కెరీర్‌కు టర్నింగ్...ఇంటర్న్‌షిప్!
Sakshi Education
ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో కంపెనీలు కేవలం పట్టాలు, గ్రేడ్‌లు చూసి జాబ్ ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగి కొలువులో చేరిన మొదటి రోజు నుంచే పనిచేయాలని భావిస్తున్నాయి.
తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకునేటప్పుడు వాస్తవ పని వాతావరణంపై అవగాహన ఉన్నవాళ్లనే ఎంపిక చేసుకుంటున్నాయి. అందుకే ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా మారుతోంది. విద్యార్థులు కోర్సు చదువుతున్నప్పుడే కంపెనీల్లో వాస్తవ పని పరిస్థితిపై అవగాహన కల్పించే సాధనం.. ఇంటర్న్‌షిప్! ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇంటర్న్‌షిప్‌తో ప్రయోజనాలు.. వాటిని అందుకోవడానికి మార్గాల గురించి తెలుసుకుందాం..
ఇంటర్న్‌షిప్‌తో ప్రయోజనాలు..
ఎప్పడు చేయాలి ?
టైర్-2 ఇన్‌స్టిట్యూట్‌లలోనే సమస్య :
ఇంటర్న్‌షిప్ అవకాశాల పరంగా టైర్-2 ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న కాలేజీల్లో చదివే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ తక్కువగా ఉండటంవల్ల తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ అందించడంలో వెనుకంజలో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దాంతో రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు మెరుగవనున్నాయి.
సంస్థల వెబ్‌సైట్స్ :
విద్యార్థులు ఆయా సంస్థల వెబ్‌సైట్స్ ద్వారా ఇంటర్న్‌షిప్స్ కోసం స్వీయ అన్వేషణ కొనసాగించొచ్చు. ఇటీవల కాలంలో కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో కెరీర్స్/కరెంట్ ఆపర్చునిటీస్ ఆప్షన్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి పేర్కొంటున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకొని ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే.. ఇంటర్న్ ట్రైనీగా అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఈ ఎంపిక ప్రక్రియలో సంస్థలు అభ్యర్థుల అకడమిక్ నైపుణ్యాలతోపాటు ప్రాక్టికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరిశీలించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వీటిలో రాణించేలా విద్యార్థులు సన్నద్ధం కావాలి.
జాబ్ సెర్చ్ పోర్టల్స్ :
రెండు, మూడేళ్ల క్రితం వరకు ఉద్యోగావకాశాల పరంగా కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానంగా ఉన్న జాబ్ సెర్చ్ పోర్టల్స్.. ఇప్పుడు వాటి క్లయింట్ సంస్థల్లోని ఇంటర్న్‌షిప్ అవకాశాల సమాచారాన్ని సైతం పొందుపరుస్తున్నాయి. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరోవైపు ఔత్సాహిక విద్యార్థులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణుల ద్వారా ఇంటర్న్ ట్రైనీ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
స్వీయ అన్వేషణే మార్గం..
ఇన్‌స్టిట్యూట్ నుంచి సహకారం లభించని పరిస్థితుల్లో విద్యార్థులే ఇంటర్న్‌షిప్ దిశగా స్వీయ అన్వేషణ సాగించాలి. ఇందుకోసం ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించే విషయంలో కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానంగా నిలుస్తున్న ఇంటర్న్‌శాల సంస్థతో ఏఐసీటీఈ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం విద్యార్థులు ఇంటర్న్‌శాల వెబ్‌సైట్‌లో తమ అకడమిక్ వివరాలు, డొమైన్ ఏరియాస్‌ను పేర్కొంటే.. అందుకు సంబంధించి అవకాశాలు కల్పించే సంస్థల వివరాలు లభ్యమవుతాయి.
ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. ఏఐసీటీఈ
విద్యార్థులు ఇకపై కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఏఐసీటీఈ.. ఇంజనీరింగ్, ఎంబీఏ, అదే విధంగా రెండేళ్ల వ్యవధిలో ఉండే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరిచేస్తూ మోడల్ కరిక్యులంను రూపొందించింది. సదరు ఇంటర్న్‌షిప్స్‌కు క్రెడిట్స్‌ను సైతం ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది.
విద్యార్థుల కోసమే..
ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయడం అనేది విద్యార్థుల ప్రయోజనం కోసమే. వీటికి క్రెడిట్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులు కచ్చితంగా ఇంటర్న్‌షిప్ వైపు దృష్టిపెడతారు. ఇన్‌స్టిట్యూట్‌లు కూడా విద్యార్థులకు సహకరించేలా ఏఐసీటీఈ మార్గదర్శకాలు రూపొందించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్తులో కెరీర్ అవకాశాల విషయంలో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్.ఎన్.రమేశ్ బాబు, చైర్ ప్రొఫెసర్, ఐఐటీ-చెన్నై, అకడమిక్ అండ్ ఇండస్ట్రీ టీమ్ మెంబర్, ఏఐసీటీఈ మోడల్ కరిక్యులం
ఇంటర్న్‌షిప్‌తో ప్రయోజనాలు..
- ఆయా కోర్సుల విద్యార్థులు అప్పటివరకు తాము తరగతి గదిలో థియరిటికల్‌గా నేర్చుకున్న సబ్జెక్ట్ అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం లభిస్తుంది.
- ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, లేటెస్ట్ నైపుణ్యాలు అలవడతాయి.
- ఇంటర్న్ ట్రైనీగా ఒక కంపెనీలో కొద్దిరోజులు పనిచేయడం వల్ల సరికొత్త నైపుణ్యాలు, రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ లభిస్తుంది.
- ఇంటర్న్‌షిప్‌తో ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, టీం వర్కింగ్ కల్చర్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగవుతాయి.
- ఒక సమస్యకు తమ స్థాయిలోనే పరిష్కారం కనుగొనే విధంగా అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు.
- ఇంటర్న్ ట్రైనీగా పనిచేస్తున్న సమయంలో తమకు కేటాయించిన విధుల నిర్వహణ పరంగా సందేహాలు తలెత్తితే... పరిష్కారం కోసం టీమ్ లీడర్స్‌తో చర్చించే వీలుంటుంది.
- ఇంటర్న్‌షిప్ సమయంలో కేవలం సంస్థ విధులకే పరిమితం కాకుండా.. సదరు రంగంలోని తాజా పరిణామాల గురించి సీనియర్స్‌తో చర్చించే అవకాశం ఉంటుంది.
- ఇంటర్న్‌షిప్ సమయంలో మంచి పనితీరు కనబరచిన అభ్యర్థులకు శాశ్వత కొలువును ఆఫర్ చేసేందుకు కూడా సంస్థలు వెనుకాడటం లేదు.
ఎప్పడు చేయాలి ?
- వాస్తవానికి ఆయా కోర్సుల చివరి సంవత్సరంలో అడుగుపెట్టనున్న విద్యార్థులు.. దానికి ముందు తమకు లభించే వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌లో చేరడం మంచిదని నిపుణుల సలహా. కాబట్టి విద్యార్థులు వేసవి సెలవుల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు నుంచే ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి అన్వేషణ సాగించాలి.
- ఇంజనీరింగ్(బీటెక్)నే పరిగణనలోకి తీసుకుంటే.. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ఉన్నప్పుడే ఈ దిశగా అడుగులు వేస్తే.. ఏదో ఒక సంస్థలో అవకాశం లభిస్తుంది. మూడో సంవత్సరం పరీక్షలు ముగిసిన వెంటనే ఇంటర్న్ ట్రైనీగా సదరు సంస్థలో అడుగుపెట్టొచ్చు.
- దేశంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన ఐఐటీలు, ఐఐఎంల్లో.. ఆయా విద్యాసంస్థల్లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసేందుకు ఎస్‌పీఓ(సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్), పీపీఓ(ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్) పేరుతో డిసెంబర్, జనవరి నెలల్లో స్పెషల్ డ్రైవ్స్ జరుగుతాయి. ఎంపికైన వారికి ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం కల్పించడంతోపాటు స్టయిఫండ్ కూడా అందిస్తారు.
టైర్-2 ఇన్‌స్టిట్యూట్‌లలోనే సమస్య :
ఇంటర్న్‌షిప్ అవకాశాల పరంగా టైర్-2 ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న కాలేజీల్లో చదివే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ తక్కువగా ఉండటంవల్ల తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ అందించడంలో వెనుకంజలో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దాంతో రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు మెరుగవనున్నాయి.
