Skip to main content

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఇగ్నో

నాణ్యమైన ఉన్నతవిద్య అందించి, విద్యార్థులను ఉద్యోగాలు, స్వయం ఉపాధి దిశగా నడిపించే లక్ష్యంతో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో).. వినూత్న కోర్సులను అందిస్తోంది.
1987లో కేవలం రెండు ప్రోగ్రామ్‌లు, 4528 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇగ్నో.. ప్రస్తుతం భారత్‌తో పాటు వివిధ దేశాల్లో 250 ప్రోగ్రామ్‌లు, మూడువేల కోర్సులను అందిస్తోంది. దాదాపు 3.5 మిలియన్ల విద్యార్థులను కలిగిన అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఇగ్నో గుర్తింపు సాధించింది.
  • వ్యవసాయ, అనుబంధ రంగాల్లో యువతకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇగ్నో ప్రత్యేకంగా డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది.
  • ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు, ఇప్పటికే అందులో కొనసాగుతున్న వారికి నైపుణ్యాలు అందించేందుకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, సర్టిఫికెట్ ఇన్ టీచింగ్ ఆఫ్ ప్రైమరీ మ్యాథమెటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • ఇటీవల ఇగ్నో కొత్తగా ప్రవేశపెట్టిన ఎంఏ సైకాలజీ ప్రోగ్రామ్‌కు చాలా డిమాండ్ ఉంది. క్లినికల్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, ఆర్గనైజేషనల్ బిహేవియర్ సైకాలజీ లాంటి ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత సాధించి ఐపీసీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు; ఐసీడబ్ల్యూఏ, సీఎస్ ఫౌండేషన్ కోర్సు చేస్తున్న విద్యార్థులకు ఒక సంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసుకునే సువర్ణావకాశం ఇగ్నో కల్పిస్తోంది. కేవలం ఫౌండేషన్ కోర్సులను పూర్తిచేయడం ద్వారా వారంతా ఏడాదిలోనే ఇగ్నో నుంచి బీకామ్ (ఏ అండ్ ఎఫ్); బీకామ్ (సీఏఏ), బికామ్ (ఎఫ్ అండ్ సీఏ) సర్టిఫికెట్లు పొందుతారు.
  • ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇగ్నో అందిస్తున్న ముఖ్యమైన కోర్సు.. బీఎస్సీ (నర్సింగ్). పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్ తదితర కోర్సులు కూడా ఆదరణ పొందుతున్నాయి.
  • ఇగ్నో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ ద్వారా ఫార్మసీ రంగంలో విద్యావకాశాలను సొంతం చేసుకోవచ్చు లేదా స్వయం ఉపాధి పొందొచ్చు.

మేనేజ్‌మెంట్ కోర్సులు..
ఓపెన్ మ్యాట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంబీఏలో చేరొచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు 50 శాతం మార్కులతో, రిజర్వేషన్ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

ఫీజు రాయితీ :
సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, బీఏ, బీకామ్, బీటీఎస్ లాంటి ప్రోగ్రామ్‌ల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇగ్నో ఫీజు రాయితీ అందిస్తోంది.

దరఖాస్తుకు చివరి తేదీ (బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ): జూలై 15, 2018

వెబ్‌సైట్లు: www.ignou.ac.in , https://rchyderabad.ignou.ac.in
Published date : 06 Jul 2018 12:38PM

Photo Stories