నాంది...
ఆయుష్ గోయల్‌కు స్వయంగా ఎదురైన ఒక చేదు అనుభవమే అతన్ని ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ఏర్పాటు దిశగా పురిగొల్పింది. ‘బీటెక్ మొదటి సంవత్సరంలో ఒక ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్నాను.. ఆ పోర్టల్ జేపీజీ ఫైల్స్‌ను వర్డ్‌ప్యాడ్‌లోకి మార్చే ప్రాజెక్ట్ ఇచ్చింది.. దాన్ని పూర్తిచేశాను. కానీ, ఎన్ని రోజులు వేచి చూసినా.. డబ్బులు చేతికి రాలేదు. దాంతో మోసపోయానని గ్రహించాను. నేనే కాదు నాలాంటి వారు చాలా మంది మోసపోతున్నారని తెలిసింది. దాంతో స్వయంగా ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన నాలో కలిగింది’ అంటూ.. తన స్టార్టప్ ఏర్పాటుకు గల కారణాన్ని వివరించాడు ఆయుష్ గోయల్.
పెట్టుబడి రూ.20 వేలు...
బీటెక్ మొదటి సంవత్సరంలో మొగ్గతొడిగిన ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు.. ఆయుష్ పెద్ద కసరత్తే చేశాడు. కానీ, పెట్టుబడి మాత్రం కేవలం రూ.20 వేలు మాత్రమే. ఇందులో రూ.2 వేలను మిషన్‌క్యా పేరుతో వెబ్ డొమైన్ రిజిస్ట్రేషన్‌కు, మిగిలిన మొత్తాన్ని వెబ్‌సైట్ రూపకల్పనకు, సంస్థ సర్వీసుల మార్కెటింగ్‌కు వెచ్చించాడు. తక్కువ పెట్టుబడితో గతేడాది జూలైలో ప్రారంభించిన మిషన్‌క్యా ఆన్‌లైన్ జాబ్ సోర్స్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు (ఏడాది వ్యవధిలో) రూ.22 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదే బీటెక్ పూర్తిచేసుకున్న ఆయుష్.. తన స్టార్టప్ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ‘ఒకవైపు సహచరులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రిపరేషన్‌లో ఉంటే.. నేను మాత్రం ఒకే లక్ష్యంతో స్టార్టప్ వైపు అడుగులు వేశాను. ఇది ఏడాదిలోనే ఇంత ఆదరణకు నోచుకుంటుందని ఊహించలేదు’ అని చెబుతున్నాడు ఆయుష్.
సీకర్స్ అండ్ ప్రొవైడర్స్ అనుసంధానం..
మిషన్‌క్యా ప్రధాన ఉద్దేశం.. ఫ్రీలాన్స్ విధానంలో జాబ్స్ చేయాలనుకునే వారిని.. ఫ్రీలాన్స్ విధానంలో మానవ వనరులు కావాలనుకునే వారిని అనుసంధానించడం. లీగల్, సీఏ, ఫొటోగ్రఫీ, వెబ్ డిజైనింగ్.. దాదాపు 20 విభాగాల్లో జాబ్ సీకర్స్, ప్రొవైడర్స్‌కు అనుసంధానంగా మిషన్‌క్యాను నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 800కుపైగా జాబ్ ప్రొవైడర్స్, సీకర్స్ మిషన్‌క్యా ద్వారా ప్రయోజనం పొందారు. ఆన్‌లైన్ అవుట్ సోర్సింగ్ విభాగంలో పలు దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో.. బీటెక్ కూడా పూర్తిచేయని కుర్రాడు ప్రారంభించిన ప్లాట్‌ఫామ్‌కు ఈ స్థాయిలో స్పందన రావడం విశేషం.
లక్ష్యం.. రెండేళ్లలో రూ.6 కోట్లు
మిషన్‌క్యా భవిష్యత్తు లక్ష్యం రానున్న రెండేళ్లలో రూ.6 కోట్ల మేర ఆదాయం ఆర్జించడమేనని గోయల్ పేర్కొంటున్నాడు. ఈ విషయంపై పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతున్నాడు. పలు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు.. తమ ఉత్పత్తుల మార్కెటింగ్, డెలివరీ తదితరాల కోసం మిషన్‌క్యాను సంప్రదిస్తున్నాయని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటే తప్పకుండా తన లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతోపాటు మిషన్‌క్యా సేవలను అంతర్జాతీయంగా విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నాడు.
ఆ మూడు లక్షణాలు ఉంటే...
నేటి యువతకు.. లక్ష్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండాలని.. ఈ మూడింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఆయుష్ గోయల్ సూచిస్తున్నాడు. ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత.. దాని సాధనకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని, లక్ష్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదని అంటున్నాడు. ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే క్రమంలో తమకంటూ సొంత ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలకు లభించే అవకాశాల పరిధి గురించి విస్తృతంగా పరిశోధన చేయాలి. ఈ సమయంలో ఇతరుల మాటలు, ప్రలోభాలకు గురికాకూడదని సలహా ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలకు మన కుటుంబ సభ్యుల నుంచే ప్రతికూలత ఎదురవుతుంది. కానీ, వారిని మెప్పించగలిగే ఆత్మవిశ్వాసం ఉంటే.. విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటున్నాడు ఆయుష్!!

Published date : 17 Oct 2017 05:14PM