Skip to main content

క్లిక్ దూరంలో... కొలువులు

ఎడ్యుకేషన్, జాబ్ మార్కెట్‌లు వేగంగా డిజిటలైజేషన్ సంతరించుకొంటున్నాయి. ఫలితంగావిద్యా, ఉపాధి అవకాశాల్లో ‘ఇంటర్నెట్ బ్రౌజింగ్’, ‘సోషల్ మీడియా’ల పాత్ర కీలకంగా మారుతోంది. టెక్నో గ్రాడ్యుయేట్‌లకు లభించే సైబర్ సిటీ కొలువుల నుంచి సంప్రదాయ డిగ్రీ హోల్డర్లకు లభించే అవకాశాల వరకు! ఉపాధి అవకాశాల కోసం..ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ తిరగేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా జస్ట్ ఒక్క క్లిక్‌తో మొబైల్ ఫోన్‌లో సమస్త సమాచారం మన కళ్ల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో కొలువుల వేటలో విప్లవాత్మక మార్పులకు వేదికగా మారుతున్న సోషల్ మీడియాపై ప్రత్యేక కథనం...
  • సోషల్ మీడియా అవకాశాల పరంగానే కాదు... అకడమిక్‌గానూ విస్మరించలేని పాత్ర పోషిస్తోంది.
  • ఒకప్పుడు నెట్ సెర్చింగ్ కోసం ఇంటర్‌నెట్ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి... డిజిటల్ విప్లవంలో భాగంగా అందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి.
  • కంపెనీల రిక్రూటింగ్ విధి విధానాలతో పాటు.. అభ్యర్థి తన అర్హతకు తగ్గ కొలువుల వివరాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
  • చాలా కంపెనీలు తమ సేవలు, ప్రొడక్ట్స్ ప్రచారానికే కాకుండా రిక్రూటింగ్‌కు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయి.
  • అకడమిక్ నైపుణ్యాలు, కెరీర్ అవకాశాల పరంగా యువతకు ఎంతో ఉపయోగపడుతున్న వివిధ సోషల్ మీడియా సాధనాలు...
ఫేస్‌బుక్
  • ‘ఫేస్‌బుక్’.. ఫ్రెండ్స్, సర్కిల్‌లో ఉండే వ్యక్తులతో మాట్లాడటానికి ఉపయోగపడే సామాజిక మాధ్యమంగానే చాలా మందికి తెలుసు.
  • సరైన విధానంలో ఫేస్‌బుక్‌ని వినియోగించుకుంటే కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ఫేస్‌బుక్‌లో జాబ్ అలెర్ట్స్, ప్రొఫెషనల్ గ్రూప్స్‌తో నెట్‌వర్క్ ఏర్పరచుకుంటే విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుస్తుంది.
  • గ్రూప్స్‌లో ఉన్న ప్రొఫెషనల్స్ పోస్టింగ్స్‌ను నిరంతరం ఫాలో అవుతూ.. సంబంధిత రంగంలోని మార్పులపై సదరు ప్రొఫెషనల్స్ పోస్టింగ్‌ల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
  • ఇప్పుడు కంపెనీలు పెద్ద స్థాయిలో ఫేస్‌బుక్‌ను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి.
లింక్డ్ ఇన్
  • లింక్డ్ ఇన్ వెబ్‌సైట్ అంతర్జాతీయంగా ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ఎక్కువగా ఉన్న సోషల్ మీడియా.
  • లింక్డ్ ఇన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం ద్వారా అప్పటికే లింక్డ్ ఇన్‌లో ఉన్న ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, అకడమిక్ ఎక్స్‌పర్ట్స్‌తో నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోవచ్చు.
  • ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలోనే రెజ్యుమేను కూడా అప్‌లోడ్ చేసుకోవాలి. తద్వారా రెజ్యుమేలో పేర్కొన్న కీ స్కిల్స్ ఆధారంగా సంబంధిత రంగంలోని ఉద్యోగాల సమాచారం నిరంతరం తెలుసుకోవచ్చు.
  • ఆయా రంగాల్లోని ప్రొఫెషనల్స్ ప్రొఫైల్స్‌ను వీక్షించడం, రిక్వెస్ట్ ఇన్విటేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా సంబంధిత ప్రొఫెషనల్స్ కూడా అభ్యర్థుల ప్రొఫైల్‌ను చూసే అవకాశం ఉంటుంది.
  • అకడమిక్ పరంగానూ లింక్డ్ ఇన్ వెబ్‌సైట్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దీని ద్వారా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు అప్‌లోడ్ చేసే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
  • బిజినెస్ సంబంధిత రంగ అవకాశాలను అందించడంలో ఇతర సామాజిక మాధ్యమాల కంటే లింక్డ్ ఇన్ మొదటి స్థానంలో ఉంటుంది.
