క్రియేటివిటీకి కేరాఫ్.. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్
Sakshi Education
టెక్నాలజీ యుగం.. పోటీ ప్రపంచం..ఒకే రంగంలో వందల సంస్థలు.. కంపెనీల మధ్య విపరీతమైన పోటీ! ఇలాంటి పరిస్థితుల్లో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏకైక మార్గం.. ఉత్పత్తులు, సేవల్లో ‘కొత్త’దనం చూపడం!! ‘కొత్త’గా ఉంటేనే వ్యాపారాల మనుగడ సాధ్యమని స్పష్టమైపోయింది! అందుకే కంపెనీలు నిరంతరం కొత్తదనం కోసం పరితపిస్తున్నాయి.
కొత్త ఉత్పత్తులు, కొత్త సేవలను సృష్టించే సామర్థ్యం కలిగిన సమర్థుల కోసంఅన్వేషిస్తున్నాయి. వీరినే చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అనిపిలుస్తున్నాయ్! స్టార్టప్ కంపెనీల నుంచి బహుళ జాతి సంస్థలవరకు.. కంపెనీలు ప్రస్తుతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మంత్రం జపిస్తున్నాయి!! ఈ నేపథ్యంలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ పోస్టు దక్కించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలేంటో తెలుసుకుందాం..
‘ఏదైనా కొత్తగా ఆలోచించండయ్యా..! క్రియేటివిటీ ఉండాలి.. మన కంపెనీ సరుకు మార్కెట్లో అడుగు పెట్టిందంటే.. జనాలు (వినియోగదారులు) బారులు తీరాలి’...
- ఇటీవల ఓ సినిమాలో ఒక సంస్థ చైర్మన్.. డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి !!
సరిగ్గా.. ఇదే.. ప్రస్తుతం వాస్తవ పరిస్థితుల్లోనూ అన్వయమవుతోంది. కంపెనీలు.. తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, విస్తరించుకోవడానికి, వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి! ఆ క్రమంలోనే తాజాగా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అనే ‘కొత్త’ హోదా పుట్టుకొచ్చింది. సేల్స్ నుంచి లాజిస్టిక్స్ వరకు.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ప్రమోషన్ దాకా.. అన్ని విభాగాల్లో కొత్తదనం నింపే సృజనాత్మక సత్తా ఉన్న వారికోసం కంపెనీల అన్వేషణ మొదలైంది. సృజనాత్మకత కలిగిన వారికోసం ప్రత్యేకంగా ‘చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్’ అనే కొత్త పోస్టును సృష్టిస్తున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అంటే ?
చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అంటే.. వినియోగదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త సేవలు, కొత్త ఉత్పత్తులు సృష్టించడంపై నిరంతరం దృష్టిపెట్టే అధికారి! సంస్థ వస్తు, సేవలు వినియోగదారుల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేయడమే ఇతని ప్రధాన విధి. దీనికోసం ప్రత్యేక కోర్సులు లేవు. పుస్తకాలు లేవు. కావాల్సిందల్లా.. సృజనాత్మకత. మార్కెట్ పరిస్థితులతోపాటు, వినియోగదారుల అభిరుచులను, అవసరాలను తెలుసుకొని.. అందుకు అనుగుణంగా ‘కొత్త’వి తయారుచేసి మార్కెట్‌లోకి తేవడమే ఈ ఆఫీసర్ ప్రధాన బాధ్యత. అంతేకాకుండా అతను కంపెనీ ఉద్యోగులు, ఉత్పత్తి ప్రక్రియలు, టెక్నాలజీలను నిరంతరం పరిశీలిస్తూ... తన సృజనాత్మకత ద్వారా ప్రతి విషయంలోనూ మెరుగుదల వచ్చేలా కొత్త కొత్త మార్గాలను కనిపెడతాడు.
ఎందుకీ.. ‘కొత్త’ జాబ్ ప్రొఫైల్ :
ప్రస్తుతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్స్ కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయనడానికి నిదర్శనం.. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ.. తొలిసారిగా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌ను నియమించుకుంది. అదే విధంగా మరో ఫుడ్ స్టార్టప్ సంస్థ కూడా ఈ హోదాలో నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇదే బాటలో ఇతర రంగాల్లోని సంస్థలు కూడా పయనిస్తూ.. ఇప్పటివరకు ఉన్నత స్థాయి హోదాల జాబితాలో లేని ‘చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్’ పోస్టును కొత్తగా తెరమీదకు తెస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కంపెనీలు.. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లను నియమించుకోవడానికి ప్రధాన కారణం.. పోటీ వాతావరణం. దాంతో పాటు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్స్‌ను నియమించుకుని వారి సేవలు వినియోగించుకోవడం ద్వారా.. తమ సంస్థల ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్ (కొత్త ఆవిష్కరణల) పరంగా చక్కటి సూచనలు, వ్యూహాలు రచించవచ్చనే అభిప్రాయం. అదే విధంగా పోటీ సంస్థలు, ప్రొడక్ట్‌ల మధ్య వ్యత్యాసం లేదా వైవిధ్యం చూపుతూ.. వ్యాపారాన్ని పరుగులు పెట్టించగలరని కంపెనీలు భావిస్తున్నాయి. మార్కెట్ లీడర్స్‌గా ఎదగడం, భవిష్యత్తు మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడం, అభివృద్ధి వ్యూహాలు రచించడంలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ల సృజనాత్మకత ఎంతో కీలకంగా మారుతుందని.. ఫలితంగా.. తమ సంస్థలు మార్కెట్‌లో ముందంజలో నిలుస్తాయనే అభిప్రాయం కంపెనీల్లో వ్యక్తమవుతోంది.
