Skip to main content

కొలువులిచ్చే.. కోర్సులివే..!

బీటెక్ పూర్తి కాగానే... కొలువులు అంత సులువేం కాదు అనే భావన!! ప్రస్తుతం బీటెక్ అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో ఏమంత ఆశాజనక పరిస్థితి లేదనే అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. ఇలాంటి సమయంలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట వరమని చెప్పొచ్చు.
వీటిని పూర్తి చేసుకున్న వారికి ప్రత్యేక నైపుణ్యాలు లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో బ్రాంచ్‌ల వారీగా ముఖ్యమైన జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల గురించి తెలుసుకుందాం...!

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, జాబ్ మార్కెట్‌లో నెలకొన్న పోటీ కారణంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే చాలాతక్కువ మందికి మాత్రమే కొలువులు దక్కుతున్నాయి. మిగతా వారు ఉద్యోగ ప్రయత్నాల్లో.. సఫలం కావాలంటే.. నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాల్సిందే! ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు చుక్కానిలా నిలుస్తున్నాయి.. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు. తక్కువ ఖర్చు, స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే వెసులుబాటు ఉండటం వీటి ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే.. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అభ్యర్థుల నుంచి కంపెనీలు, పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యాలతోపాటు వాస్తవ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. విద్యార్థుల అకడెమిక్ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతూ ప్రాక్టిల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నాయి.
  • కంప్యూటర్ సైన్స్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లతో బీటెక్ పూర్తి చేసిన వారికి పలు జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • వెబ్ డిజైనింగ్: సీఎస్‌ఈ విద్యార్థులకు అందుబాటులో ఉన్న జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో వెబ్ డిజైనింగ్ ముందు వరుసలో ఉంటుంది. వెబ్ డిజైన్ లేదా వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులు వెబ్‌సైట్ రూపకల్పన, నిర్వహణా నైపుణ్యాలను అందిస్తాయి. దీంతోపాటు ఇంటర్‌ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ గ్రాఫిక్ డిజైన్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ తదితర నైపుణ్యాలను పెంపొందిస్తాయి. మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి కొలువులు దక్కుతున్నాయి. వీరికి లభించే కొలువులు.. బ గ్రాఫిక్ డిజైనర్ బ గ్రాఫిక్ ఆర్టిస్ట్ బ క్రియేటివ్ డెరైక్టర్ బ డిజైన్ ఆర్కిటెక్ట్.
  • లాంగ్వేజెస్: సీ, సీ+, సీ++, జావా, నెట్, హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్ తదితర లాంగ్వేజ్‌లు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు కొలువులు అందించడంలో కీలకంగా మారాయి. వీటిని పూర్తి చేసిన వారికి డేటాటైప్స్ అండ్ ఆపరేటర్స్, ఆరేస్, హెచ్‌టీఎంఎల్5 సెమాంటిక్ టాగ్ తదితర నైపుణ్యాలు అలవడుతాయి. ఈ కోర్సులను పూర్తి చేస్తే రియల్ టైమ్ ప్రోగ్రామర్‌గా స్థిరడేందుకు అవకాశం ఉంటుంది.
  • డిజిటల్ మార్కెటింగ్: జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల్లో డిజిటల్ మార్కెటింగ్ ప్రముఖంగా నిలుస్తుంది. ఆధునిక మార్కెటింగ్ సాధనాల్లో డిజిటల్ చాన ళ్లు, సోషల్ మీడియా కీలకంగా మారాయి. అన్ని బిజినెస్ కార్యకలాపాల్లో డిజిటల్ ప్రచార సాధనాలు ప్రవేశించాయి. దాంతో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులకు డిమాండ్‌తోపాటు ప్రాధాన్యం పెరిగింది.

వీరికి లభించే ఉద్యోగాలు..
  • డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్
  • ఎస్‌ఈవో మేనేజర్
  • కంటెంట్ మేనేజర్
  • మొబైల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్
  • వెబ్ అనలిటిక్స్ ఎక్జిక్యూటివ్.

ఇతర ఉపయుక్త కోర్సులు:
  • కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్
  • యూఎక్స్ డిజైన్
  • రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్
  • శాప్ కోర్సులు
  • సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
  • ఓరాకిల్, ఎస్‌క్యూఎల్, డేటాబేస్ అడ్మిన్
  • నెట్‌వర్కింగ్ ప్రొఫెషనల్స్.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ :
  • సర్క్యూట్ అనాలసిస్: ఈ కోర్సులో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌కు సంబంధించిన ప్రాక్టికల్ అంశాలు, సాధనాల గురించి నేర్చుకుంటారు. సర్క్యూట్స్‌లోని నేచురల్ అండ్ ఫోర్స్‌డ్ రెస్పాన్స్, కాంప్లెక్స్ సర్క్యూట్స్‌కు సంబంధించిన టెక్నిక్స్‌పై పట్టుసాధిస్తారు.
  • ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్: ఈ కోర్సులో ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, రెగ్యులేటర్లు, కెపాసిటర్లు, లోడు, డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్, స్టోరేజ్ తదితరాల గురించి నేర్చుకుంటారు. దీంతోపాటు లోడ్ ఫ్లో, షార్ట్ సర్క్యూట్ తదితర పద్ధతులపైనా అవగాహన లభిస్తుంది.