  • లింక్డ్ ఇన్‌లో ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా యూజ్‌ఫుల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చు.
గూగుల్ గ్రూప్స్-జాబ్ సెర్చ్ ఇంజన్స్
  • ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్స్‌లో గూగుల్ టాప్ పొజిషన్‌లో ఉంది. దీన్ని కూడా సోషల్ మీడియా సాధనంగా వినియోగించుకోవచ్చు.
  • దీని కోసం గూగుల్ గ్రూప్స్ పేరుతో ప్రచారంలో ఉన్న సోషల్ మీడియా నెట్‌వర్క్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ‘గూగుల్ గ్రూప్స్’ నెట్‌వర్క్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కీ వర్డ్ ఆప్షన్ మేరకు.. ఆన్‌లైన్ ప్రొఫెషనల్ ఫోరమ్స్‌ను సంప్రదించవచ్చు.
  • దీంతో పాటు ఈ- మెయిల్ ఆధారిత సమాచారం తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. అంతేకాకుండా రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్స్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.
  • జాబ్ సెర్చ్ ఇంజన్స్ సోషల్ మీడియా సాధనంగానూ ఉపయోగపడుతున్నాయి. జాబ్ సెర్చ్ ఇంజన్స్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, రెజ్యుమేను అప్‌లోడ్ చేసుకుంటే అభ్యర్థులు అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలను తెలుసుకోవచ్చు.
బ్లాగ్స్
  • బ్లాగ్స్‌ను సోషల్ మీడియాలోప్రధాన సాధనాలుగా పేర్కొంటున్నారు.
  • వివిధ రంగాల్లోని నిపుణులు ఆయా అంశాలకు చెందిన సమాచారాన్ని బ్లాగ్స్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.
  • బ్లాగ్స్‌లో రైటింగ్ అలవాటుతో అభ్యర్థులు తమలోని రైటింగ్ స్కిల్స్, సంబంధిత రంగంలో తమకు ఉండే పరిజ్ఞానం, ఆసక్తులను ఇతరులకు సులభంగా తెలియజేయవచ్చు.
  • ముఖ్యంగా అకడమిక్ పరంగా సీనియర్ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ బ్లాగ్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయి. వీటి ద్వారా అకడమిక్ నైపుణ్యాలు అలవర్చుకొనే అవకాశం కలుగుతుంది.
  • ఇండస్ట్రీ నిపుణులు కూడా సొంత బ్లాగ్స్ ద్వారా విలువైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నికల్ ఇలా అన్ని విభాగాలకు చెందిన ఇండస్ట్రీ నిపుణుల బ్లాగ్స్ అందుబాటులో ఉన్నాయి.
  • వీరంతా బ్లాగ్స్ ద్వారా ఆయా రంగాల్లో వచ్చే తాజా మార్పులు, ఇంటర్వ్యూల్లో అనుసరించాల్సిన విధానాలు, రెజ్యుమే టిప్స్ వంటివి అందిస్తున్నారు.
మీడియా వెబ్‌సైట్లు- ఈ ట్యూషన్స్
  • మీడియా వెబ్‌సైట్లు ఆన్‌లైన్ ఎడిషన్స్ ఆయా రంగాల్లోని కెరీర్ అవకాశాలను అందిస్తున్నాయి. దీంతో అకడమిక్- ఇండస్ట్రీ నిపుణుల సలహాలు, అకడమిక్ గెడైన్స్ వంటి అంశాలను కూడా అభ్యర్థులకు చేరవేస్తున్నాయి.
  • ఇంటర్నెట్ ఆధారంగా కిండర్ గార్టెన్ స్థాయి నుంచే విద్యార్థులకు అకడమిక్ సమాచారం అందిస్తున్నారు. ప్రముఖ ఎడ్యుకేషన్ పోర్టల్స్ ఈ-ట్యూషన్స్, ఈ-ట్యుటోరియల్స్ పేరుతో ఐజీసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ బోర్డుల తరగతులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తున్నాయి.
  • వివిధ వెబ్‌సైట్లు సీబీఎస్‌ఈ, ఐజీసీఎస్‌ఈల్లో అమలవుతున్న యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ టూల్స్‌ను కూడా అందిస్తున్నాయి.
