నవ్య నైపుణ్యాలకు...పారిశ్రామిక శిక్షణ
Sakshi Education
కోర్సు ఏదైనా సరే.. తరగతి గది విజ్ఞానం.. ఆపై ప్రాక్టికల్ పరిజ్ఞానం ఉంటేనే సరైన కెరీర్ సొంతమవుతుంది. అందుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)..
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో ఆర్టికల్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. అదే విధంగా ప్రస్తుత పారిశ్రామిక రంగ అవసరాలకు సరిపోయే మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో పారిశ్రామిక శిక్షణను కూడా కోర్సులో భాగం చేసింది. క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే ఈ పారిశ్రామిక శిక్షణ విధివిధానాల వివరాలు...
ప్రస్తుతం విస్తృతమవుతున్న పారిశ్రామిక రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు వాటిపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో సీఏ కోర్సులో పారిశ్రామిక శిక్షణను చేర్చారు. భవిష్యత్తులో ఏదైనా సంస్థలో ఉద్యోగిగా స్థిరపడాలన్నా, సొంతంగా పరిశ్రమను స్థాపించాలన్నా ఈ పారిశ్రామిక శిక్షణ (Industrial Training) ఎంతగానో ఉపయోగపడుతుంది.
శిక్షణ ఎప్పుడు తీసుకోవాలి?
భవిష్యత్తులో సీఏలుగా వృత్తి జీవితంలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఐసీఏఐ.. పారిశ్రామిక శిక్షణను కోర్సులో చేర్చింది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థికి క్షేత్రస్థాయి పనివాతావరణంపై మంచి అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు.. ఇలా సుస్థిర కెరీర్‌ను సుసాధ్యం చేసే ఎన్నో నైపుణ్యాలు పెంపొందుతాయి. సంస్థలోని అకౌంట్స్ విభాగం కార్యకలాపాలపై పరిజ్ఞానం సొంతమవుతుంది. తమవద్ద పారిశ్రామిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి సంస్థలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నాయి.
- ఎంఎస్‌ఎస్ ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.

- సీఏ ఇంటర్‌లో ఏదో ఒక గ్రూపు లేదా రెండు గ్రూపులను పూర్తిచేసిన వారు ఓ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ప్రాక్టికల్ శిక్షణకు (ఆర్టికల్‌షిప్) పేరు నమోదు చేసుకొని, మూడేళ్ల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టికల్ శిక్షణ సమయంలోనే ఆసక్తిని బట్టి విద్యార్థి చివరి 12 నెలలు పారిశ్రామిక శిక్షణను ఎంపిక చేసుకోవచ్చు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ పారిశ్రామిక విధానమనే ఆప్షన్‌ను ఐసీఏఐ అందుబాటులో ఉంచింది.
- కనీసం రూ.కోటి స్థిరాస్తులున్న వాణిజ్య, వ్యాపార పరిశ్రమ(లేదా)రూ.10 కోట్లకు పైగా టర్నోవర్ గల సంస్థ (లేదా) రూ.50 లక్షలకు పైగా చెల్లింపు మూలధన వాటాలున్న సంస్థ (లేదా) కౌన్సిల్ ఆమోదించిన సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు.
- కాల పరిమితి: పారిశ్రామిక శిక్షణను 9 నెలలకు తగ్గకుండా 12 నెలలకు మించకుండా (సెలవులను కలుపుకొని) తీసుకోవాల్సి ఉంటుంది.
- ఆర్టికల్‌షిప్ సమయంలో విద్యార్థి పరిమిత అంశాలను నేర్చుకునే అవకాశముంది. అదే పారిశ్రామిక శిక్షణ ద్వారా విభిన్న అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. కార్పొరేట్ ఫైనాన్స్‌కి సంబంధించిన అంశాలపైనా పరిజ్ఞానం సంపాదించొచ్చు.
