ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు వనరులు అదేస్థాయిలో తరిగిపోతున్నాయి. ఫలితం.. కరవు కాటకాలు, ఆకలి, పేదరికం, యుద్ధాలు, అశాంతి వంటి సామాజిక రుగ్మతలు పంజా విసురుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు భయానకమే. ఈ నేపథ్యంలో మానవుడు చేయాల్సింది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను తయారు చేసుకోవడం. ఈ రెండూ ఏకకాలంలో జరగాలి. భూగర్భంలో నీరు, చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి విలువైన వనరులు తగ్గిపోతుండడంతో ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే పరిశోధన ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వనరులను, పర్యావరణ హితమైన వస్తువులను ప్రజలకు అందించేవారే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అన్నిదేశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో హరిత వ్యాపారవేత్తలకు అవకాశాలు పెరుగుతున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాల ప్రోత్సాహం: అంతరిస్తున్న పచ్చదనం, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత వంటి కారణాలతో జనం ఆలోచనల్లో మార్పు వస్తోంది. పర్యావరణ హితమైన వస్తువుల వాడకంపై అవగాహన పెరుగుతోంది. దీంతో గ్రీన్ బిజినెస్ ఊపందుకుంటోంది. కరెంటు కోతల నేపథ్యంలో సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. సోలార్ పరికరాలకు, పర్యావరణ హిత వస్తువులకు అధిక డిమాండ్ ఉంది. వీటిని రూపొందించే సంస్థల్లో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దేశ విదేశాల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కెరీర్ ప్రారంభిస్తే.. ప్రస్తుతం అవకాశాలకు కొదవే లేదు. ఔత్సాహికులకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతోంది.
కావాల్సిన నైపుణ్యాలు: గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వ్యాపార నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించేందుకు, లావాదేవీలు నిర్వహించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. నిత్య అధ్యయనమే ఇందుకు మార్గం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఉండాలి. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ వనరుల తయారీపై ఆసక్తి అవసరం. ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు మెరుగైన మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి.
అర్హతలు: భారత్‌లో పలు విద్యాసంస్థలు పర్యావరణ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం బిజినెస్ స్కూళ్లలో కోర్సులు ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్లుగా వీటిని అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు ఆయా కోర్సుల్లో చేరొచ్చు.
వేతనాలు: హరిత వ్యాపారవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను అమల్లో పెట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.30 వేలకుపైగానే ఆర్జించే వీలుంది. వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తే ఆదాయానికి హద్దే ఉండదు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
వెబ్‌సైట్: www.uohyd.ac.in/
- సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ceeindia.org/
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు),
వెబ్‌సైట్: www.iimcal.ac.in/, www.iimahd.ernet.in/ , www.iimb.ernet.in/, www.iiml.ac.in/
- ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: www.imi.edu/
- ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ.
వెబ్‌సైట్: fms.edu/
- ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్-అహ్మదాబాద్.
వెబ్‌సైట్: www.mica.ac.in/
ఔత్సాహికులకు అవకాశాలెన్నో.. ‘‘ప్రతి ఒక్కరిలోనూ పర్యావరణంపై మక్కువ పెరిగింది. పలు విదేశీ యూనివర్సిటీలు ఎన్విరాన్‌మెంటల్‌కు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. యువత పర్యావరణ శాస్త్రాన్ని తమ కెరీర్‌గా ఎంచుకుంటోంది. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు దీనికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. కెరీర్ పరంగా గ్రీన్ ఎంటర్ ప్రెన్యూర్స్‌కు అధిక డిమాండ్ ఉంది. పరిశోధనల వైపు దృష్టి సారిస్తే కొత్త అంశాలు వెలుగుచూస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను అందించి సమాజానికి మేలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ఔత్సాహికులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి’’ ప్రొఫెసర్ షీలా ప్రసాద్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్,హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం |
Published date : 11 Sep 2014 05:44PM