కెరీర్ గైడెన్స్... బీపీఓ
Sakshi Education
ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండే వేరు..పెద్ద అర్హతలు లేకున్నా.. ఐదంకెల జీతంతో కెరీర్‌ను ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తుంది.. కేవలం ఇంటర్మీడియెట్ ఆర్హత..దానికి తోడు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లభాషా ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు.. ఆకర్షణీయమైన ప్యాకేజ్‌తో కూడిన ఆఫర్ లెటర్‌తో జాబ్ రెడీ... అలాంటి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది.. బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(బీపీఓ). ఈ మధ్య కాలంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రాచుర్యం పొందిన రెండు విభాగాలు..బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ), నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(కెపీఓ).
దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ) ఒకటి. తక్కువ వేతనానికే అర్హతలున్న అభ్యర్ధులు దొరకడం, నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉండడం... అకడమిక్ విద్యార్హతల విషయంలో ప్రత్యేకమైన పట్టింపు లేకపోవడం... తదితర కారణాల వల్ల పెద్ద సంఖ్యలో బీపీఓ కంపెనీలు దేశంలో పాగా వేస్తున్నారుు. బహుళజాతి కంపెనీలతోపాటు దేశీయ కంపెనీలు కూడా బీపీఓలను నిర్వహిస్తుండటంతో.. ఈ రంగం ప్రస్తుతం అవకాశాల తరంగా మారింది. నేటి కార్పొరేట్ ప్రపంచం ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడానికి విభిన్న పద్ధతులను అనుసరిస్తుంది. ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడికి తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఉత్తమ సేవలను అందుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే తెరపైకి వచ్చిన పదం బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(బీపీఓ). ఇందులో ఒక కంపెనీ తన నాన్ కోర్ వ్యవహారాలైన.. ఎంప్లాయ్ పే రోల్ ప్రిపేర్, డేటా ఎంట్రీ, వాయిస్ కాలింగ్ వంటి ఆపరేషన్స్‌ను వేరే దేశానికి బదిలీచేసి...తక్కువ వ్యయానికే అక్కడి నుంచి సేవలను పొందుతుంది. దీన్నే బీపీఓ అంటారు. ఇందులో సేవలను నేరుగా కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆధారంగా నిర్వహిస్తారు కాబట్టి..బీపీఓను ఐటీ ఎనాబిలిడ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) అని కూడా పేర్కొంటారు.
నేడు ప్రతిరంగంలోనూ అవుట్ సోర్సింగ్ అనివార్యమనేది అక్షరాలా వాస్తవం. గతంలో బీపీఓ ద్వారా టెక్‌సపోర్ట్, కస్టమర్ కేర్‌లో మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. నేడు ప్రాచుర్యం పొందిన నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(కెపీఓ)లో.. మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌తోపాటు మార్కెటింగ్ సర్వీసెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్, హ్యుమన్ రిసోర్సెస్ సర్వీసెస్, లీగల్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(ఎల్‌పీఓ) వంటి విభాగాలుంటాయి. ఇలా ప్రతి విభాగంలో అవుట్ సోర్సింగ్ వేలాదిగా అవకాశాలకు వారధిగా నిలుస్తోంది.
బీపీఓ కంపెనీల్లో సాధారణంగా వాయిస్ బేస్డ్, నాన్ వాయిస్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. వాయిస్ బేస్డ్‌లో కస్టమర్ సపోర్ట్ సర్వీస్, నాన్ వాయిస్ బేస్డ్ విభాగంలో.. టెక్ సపోర్ట్ ఉంటుంది. సాధారణంగా 60 శాతం.. వాయిస్ బేస్డ్ ప్రాసెస్ జాబ్స్ ఉంటే..40 శాతం నాన్-కాలింగ్ ఫంక్షనల్ జాబ్స్ ఉంటాయి. వీటినే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌గా వ్యవహరిస్తారు.
కస్టమర్ సపోర్ట్ సర్వీస్: కస్టమర్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించడం కస్టమర్ సపోర్ట్ సర్వీస్ బాధ్యత. ఇక్కడ కాల్ సెంటర్లలో కూర్చున్న ఉద్యోగులు తమ కార్పొరేట్ క్లయింట్‌లకు, ఇతర క్లయింట్లకు సేవలు అందిస్తారు. ఇందులో కస్టమర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కస్టమర్ కేర్ ఉద్యోగానికి ఆంగ్లంపై పట్టు తప్పనిసరి. టైపింగ్ రావాలి.
టెక్ సపోర్ట్ సర్వీస్: టెక్నికల్‌కు సంబంధించిన అన్ని రకాలు సేవలందించే విభాగమిది. మీరేదైనా ఎలక్ట్రానిక్ పరికరం/వస్తువు కొన్నప్పుడు దాని వినియోగానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే వాటి గురించి మెరుుల్/ఇతర ఇంటారాక్టివ్ సర్వీసుల ద్వారా టెక్ సపోర్ట్ విభాగం వారు మీ సమస్యకు పరిష్కారాన్ని చూపుతారు. టెక్‌సపోర్ట్‌కైతే ఇంగ్లిష్‌లో బాగా రాసే సామర్థ్యం అవసరం. సంబంధిత హార్డ్‌వేర్‌పై అవగాహన ఉండాలి. ఈ విభాగంలో హార్డ్ వేర్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్, నెట్‌వర్కింగ్ సపోర్ట్ వంటి జాబ్‌ప్రొఫైల్స్ ఉంటాయి.
నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(కెపీఓ):
ఇది బీపీఓ వంటిదే. అందుకే దీన్ని బీపీఓకు అడ్వాన్స్‌డ్ స్టెప్‌గా వ్యవహరిస్తారు. ఈ విభాగంలో అవుట్ సోర్స్ అంశాలన్నీ సబ్జెక్ట్ ఎక్స్‌పోర్ట్, హైస్కిల్స్ కలిగి ఉన్న ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారు. ఇందులో విభాగాల వారీగా..బాధ్యతలు..
మార్కెటింగ్ సర్వీసెస్: ఇది టెలీ మార్కెంటింగ్ సర్వీస్ లాంటిది. ఈ విభాగంలో ప్రధానంగా సేల్స్ ప్రక్రియలో భాగంగా వినియోగదారులు ఫోన్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ఇచ్చే ఆర్డర్లకు సంబంధించిన సేవలను అందిస్తారు. కంటెంట్ డెవలప్‌మెంట్, కన్సల్టెన్సీ సేవలు కూడా ఉంటాయి.
హ్యుమన్ రిసోర్స్ సర్వీసెస్: ఇటీవలి కాలంలో సమర్థమైన మానవవనరులను ఎంపికచేసుకోవడానికి కంపెనీలు అవుట్ సోర్సింగ్‌ను ఎంచుకోవడంతో ఎంట్రీ, మిడిల్, సీనియర్ లెవెల్స్‌లో హెచ్‌ఆర్‌లకు గిరాకీ ఉంది. పేరోల్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్, స్టాఫింగ్, ట్రావెల్ అండ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్‌మెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లానింగ్, కంటింజంట్ వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్, వర్క్‌ఫోర్స్ అనాలసిస్... తదితర అంశాలను నిర్వహించడం కంపెనీలకు క్లిష్టతరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ హెచ్‌ఆర్ కార్యకలాపాల నిర్వహణ కోసం అవుట్ సోర్స్‌ను ఆశ్రయిస్తున్నాయి. దీన్నే హ్యుమాన్ రిసోర్స్ సర్వీసెస్‌గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ ఎనాలిస్ట్: బిజినెస్, ఫైనాన్స్ సంబంధిత వ్యవహారాలను బిజినెస్ ఎనాలిస్ట్ నిర్వహిస్తాడు.
టెక్నికల్ రాయిటింగ్/ఇన్‌స్ట్రక్షనల్ డిజైనింగ్: ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చి కొత్త విభాగం ఇది. ఇందులో మార్కెట్‌లోకి కొత్త వచ్చిన ప్రొడక్ట్ లేదా ఉత్పత్తికి సంబంధించి వినియోగదారుల సౌలభ్యం కోసం ఉపయోగం, జాగ్రత్తలు తదితర అంశాలకు సంబంధించి ఒక గైడ్ ఇవ్వాలి. ఇటువంటి జాబ్‌టాస్క్‌ను కూడా చాలా విదేశీ కంపెనీలు అవుట్ సోర్సింగ్‌కు అప్పగిస్తున్నాయి.
లీగల్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్:
ఇటీవలి కాలంలో మనదేశంలో లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్(ఎల్‌పీఓ) బాగా ప్రచారంలోకొచ్చింది. వివిధ దే శాల నుంచి పంపిన కోర్టు కేసు ఫైళ్లను ఇక్కడి న్యాయనిపుణులు పరిశీలించి సలహా ఇస్తారు. న్యాయవిద్యలో పట్టాతోపాటు ఇంగ్లిష్‌లో డాక్యుమెంట్లు రాయడం దీనికి ప్రధాన అర్హతలు. హెల్త్‌కేర్: అమెరికాలో ప్రతి రోగికీ సంబంధించిన వివరాలను ఫైల్ చేయడం తప్పనిసరి. అక్కడి డాక్టర్లు... రోగుల వివరాలు, మందుల చీటీ, పరీక్షల ఫలితాలను పొడిపొడిగా రాసి సమాచారాన్ని డాక్యుమెంటేషన్ లేదా వాయిస్ రూపంలో మనకు అవుట్ సోర్స్ రూపంలో పంపుతారు. దాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో తిరిగి పంపడాన్ని మెడికల్ ట్రాన్స్‌కిప్షన్ అంటారు. ఇంగ్లిష్ భాషపై పట్టుతోపాటు వైద్య పరిభాషపై అవగాహన, లిజనింగ్ స్కిల్స్ ఉంటే మెడికల్ ట్రాన్స్‌కిప్షన్ కావడం తేలికే.