- పెద్ద సంస్థల్లో ఆర్టికల్‌షిప్ చేస్తున్న వారికి కూడా కొంత మొత్తమే చేతికందుతుంది. అదే పారిశ్రామిక శిక్షణను చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో తీసుకున్నా సంపాదన ఎక్కువగా ఉంటుంది. ఐసీఏఐ నిబంధనల ప్రకారం విద్యార్థులకు స్టైపెండ్ అందుతుంది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఈ మొత్తాన్ని చదువుకు ఉపయోగించుకోవచ్చు.
- సీఏ తర్వాత పెద్ద పరిశ్రమల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి పారిశ్రామిక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అభ్యర్థికున్న పారిశ్రామిక అవగాహన ఆధారంగా కొలువులు, వేతనాలు లభిస్తాయి.
- ఏదో ఒక అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలనుకున్న సీఏ విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఉపకరిస్తుంది.
- భవిష్యత్తులో సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకునే వారు పారిశ్రామిక శిక్షణ ద్వారా వ్యాపార వ్యవహారాల గురించిన ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవచ్చు.
- పారిశ్రామిక శిక్షణ వల్ల వివిధ అంశాలపై విద్యార్థికి లోతైన అవగాహన ఏర్పడుతుంది. ఇది సీఏ ఫైనల్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
- పారిశ్రామిక శిక్షణ సమయంలో విద్యార్థులు.. సీనియర్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను అధికారులు, లీగల్ అడ్వైజర్లు తదితరులను కలిసి, మాట్లాడాల్సి ఉంటుంది. దీనివల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అలవడతాయి.
- పారిశ్రామిక శిక్షణ వల్ల భవిష్యత్తు కెరీర్ పరంగా నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు, వాటిని చేరుకోవాల్సిన మార్గాలపై స్పష్టత ఏర్పడుతుంది.
- ఐసీఏఐ ఆమోదం తెలిపిన సంస్థల్లో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే సీఏ విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు అర్హులు.
- సీఏ ఇన్‌స్టిట్యూట్ పరిధిలో కనీసం మూడేళ్ల పాటు అసోసియేట్ మెంబర్(ఏసీఏ)గా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ఓ విద్యార్థికి పారిశ్రామిక శిక్షణ అందించొచ్చు.
- ఫెలోషిప్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఎఫ్‌సీఏ).. ఇద్దరు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇవ్వొచ్చు.
- పారిశ్రామిక శిక్షణ ప్రారంభ తేదీకి మూడు నెలల ముందే విద్యార్థి శిక్షణకు సంబంధించి ప్రధాన ఆడిటర్ (ఆర్టికల్‌షిప్ చేసేచోట) నుంచి అనుమతి తీసుకోవాలి.
- ట్రెయినీ గైడ్‌లో సూచించిన విధంగా శిక్షణ నివేదికతో పాటు ఫాం.నెం.109/114 (ఏది వీలైతే అది)ను ప్రధాన ఆడిటర్ నుంచి పొందాలి.
- కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి పారిశ్రామిక శిక్షణ తీసుకున్న వారికి ప్రాధాన్యమిస్తాయి.
- సంస్థలు తమవద్ద పారిశ్రామిక శిక్షణ తీసుకున్న విద్యార్థులకు కోర్సు పూర్తయిన అనంతరం ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చే అవకాశముంది.
- చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తయ్యాక స్టార్టప్ ద్వారా వ్యాపార/వాణిజ్య రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పారిశ్రామిక శిక్షణ ద్వారా సముపార్జించుకున్న నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
భవిష్యత్తులో సీఏలుగా వృత్తి జీవితంలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఐసీఏఐ.. పారిశ్రామిక శిక్షణను కోర్సులో చేర్చింది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థికి క్షేత్రస్థాయి పనివాతావరణంపై మంచి అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు.. ఇలా సుస్థిర కెరీర్‌ను సుసాధ్యం చేసే ఎన్నో నైపుణ్యాలు పెంపొందుతాయి. సంస్థలోని అకౌంట్స్ విభాగం కార్యకలాపాలపై పరిజ్ఞానం సొంతమవుతుంది. తమవద్ద పారిశ్రామిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి సంస్థలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నాయి.
- ఎంఎస్‌ఎస్ ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 03 Aug 2019 01:43PM