ఇతర కోర్సులు:
  • పవర్ సిస్టమ్ అనాలసిస్
  • లీనియర్ సిస్టమ్ అనాలసిస్
  • అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సిస్టమ్ ఇంజనీరింగ్
  • ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్
  • ఎలక్ట్రికల్ సిస్టమ్.

మెకానికల్ ఇంజనీరింగ్ :
పైపింగ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్:
ఇది మెకానికల్ విద్యార్థులను ఇండస్ట్రీకి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది. పైపింగ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి కెమికల్ ఇండస్ట్రీ, మర్చంట్ నేవీ, పెట్రోలియం రిఫైనరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తదితరాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
టూల్ డిజైన్: దీన్ని పూర్తి చేసిన వారికి కట్టింగ్ టూల్స్, ప్రెస్ టూల్స్, డై క్యాస్టింగ్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్, ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్‌లు, మెజర్‌మెంట్స్, అడ్వాన్స్‌డ్ ప్లాస్టిక్ ప్రాసెస్ టెక్నాలజీలకు సంబంధించిన నైపుణ్యాలు అలవడుతాయి.
ఇతర కోర్సులు: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపయోగపడే ఇతర కోర్సులు... మెకట్రానిక్స్, రోబోటిక్స్.

సివిల్ ఇంజనీరింగ్ :
  • కన్‌స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్: కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజనీరింగ్ రెండూ వేర్వేరు సబ్జెక్టులు. ఈ కోర్సు రెండింటి కలబోతగా ఉంటుంది. ఇందులో అభ్యర్థులు మేనేజ్‌మెంట్ అంశాలతోపాటు నిర్మాణానికి సంబంధించిన తాజా సాంకేతికతల గురించి కూడా తెలుసుకుంటారు. కోర్సు పూర్తి చేసిన వారికి కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • స్ట్రక్చరల్ డిజైన్: ఆకృతులకు సంబంధించి సాంకేతిక ప్రమాణాలు చాలా ముఖ్యం. ఈ కోర్సులో అభ్యర్థులు భవన, స్టీలు, కాంక్రీట్, ఫౌండేషన్ ఆకృతుల గురించి నేర్చుకుంటారు. దీన్ని పూర్తి చేసిన వారికి అత్యున్నత ప్రమాణాలతో కాంక్రీట్ నిర్మాణాల డిజైన్, కన్‌స్ట్రక్షన్ చేసే సామర్థ్యాలు అలవడుతాయి.

ఇతర కోర్సులు:
  • ప్రాజెక్టు మేనేజ్‌మెంట్
  • బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్
  • ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  • ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్
  • ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ :
  • ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాల పరంగా పలు షార్ట్ టెర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అభ్యర్థులు స్వీయ ఆసక్తి, ఇష్టాలను అనుసరించి వీటిని ఎంచుకోవడవం లాభిస్తుంది.
  • ఎంబెడెడ్ సిస్టమ్స్: ఈ కోర్సు కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల కలయికగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఐఓటీ చుట్టూ తిరుగుతోంది. సిస్టమ్‌లు లేదా ప్రొడక్టులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఎంబెడెడ్ సిస్టమ్స్ దోహదపడుతున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి.
  • రోబోటిక్స్: ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు కెరీర్ పరంగా రోబోటిక్స్ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పూర్తి చేసిన వారికి అంతరిక్ష పరిశోధనా సంస్థలు, విభాగాలు, మైక్రోచిప్ తయారీ సంస్థలు, మెడికల్, ఆటోమోటివ్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
  • సీఏడీడీ: కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్(సీఏడీడీ) కోర్సు చేసిన వారికి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు సంబంధించిన డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు అలవడుతాయి. కోర్సులో భాగంగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆకృతుల రూపకల్పన చేయడం, డేటా నిర్వహణ, వ్యూహాల విశ్లేషణ తదితర నైపుణ్యాలను నేర్చుకుంటారు.

ఇతర ఉపయుక్త కోర్సులు:
  • వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్(వీఎల్‌ఎస్‌ఐ)
  • పీసీబీ అండ్ సర్క్యూట్ డిజైనింగ్
  • ఇండస్ట్రియల్ ఆటోమేషన్.

వాస్తవాలను గుర్తించండి :
ప్రస్తుతం ప్రపంచంలోని ఇంజనీరింగ్ సంబంధిత కంపెనీల్లో నియామకాలు మందగించాయి. మరోవైపు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు నైపుణ్యాల ఊసే ఎత్తకుండా విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. దాంతో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు తప్పనిసరిగా మారాయి. బీటెక్ అభ్యర్థులు ముందు నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. కోర్సు పూర్తయిన వెంటనే ఎంఎన్‌సీ కంపెనీల్లో రూ.30 లేదా రూ. 40 వేల వేతనం లభిస్తుందనే ఆశలను పక్కనపెట్ట్టి... చిన్న, మధ్య తరహా కంపెనీలల్లో రూ.15 వేల జీతానికైనా చేరాలి. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఓపిగ్గా పనిచేస్తే ఇంజనీరింగ్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతమవుతుంది.
- రాజ ప్రశాంత్, పెర్‌టెక్నికా.
Published date : 28 Dec 2019 04:50PM

Photo Stories