ఫిట్‌నెస్ రంగంలో అపార అవకాశాలు-అందుకునేందుకు మార్గాలు...
Sakshi Education
ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, జీవనశైలి కారణాలతో.. అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్‌గా ‘ఫిట్’గా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ‘ఫిట్‌నెస్’కు ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిట్‌నెస్ సెంటర్లకు, జిమ్‌లకు వెళ్లడం నేడు సర్వసాధారణంగా మారింది. దాంతో సరికొత్త కెరీర్ మార్గంగా నిలుస్తోంది.. ఫిట్‌నెస్ రంగం! ఈ నేపథ్యంలో... ఫిట్‌నెస్ రంగంలో అవకాశాలు, వాటిని అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం...
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే మానసిక ధృడత్వం సాధ్యం అవుతుంది. మానసికంగా బలంగా ఉంటేనే లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. కాని ప్రస్తుతం జంక్‌ఫుడ్, జీవన శైలి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతోంది. ఇది గమనించిన యువత, మధ్యవయస్కులు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు సిక్స్ ప్యాక్ అంటుంటే.. మరికొందరు యోగా, మెడిటేషన్‌వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది న్యూట్రిషన్‌పై దృష్టిసారిస్తున్నారు. ఇలా వివిధ మార్గాల్లో ఫిట్‌నెస్ పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
వృద్ధి బాట:
వాస్తవానికి దేశంలో ఫిట్‌నెస్ రంగం ఏటేటా వృద్ధి బాటలో పయనిస్తోంది. గతంలో ఫిట్‌నెస్ సెంటర్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితమయ్యేవి. కానీ.. ప్రస్తుతం అవి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి. దేశ ఫిట్‌నెస్ రంగం ఏటా సగటున 9శాతం నుంచి 10శాతం వృద్ధి సాధిస్తున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 908 మిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉన్న భారత ఫిట్‌నెస్ రంగం.. 2022 నాటికి 1,296 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాల స్థాయిలో ‘ఫిట్ ఇండియా.. ఫిట్ స్కూల్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక- భారత జనాభాలో 24శాతం మంది పురుషులు, 43శాతం మంది మహిళలు శారీరకంగా చురుగ్గా లేరని(ఫిజికల్‌గా ఇన్‌యాక్టివ్) పేర్కొంది.
కార్పొరేట్ సంస్థలు సైతం :
నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఫలితంగా ఒత్తిడి పరిస్థితుల్లో సైతం సమర్థంగా విధులు నిర్వహించే మానసిక దృఢత్వం లభిస్తుందని భావిస్తున్నాయి. అందుకే సంస్థల కార్యాలయాల్లో జిమ్‌లు, ఫిట్‌నెస్ క్లబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఫిట్‌నెస్ శిక్షణలో సర్టిఫికెట్ పొందిన వారిని ట్రైనర్స్‌గానియమించుకుంటున్నాయి. ఇలా..వ్యక్తుల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు..ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడంతో అవకాశాల పరంగా ఎమర్జింగ్ కెరీర్‌గా మారుతోంది. ఫిట్‌నెస్ రంగంలో ఉపాధి పొందిన వారు నెలకు రూ. పది వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించే అవకాశముంది.
ఉపాధి వేదికలు :
ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు :
ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా చక్కటి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నారు. వీటితోపాటు పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫిట్‌నెస్ కోర్సులు అందిస్తున్నాయి.
అవి...
{పస్తుతం ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా పర్సనల్ ట్రైనర్స్‌కు డిమాండ్ నెలకొంది. పర్సనల్ ట్రైనర్‌గా రాణించాలంటే.. వ్యక్తిగతంగా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. మొత్తంగా ఫిట్‌నెస్ కెరీర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. శాయ్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో సర్టిఫికేషన్స్ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్లలో ఉద్యోగం ఖాయం.