పోటీ పరీక్షలు-ఆన్‌లైన్ కోర్సులు
  • ఉద్యోగాన్వేషణలో పోటీ పరీక్షలు ఎంతో కీలకమైనవి. వీటికి సంబంధించిన గెడైన్స్, విజయంలో కీలకంగా వ్యవహరించే ప్రీవియస్ పేపర్ల పరిశీలన, మాక్ టెస్ట్‌లు వంటి ఎన్నో అవకాశాలు ఆన్‌లైన్ టూల్స్ ద్వారా లభిస్తున్నాయి.
  • దీంతో అభ్యర్థులు కొత్త సమాచారం తెలుసుకోవడమే కాకుండా తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టే అవకాశం లభిస్తోంది.
  • ఆధునిక యుగంలో మోడ్రన్ లెర్నింగ్ విధానంగా అవతరిస్తున్న ట్రెండ్ మూక్స్. దీని ద్వారా ప్రపంచంలోఎక్కడ ఉన్న ప్రొఫెసర్ పాఠాలైనా వినే అవకాశం, వర్చ్యువల్ ల్యాబ్స్ సదుపాయం పొందవచ్చు.
ప్రయోజనకరంగా సోషల్ మీడియా ఎలా!
  • - కొలువుల అన్వేషణలో ఉన్న అభ్యర్థులు జాబ్ సెర్చ్‌కు సంబంధించి కీ వర్డ్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
  • డొమైన్ ఏరియాకు సంబంధించిన కీ వర్డ్స్‌ను మాత్రమే పేర్కొనాలి. అప్పుడే కచ్చితమైన ఉద్యోగావకాశాల జాబితా సులువుగా తెలుసుకోవచ్చు.
  • బ్లాగ్స్‌ను ఫాలో అయ్యే అభ్యర్థులు.. సంబంధిత బ్లాగ్స్ ఉన్న ప్రామాణికతను తెలుసుకోవాలి. ఆయా బ్లాగ్‌లలో అప్‌లోడ్ చేసిన పోస్ట్‌లు/ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి.
  • గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా సమాచారం పొందాలనుకుంటే కీ వర్డ్స్ తెలియకపోయినా నిర్ణీత ఫ్రేజ్‌తోపాటు +, and, or ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తే సమాచారం అందించే వెబ్‌సైట్లను తెలుసుకోవచ్చు.
నైపుణ్యాలు పొందొచ్చు
సోషల్ మీడియా అంటే ఫ్రెండ్స్‌తో చాటింగ్, షేరింగ్, లైక్స్, మాత్రమే అనే ఆలోచన మార్చుకోవాలి. సోషల్ మీడియా ద్వారా నైపుణ్యాలను పెంచుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని గుర్తించాలి. డొమైన్ ఏరియాలకు సంబంధించి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌పై ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో లభిస్తోంది. దీని కోసం వెబ్‌సైట్లలో అవసరమైన విభాగంలో ‘క్రియేట్ అలర్ట్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఫలితంగా ఆ రంగంలోని తాజా సమాచారం ఎప్పటికప్పుడు అభ్యర్థుల లాగిన్ ఐడీకి పాస్ అవుతుంది. సోషల్ మీడియాను ప్రధానంగా సమకాలీన సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడే సాధనంగా వినియోగించుకోవాలి.
- కృష్ణ ప్రసాద్, హెడ్, సోషల్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

కెరీర్ అవకాశాల దిశగా...
సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఉన్నత కెరీర్ అవకాశాలకు మార్గాలుగా మారుతున్నాయి. ఉద్యోగాల అన్వేషణలో ఉన్న అభ్యర్థులు జాబ్ సెర్చ్ పోర్టల్స్‌పై ఆధారపడుతుంటారు. లింక్డ్ ఇన్, గూగుల్ గ్రూప్స్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ప్రొఫైల్ అప్‌లోడ్ చేయాలి. తద్వారా సంబంధిత రెజ్యుమేను అప్పటికే ఆ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కొంత మంది హెచ్.ఆర్.హెడ్స్ తమ కంపెనీల్లోని ఉద్యోగ సమాచారాన్ని కూడా పర్సనల్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు ప్రొఫెషనల్స్‌కి ఇంటరాక్ట్ ఇన్విటేషన్ రిక్వెస్ట్ పంపాలి. సోషల్ మీడియా వెబ్‌సైట్లలోని సెర్చ్ ఆప్షన్స్ ద్వారా ప్రొఫెషనల్స్ వివరాలు తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాను ఈ విధమైన కోణంలో ఉపయోగించుకుంటే మంచి అవకాశాలు అందుకోవచ్చు.
- కె.ఇమాన్యుయేల్, సోషల్ నెట్‌వర్క్ లీడ్, జీవా ఇన్ఫోటెక్
Published date : 23 Oct 2015 05:45PM

Photo Stories