సంస్థల వెబ్‌సైట్స్ :
విద్యార్థులు ఆయా సంస్థల వెబ్‌సైట్స్ ద్వారా ఇంటర్న్‌షిప్స్ కోసం స్వీయ అన్వేషణ కొనసాగించొచ్చు. ఇటీవల కాలంలో కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో కెరీర్స్/కరెంట్ ఆపర్చునిటీస్ ఆప్షన్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి పేర్కొంటున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకొని ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే.. ఇంటర్న్ ట్రైనీగా అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఈ ఎంపిక ప్రక్రియలో సంస్థలు అభ్యర్థుల అకడమిక్ నైపుణ్యాలతోపాటు ప్రాక్టికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరిశీలించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వీటిలో రాణించేలా విద్యార్థులు సన్నద్ధం కావాలి.
జాబ్ సెర్చ్ పోర్టల్స్ :
రెండు, మూడేళ్ల క్రితం వరకు ఉద్యోగావకాశాల పరంగా కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానంగా ఉన్న జాబ్ సెర్చ్ పోర్టల్స్.. ఇప్పుడు వాటి క్లయింట్ సంస్థల్లోని ఇంటర్న్‌షిప్ అవకాశాల సమాచారాన్ని సైతం పొందుపరుస్తున్నాయి. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరోవైపు ఔత్సాహిక విద్యార్థులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణుల ద్వారా ఇంటర్న్ ట్రైనీ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
స్వీయ అన్వేషణే మార్గం..
ఇన్‌స్టిట్యూట్ నుంచి సహకారం లభించని పరిస్థితుల్లో విద్యార్థులే ఇంటర్న్‌షిప్ దిశగా స్వీయ అన్వేషణ సాగించాలి. ఇందుకోసం ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించే విషయంలో కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానంగా నిలుస్తున్న ఇంటర్న్‌శాల సంస్థతో ఏఐసీటీఈ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం విద్యార్థులు ఇంటర్న్‌శాల వెబ్‌సైట్‌లో తమ అకడమిక్ వివరాలు, డొమైన్ ఏరియాస్‌ను పేర్కొంటే.. అందుకు సంబంధించి అవకాశాలు కల్పించే సంస్థల వివరాలు లభ్యమవుతాయి.
ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. ఏఐసీటీఈ
విద్యార్థులు ఇకపై కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఏఐసీటీఈ.. ఇంజనీరింగ్, ఎంబీఏ, అదే విధంగా రెండేళ్ల వ్యవధిలో ఉండే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరిచేస్తూ మోడల్ కరిక్యులంను రూపొందించింది. సదరు ఇంటర్న్‌షిప్స్‌కు క్రెడిట్స్‌ను సైతం ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది.
- బీటెక్ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేలోపు తప్పనిసరిగా ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. మొత్తం 160 క్రెడిట్స్‌తో రూపొందించిన మోడల్ కరిక్యులంలో.. ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్స్‌కు కలిపి 15 క్రెడిట్స్ నిర్దేశించింది.
- ఎంబీఏ, రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో.. మొత్తం 102 క్రెడిట్స్‌తో రూపొందించిన మోడల్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్/ఫీల్డ్ వర్క్‌లకు ఆరు క్రెడిట్లు నిర్దేశించింది.
విద్యార్థుల కోసమే..
ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయడం అనేది విద్యార్థుల ప్రయోజనం కోసమే. వీటికి క్రెడిట్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులు కచ్చితంగా ఇంటర్న్‌షిప్ వైపు దృష్టిపెడతారు. ఇన్‌స్టిట్యూట్‌లు కూడా విద్యార్థులకు సహకరించేలా ఏఐసీటీఈ మార్గదర్శకాలు రూపొందించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్తులో కెరీర్ అవకాశాల విషయంలో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్.ఎన్.రమేశ్ బాబు, చైర్ ప్రొఫెసర్, ఐఐటీ-చెన్నై, అకడమిక్ అండ్ ఇండస్ట్రీ టీమ్ మెంబర్, ఏఐసీటీఈ మోడల్ కరిక్యులం
Published date : 29 Mar 2018 05:20PM