- ఎ.రాజ్ శేఖర్, కో-ఫౌండర్, ప్లాటినమ్ ఫిట్‌నెస్ క్లబ్

- ఫిట్‌నెస్ సెంటర్స్/జిమ్స్,హెల్త్‌కేర్ సెంటర్స్
- హాస్పిటల్స్
- హోటల్స్/ టూరిస్ట్ క్లబ్స్
- కార్పొరేట్ కంపెనీలు.
స్వయం ఉపాధి :
{పస్తుతం ఫిట్‌నెస్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు సైతం పొందొచ్చు. ఫిట్‌నెస్ కల్చర్ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడమే ఇందుకు కారణం. ఫిట్‌నెస్ ట్రైనింగ్ నిపుణులు సొంతంగా ఫిట్‌నెస్ సెంటర్లను నెలకొల్పి ఆదాయార్జనకు మార్గం వేసుకోవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు :
ఫిట్‌నెస్ రంగంలో రాణించాలనుకునే వారికి -సంబంధిత శిక్షణ సర్టిఫికెట్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- సహనం, ఓర్పు
- వ్యక్తుల అవసరాలను గుర్తించగలిగే నైపుణ్యం తప్పనిసరి.
ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు :
ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా చక్కటి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నారు. వీటితోపాటు పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫిట్‌నెస్ కోర్సులు అందిస్తున్నాయి.
అవి...
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్-పాటియాల
- సాల్ట్ లేక్ యూనివర్సిటీ - కోల్‌కత
- నేషనల్ స్పోర్ట్స్ సౌత్ సెంటర్, యూనివర్సిటీ క్యాంపస్-బెంగళూరు
- లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్- తిరువనంతపురం
- హెచ్‌వీపీఎం - అమరావతి (మహారాష్ట్ర)
- ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సెన్సైస్ - ఢిల్లీ
- వీటితోపాటు ఠఛ్ఛీఝడ, ఠఛ్చీఛిజ్టీడ వంటి సంస్థలు ఆన్‌లైన్ విధానంలో ఫిజికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన(మజిల్ బిల్డింగ్, పైలేట్స్, టీచర్ ట్రైనింగ్ తదితర) కోర్సులు అందిస్తున్నాయి.
- పలు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో బీపీఈడీ కోర్సు కరిక్యులంలో ఫిజికల్ ఫిట్‌నెస్ అంశాన్ని బోధిస్తున్నారు.
- వీటితోపాటు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన పలు ప్రైవేట్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం శిక్షణ ఇస్తున్నాయి.
ఉద్యోగాలు ఇవే..
1. ఫిట్‌నెస్ ట్రైనర్: జిమ్/ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చే వ్యక్తులకు వారి ఆసక్తి, అవసరానికి అనుగుణంగా సంబంధిత శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మజిల్ బిల్డింగ్ కోసం ఫిట్‌నెస్ సెంటర్‌కు వెళితే.. దానికి సంబంధించి ఎక్సర్‌సైజ్‌ల గురించి చెప్పడం, శిక్షణ, పర్యవేక్షించడం చేయాల్సి ఉంటుంది.
2. గ్రూప్ ఫిట్‌నెస్/జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్: జిమ్‌కు వచ్చే వ్యక్తులందరికీ ఒకే సమయంలో ఫిట్‌నెస్‌పై శిక్షణనివ్వడం జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ పని. ఇతనికి ఫిట్‌నెస్ సెంటర్/జిమ్ స్థాయిని బట్టి నెలకు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది.
3. పర్సనల్ ట్రైనర్: ఫిట్‌నెస్ సెంటర్/జిమ్‌కు వచ్చిన సదరు వ్యక్తికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం పర్సనల్ ట్రైనర్ బాధ్యత. వీరికి నెలకు సగటున రూ.40వేల వరకు అందుతుంది.
4. ఏరోబిక్ ఇన్‌స్ట్రక్టర్: ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణనిచ్చే వారే ఏరోబిక్ ఇన్‌స్ట్రక్టర్స్. వీరికి నెలకు రూ.40 వేల వరకు వేతనం లభిస్తుంది.