ఆ మూడు రంగాల్లో...
ప్రస్తుతం ఆధునిక పోటీ ప్రపంచంలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లకు ప్రధానంగా మూడు రంగాల్లో డిమాండ్ నెలకొంది. అవి.. ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్స్, బీఎఫ్‌ఎస్‌ఐ. కారణం.. ఇప్పుడు ఈ మూడు రంగాల్లోని సంస్థల కార్యకలాపాలు మెట్రో సిటీస్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించడం. అదే విధంగా వినియోగదారుల కోణంలో ఈ మూడు రంగాలకు డిమాండ్ నెలకొనడం. ముఖ్యంగా ఫిన్-టెక్ సంస్థల్లో కొత్త ఉత్పత్తుల రూపకల్పన కోసం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ల పాత్ర కీలకంగా మారుతోంది. ఆయా విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు.. కొత్త విధానాలు, వ్యూహాలపై శిక్షణ ఇవ్వడం ఫలితంగా వినియోగదారులకు సరైన సమయంలో సేవలు అందించడం వంటివి తప్పనిసరి.
కత్తి మీద సామే :
చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ల విధులు ‘కత్తి మీద సాము’ అనే నానుడిని తలపిస్తున్నాయి. ఈ హోదాలో నియమించుకుంటున్న సంస్థలు.. తమ సంస్థ మార్కెట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే విధంగా ఇన్నోవేషన్‌స చేయాలనే లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులే కాకుండా.. భవిష్యత్తు డిమాండ్, రాబోయే రోజుల్లో వినియోగదారుల అభిరుచుల్లో కలిగే మార్పులను అంచనా వేయడం వంటివి ఎంతో క్లిష్టమని కార్పొరేట్ వర్గాలు అభిప్రాయం. అందుకే చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా రాణించడం అంత తేలిక కాదనే వాదన వినిపిప్తోంది. ఈ ఆఫీసర్ విధులు కత్తి మీద సాము అనడానికి మరో నిదర్శనం.. కొత్త ప్రొడక్ట్ డిజైన్ నుంచి సపై ్ల చైన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, డెలివరీ ్ట్రాటజీస్ వరకు ప్రతి విభాగంలోనూ కొత్తగా ఆలోచించాల్సిన ఆవశ్యకత నెలకొనడమే.
అర్హతల మాటేంటి?
చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ పోస్టుకు సరిపడే వ్యక్తుల అన్వేషణ కోసం సంస్థలు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నాయి. తమ సంస్థల్లోనే క్రియేటివిటీ కలిగిన వారికి సైతం ఈ హోదా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఇదే సమయంలో బయటి వ్యక్తులను నియమించుకునేందుకు కూడా అన్వేషణ సాగిస్తున్నాయి. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సంస్థలో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌తో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంస్థలో ఎదురైన సమస్యలను తక్షణం పరిష్కరించగలిగే నైపుణ్యం, కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించగలిగే సృజనాత్మకత తప్పనిసరి. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సొంతం చేసుకునేందుకు.. ఇన్నోవేషన్ ఆఫీసర్లకు నిర్దిష్ట అకడమిక్ అర్హతల కంటే నైపుణ్యాలే ముఖ్యం. ఉదాహరణకు.. ఇటీవలే తొలిసారి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌ను నియమించుకున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ.. అకడమిక్‌గా టెక్నికల్ నేపథ్యం ఉన్న వ్యక్తిని రిక్రూట్ చేసుకుంది. మరో కంపెనీ నాన్-టెక్నికల్ నేపథ్యం ఉన్న వ్యక్తిని నియమించుకుంది. అంటే.. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అర్హతల కోణంలో అకడమిక్ నేపథ్యం కంటే వారిలోని సృజనాత్మకత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రధానం.
డిమాండింగ్ స్కిల్స్ శాతం:
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ నియామకం పరంగా ప్రధానంగా మారుతున్న విభాగాలు..
1. మార్కెటింగ్ విభాగం- 30 శాతం
2. మేనేజ్‌మెంట్ విభాగం - 10 శాతం
3. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - 60 శాతం

- వ్యాపార వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం - 5 %
- నిర్వహణ పరిజ్ఞానం - 10 %
- నాయకత్వ విలక్షణత- 10 %
- సృజనాత్మకత- 15 %
- సంస్థ/వ్యవస్థను అర్థం చేసుకోవడం - 15 %
- ఇతర వినియోగ దారులపై దృష్టి - 15 %
- వ్యాపార చతురత - 15 %
- వ్యూహాత్మక, నాయకత్వ సామర్థ్యాలు- 15 %
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ నియామకం పరంగా ప్రధానంగా మారుతున్న విభాగాలు..
1. మార్కెటింగ్ విభాగం- 30 శాతం
2. మేనేజ్‌మెంట్ విభాగం - 10 శాతం
3. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - 60 శాతం
Published date : 10 Jul 2018 12:15PM