నేవీలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫీకేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Sakshi Education
త్రివిధ దళాల్లో ఒకటైన భారత నావికాదళంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా ముంబైలోని వెస్టర్న్ నావల్ కమాండ్ గ్రూప్–బి, నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్ సివిలియన్ పర్సనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 పోస్టులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
విద్యార్హతలు..
ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఓషనోగ్రఫీ సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే మెటీరియల్ అనాలసిస్/టెస్టింగ్ టెక్నిక్స్/మెషినరీ నాయిస్, వైబ్రేషన్ మూవ్‌మెంట్స్ అనాలసిస్, రిడక్సన్ టెక్నిక్స్/ కొర్రోజియన్ అనాలసిస్, మిటిగేషన్ టెక్నిక్స్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు..
గరిష్టంగా 30ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తుదారుల విద్యార్హతలు, అకడమిక్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం..
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొవిజనల్ అపాయింట్‌మెంట్ లెటర్ అందిస్తారు. ఆ తర్వాత వారిని డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. చదువు, చిరునామా, కులధ్రువీకరణ, ఇతర అవసరమైన సర్టిఫికేట్స్ అన్నింటిని పరిశీలించి.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా లేదా నేవీæ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏ4 సైజు పేపర్‌లో నిర్దేశిత ఫార్మట్ ప్రకారం వివరాలను రాయాలి(చక్కటి చేతి రాత లేదా టైప్ చేసి). అలాగే అవసరమైన పత్రాలను వాటితో జతచేసి.. పోస్టు ద్వారా కింద తెలిపిన చిరునామకు పంపాలి.
చిరునామ: ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్ నావెల్ కమాండ్, బళ్లార్డ్ ఎస్టేట్, టైగర్ గేట్ దగ్గర, ముంబయి–400001.

- అకడెమిక్ మెరిట్ ప్రతిపాదికన షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొవిజనల్ అపాయింట్‌మెంట్ లెటర్ అందిస్తారు. ఆ తర్వాత వారిని డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. చదువు, చిరునామా, కులధ్రువీకరణ, ఇతర అవసరమైన సర్టిఫికేట్స్ అన్నింటిని పరిశీలించి.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా లేదా నేవీæ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏ4 సైజు పేపర్‌లో నిర్దేశిత ఫార్మట్ ప్రకారం వివరాలను రాయాలి(చక్కటి చేతి రాత లేదా టైప్ చేసి). అలాగే అవసరమైన పత్రాలను వాటితో జతచేసి.. పోస్టు ద్వారా కింద తెలిపిన చిరునామకు పంపాలి.
చిరునామ: ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్ నావెల్ కమాండ్, బళ్లార్డ్ ఎస్టేట్, టైగర్ గేట్ దగ్గర, ముంబయి–400001.
- దరఖాస్తులకు చివరి తేది: 16.01.2021
- వెబ్‌సైట్: https://www.indiannavy.nic.in
Published date : 01 Jan 2021 02:53PM