5. ఫ్లోర్ ట్రైనర్: ఫిట్‌నెస్ సెంటర్‌లో ఒక ఫ్లోర్ మొత్తంలోని వ్యక్తులకు నిర్దిష్ట ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తూ, అందుకు సహకరించడం ఫ్లోర్ ట్రైనర్ విధులు. వీరికి నెలకు రూ.20వేల వరకు వేతనం లభిస్తుంది.
6. వెయిట్ అండ్ లైఫ్ స్టయిల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్: ఇటీవల కాలంలో కీలకంగా మారుతున్న ఉద్యోగం ఇది. ఊబకాయం ఉన్న వ్యక్తులకు అవసరమైన ఎక్సర్‌సైజ్‌ల గురించి చెప్పడం, అదే విధంగా డైట్ ప్లాన్ సూచించడం వంటివి కన్సల్టెంట్ విధులు.
7. మజిల్ బిల్డింగ్ ట్రైనర్స్: ప్రత్యేకంగా మజిల్ బిల్డింగ్‌పై ఆసక్తి కలిగిన వారికి శిక్షణ, పర్యవేక్షణ చేసే శిక్షకులే మజిల్ బిల్డింగ్ ట్రైనర్స్. వీరికి ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది. నెలకు రూ.50వేల వరకు అందుకునే అవకాశముంది.
8. యోగా ఇన్‌స్ట్రక్టర్: ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా ఇన్‌స్ట్రక్టర్లు అవసరం పెరుగుతోంది. సహజసిద్ధంగా దేహదారుఢ్యం పొందాలనుకునే వ్యక్తులు ఫిట్‌నెస్ సెంటర్లకు వెళుతున్నారు. ఇలాంటి వారి కోసం ఫిట్‌నెస్ సెంటర్ యాజమాన్యాలు యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించుకుంటున్నాయి.
9. ఫిట్‌నెస్ క్లబ్ మేనేజర్: ఫిట్‌నెస్ రంగానికి సంబంధించి కీలకమైన కొలువు.. ఫిట్‌నెస్ క్లబ్ మేనేజర్. ఇతను ఫిట్‌నెస్ సెంటర్ పర్యవేక్షణ, అవసరమైన పరికరాల కొనుగోలు వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది.
10. ఫిట్‌నెస్ డెరైక్టర్: ఒక రకంగా ఇది ఫిట్‌నెస్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత కొలువు. మొత్తం ఫిట్‌నెస్ క్లబ్ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తుంది.
ముఖ్యాంశాలు..

- ఇంటర్మీడియెట్, డిగ్రీతోనే ఫిట్‌నెస్ కోర్సుల్లో చేరొచ్చు.
- నిర్దిష్ట సర్టిఫికెట్‌తో ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- నెలకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వేతనం లభిస్తుంది.
- {పభుత్వ, ప్రైవేటు రంగంలో పలు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు
- సీఐఐ స్పోర్ట్స్ కమిటీ అంచనాల ప్రకారం- 2024కి దేశంలో అయిదింతలు కానున్న ఫిట్‌నెస్ రంగం.
- 2022 నాటికి 1,296 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఏటా సగటున 9 నుంచి 10 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటున్న అధికారిక గణాంకాలు.
{పస్తుతం ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా పర్సనల్ ట్రైనర్స్‌కు డిమాండ్ నెలకొంది. పర్సనల్ ట్రైనర్‌గా రాణించాలంటే.. వ్యక్తిగతంగా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. మొత్తంగా ఫిట్‌నెస్ కెరీర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. శాయ్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో సర్టిఫికేషన్స్ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్లలో ఉద్యోగం ఖాయం.
- ఎ.రాజ్ శేఖర్, కో-ఫౌండర్, ప్లాటినమ్ ఫిట్‌నెస్ క్లబ్
Published date : 24 Jan 2020 05:03PM