ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు...
Sakshi Education
ఖతార్.. చమురు నిక్షేపాల నిలయం. అత్యాధునిక సదుపాయాల నెలవు. ఇరుగుపొ రుగు దేశాలతో పోల్చితే వాతావరణం, ఉద్యోగ పరిస్థితులు మెరుగు. వేతనాలూ ఆకర్షణీయమే. అందుకే విదేశీ ఉద్యోగాల పరంగా భారతీయ యువతకు గల్ఫ్‌లో తొలి ప్రాధాన్యంగా నిలుస్తోంది. ఈ దేశంలో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) ఇప్పటివరకు కష్టంగానే ఉండేది. కానీ.. ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ విధానంతో పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం సులువు కానుంది. ఆ విధానం గురించి తెలుసుకుందాం..!
పెళ్లి చేసుకుంటే.. పర్మనెంట్ రెసిడెన్సీ :
ఖతార్ ప్రభుత్వ ప్రతిపాదిత నూతన ఇమ్మిగ్రేషన్ డ్రాఫ్ట్ బిల్లులో ప్రధానాంశం.. స్థానిక మహిళను వివాహం చేసుకున్న విదేశీ వ్యక్తులకు తక్షణమే పర్మనెంట్ రెసిడెన్సీ (శాశ్వత నివాస హోదా) కల్పించడం. ఈ వెసులుబాటు ఫలితంగా ఖతార్‌కు వచ్చే మ్యాన్ పవర్ పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా తమ దేశంలో ప్రస్తుతం నెలకొన్న నైపుణ్య కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆదేశ ప్రభుత్వ వర్గాల అంచనా.
అత్యున్నత నైపుణ్యాలుంటే...
అత్యున్నత నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఖతార్‌లో కాలు పెట్టిన వెంటనే పర్మనెంట్ రెసిడెన్సీ హోదా ఇచ్చేలా డ్రాఫ్ట్ బిల్లులో ప్రతిపాదన చేశారు. ఆయా విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసినవారికి.. పని అనుభవం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాజా డ్రాఫ్ట్ బిల్లు అంశాల ఆధారంగా పీఆర్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల అభ్యర్థిత్వాలను పరిశీలించడానికి ఖతార్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీని నియమించనుంది. ఈ కమిటీ దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా రూపొందించి వారికి పీఆర్ స్టేటస్‌తో కూడిన వీసా మంజూరు చేస్తుంది.
ప్రభుత్వ పథకాలకూ అర్హులు :
వివాహం, లేదా అత్యున్నత నైపుణ్యాల ద్వారా పర్మనెంట్ రెసిడెన్సీ పొందిన అభ్యర్థులు ఖతార్ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి సదుపాయాలు పొందొచ్చు. స్థిరాస్తులు సైతం కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగంతో పాటు ఆర్థిక స్థోమత ఉంటే స్థానికంగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి భాగస్వాములు కావొచ్చు.
ఫిఫా అసంతృప్తి.. పొరుగు ఆంక్షలే కారణమా?
విదేశీ ఉద్యోగులకు అనుమతుల్లో ఇంతకాలం ఖతార్ ఆంక్షలు అమలు చేసింది. అలాంటిది ఒక్కసారిగా నిబంధనలు సరళం చేయడానికి ప్రధాన కారణం ఫిఫా-2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుండటమే అనేది నిపుణుల అభిప్రాయం. ప్రపంచకప్ ఏర్పాట్లపై ఇటీవలే ఫిఫా కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ఇంకా పూర్తి కాలేదని వ్యాఖ్యానించింది. దీనికి నిపుణులైన ఉద్యోగుల కొరతే.. కారణమని ఖతార్ ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఫలితంగానే కొత్తగా పీఆర్ నిబంధనల్లో వెసులుబాట్లు చేపట్టింది. ఇటీవల సౌదీ అరేబియా సహా నాలుగు అరబ్ దేశాలు.. ఖతార్‌పై ఆంక్షలు విధించాయి. ఇది కూడా మరో ముఖ్య కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిమాండింగ్ జాబ్స్ :
ఖతార్‌లో పీఆర్ నిబంధనలు సరళీకృతమైన నేపథ్యంలో అక్కడ జాబ్ మార్కెట్ పరంగా డిమాండ్ ఉన్న రంగాలు..
అమెరికా, యూకే వంటి దేశాల్లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు రోజురోజుకీ కఠినం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ విధానాన్ని మన యువత అనుకూలంగా మలుచుకుంటే.. అయిదేళ్లపాటు భవిష్యత్తు పరంగా దిగులు లేకుండా సాగిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖతార్ ఫిఫా ఫుట్‌బాల్ పోటీల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాబట్టి ఇప్పుడు ఆ దేశంలో ఏదో ఒక ఉద్యోగంలో అడుగుపెడితే 2022 వరకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
6 లక్షల మంది మనోళ్లే...
వాస్తవానికి ఖతార్‌లో ఇప్పటికే భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం- 2016 చివరి నాటికి దాదాపు ఆరు లక్షల మంది పలు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది ఐటీఐ, డిప్లొమా అర్హతలతో సెమీ-స్కిల్డ్ హోదాల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఖతార్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం జాబ్ మార్కెట్‌లో హై-స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కొరత 40 శాతం మేర పైనే ఉంది.
తొంభై శాతం విదేశీయులే...
ఖతార్ జనాభా 24 లక్షలు. కేవలం భారత్ నుంచి వెళ్లినవారే కాక.. ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 90 శాతం మంది విదేశీయులుండటం గమనార్హం. వీరిలో ఆగ్నేయాసియా దేశాల నుంచి వెళ్లిన వలస కార్మికులే అధికం. నిర్మాణ రంగంలో అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నవారే ఎక్కువ. ప్రస్తుత హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అన్వేషణ మన దేశ యువతకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువత చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.
ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్:
ఖతార్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే ముందుగా అక్కడి అవకాశాలను అన్వేషించాలి. ఒక ఉద్యోగం లభించిన తర్వాత ఆ ఎంప్లాయర్ ద్వారా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు స్పాన్సర్‌షిప్ లెటర్ అందించాలి. దీని ఆధారంగా అభ్యర్థులకు వీసా మంజూరు చేస్తారు.
సగటు వేతనాలు...
ప్రస్తుతం ఖతార్‌లో డిమాండింగ్ జాబ్ సెక్టార్స్‌లో స్కిల్డ్ హోదాలో సగటు వేతనాలు..

- - హాస్పిటాలిటీ
- - కన్‌స్ట్రక్షన్
- - హెల్త్‌కేర్
- - ఎడ్యుకేషన్
- - ఇంజనీరింగ్
- - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- - పెట్రోలియం

విభాగం | వార్షిక వేతనం (ఖతారీ రియాల్స్‌లో) |
ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ | 37,240 |
బ్యాంకింగ్ | 38,230 |
ఐటీ | 44,339 |
ఇంజనీరింగ్ | 90 వేల నుంచి 1.5 లక్షలు |
కన్‌స్ట్రక్షన్ | ఒక లక్ష నుంచి 3 లక్షలు |
Published date : 19 Aug 2017 01:23PM