మీ ఇంట్లో ఒకే అమ్మాయి ఉందా.. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీకోసమే..
Sakshi Education
ప్రభుత్వాలు ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు రకరకాల స్కీములను అమలు చేస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)..
బాలికల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్(ఎస్‌జీసీ) పథకాన్ని అమలుచేస్తోంది. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఉపయోగపడేలా సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు...
స్కాలర్‌షిప్ మొత్తం..
ఈ స్కాలర్‌షిప్ కింద నెలకు రూ.500 అందిస్తారు. స్కాలర్‌షిప్ వ్యవధి రెండేళ్లు.
లక్ష్యం..
ప్రతిభ ఉండి, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. తద్వారా అమ్మాయిలను చదివిస్తున్న తల్లిదండ్రుల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌ల సంఖ్యకు ఎలాంటి పరిమితులు లేవు. నిర్దిష్ట అర్హతలు కలిగిన విద్యార్థినులందరికీ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.
అర్హతలు..

- సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణులైన, సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న సింగిల్ గర్ల్ చైల్డ్ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు.
- విద్యార్థినులు పదో తరగతి పరీక్షలో కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందుండాలి.
- ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500కు మించరాదు.
- విద్యార్థినులు 11వ తరగతి, 12వ తరగతి చదువులను కొనసాగించాల్సి ఉంటుంది.
- 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులనే స్కాలర్‌షిప్‌నకు పరిగణలోకి తీసుకుంటారు.
- స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు ఆయా స్కూల్‌లో మరికొన్ని రాయితీలు లభిస్తాయి.
- ట్యూషన్ ఫీజు రూ.6000కు మించని ఎన్‌ఆర్‌ఐలు సైతం స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు ఏడాదికోసారి (11వ తరగతి తర్వాత) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
- కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థినులకే స్కాలర్‌షిప్‌ను రెన్యువల్ చేస్తారు.
- మంచి ప్రవర్తనతోపాటు స్కూలు హాజరు బాగుండాలి.
- బోర్డు ముందస్తు అనుమతితో కోర్సు లేదా స్కూల్ మారే విద్యార్థినులకు స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.
- స్కాలర్‌షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు.
Published date : 24 Nov 2020 06:11PM