క్లినికల్ రీసెర్చ్ అవుట్ సోర్సింగ్ (సీఆర్‌ఓ):
విదేశాల్లో తీసిన ఎక్స్‌రేలను మన వైద్యులు క్షుణ్నంగా పరిశీలించి నివేదికనివ్వడాన్ని క్లినికల్ రీసెర్చ్ అవుట్ సోర్సింగ్ (సీఆర్‌ఓ) అంటారు. ప్రస్తుతం మన దేశంలో 30 సీఆర్‌ఓలు సేవలందిస్తున్నారుు. అమెరికా, యూరప్ దేశాల్లోని పలు ఆసుపత్రులు రోగ నిర్ధారణ పరీక్షలను భారత్‌కు అవుట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నాయి. ఇందులో ప్రవేశించాలంటే రోగనిర్ధారణకు సంబంధించిన పరీక్షలపై సర్టిఫికేట్ డిగ్రీలు చేయడంతో పాటు ఆంగ్లంలో రిపోర్ట్‌రాసే పరిజ్ఞానం తప్పనిసరి.
ఫైనాన్స్, అకౌంటింగ్ సర్వీసెస్: ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న విభాగం. ఇందులో కేవలం ట్రాన్సా క్షన్‌కు సంబంధించిన సేవలు మాత్రమే అవుట్ సోర్స్ అవుతాయి. అయితే సందర్భాన్ని బట్టి క్లయింట్‌లు తమ బిజినెస్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ అనాలసిస్ సొల్యూషన్స్ కూడా అందించే అవకాశముంది.
ఇంజనీరింగ్ సర్వీసెస్: ప్రొడక్ట్ లేదా దానికి సంబంధించిన సేవల ఉత్పత్తిలో టెక్నికల్ కన్సల్టెన్సీని అందించడం దీని ప్రధాన విధి. ఈ విభాగంలో ప్రధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, ఇంజనీరింగ్ అనాలసిస్ వంటి అంశాలు అవుట్ సోర్స్ అవుతాయి.
లాజిస్టిక్స్: ఇందులో సప్లయి చైన్ మేనేజ్‌మెంట్ ప్రధానం. ఇన్వెంటరీ కాస్ట్‌ను తగ్గించడం, డెలివరీ షెడ్యూల్‌ను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. ఇన్‌వాయిస్ కలక్షన్, పేమెంట్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రూట్ ఆప్టిమైజేషన్, వేర్‌హౌసింగ్, ఇన్‌వెంటరీ కంట్రోల్ సేవలు కూడా ఉంటాయి.
కాల్ సెంటర్లు:
కాల్ సెంటర్ అనేది సేవల కేంద్రం. ఇక్కడ ఫోన్లు, ఇంటర్నెట్, విస్తృతమైన డేటాబేస్, వాయిస్ ఆధారిత, వెబ్ ఆధారిత సమాచా రంతో సుశిక్షితులైన మానవ వనరుల ద్వారా దేశ, విదేశాల్లోని వినియోగదారులకు వివిధ సేవల అందుతాయి. బ్యాంకింగ్, తయారీ రంగం, మార్కెట్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, సేల్స్, ఆర్డర్ డెస్క్, కస్టమర్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ఎమర్జెన్సీ డిస్పాచ్, క్రెడిట్ కలక్షన్స్, ఫుడ్ సర్వీసెస్, ఎయిర్‌లైన్/హోటల్ రిజర్వేషన్స్ వంటి అన్ని రంగాల్లోనూ.. కాల్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో రెండు రకాల కాల్ సెంటర్లు ఉంటాయి. అవి.. ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లు, డొమెస్టిక్ కాల్ సెంటర్లు. జెన్‌పాక్ట్, హెచ్‌సీఎల్ వంటివి ఇంటర్నేషనల్ కాల్‌సెంటర్లు.
డొమెస్టిక్ కాల్ సెంటర్లు:
ఈ విభాగంలో పనిచేసేవారికి ప్రాంతీయ భాషపై పట్టుండి.. జాతీయ భాష, ఇంగ్లిష్‌పై అవగాహనుండాలి. నిర్వహణా భారం తక్కువ ఉండడం, తక్కువ రేటుకే మానవ వనరులు లభిస్తుండడంతో చిన్న చిన్న పట్టణాలకు సైతం బీపీఓ సేవలు విస్తరిస్తున్నాయి. డొమెస్టిక్ కాల్ కాల్ సెంటర్ వ్యాపారంలో 80 శాతం... టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల ద్వారానే జరుగుతుంది. రిటైల్, ట్రావెల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ విభాగాల్లో సేవలు బాగా విస్తరించనున్నారుు. టికెట్ల బుకింగ్ వంటి సేవల కోసం చిన్న పట్టణాలను లక్ష్యంగా కంపెనీలు ఎంచుకోవడంతో... స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నారుు.
అర్హత:
బీపీఓలో.. వాయిస్ బేస్డ్ విభాగంలో ప్రవేశించడానికి ఇంటర్మీడియెట్ అర్హత సరిపోతుంది. అయితే చదువుకుంటూ ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు ఉండడంతో అకడెమిక్ అర్హతలను పెంచుకోవడం ద్వారా మంచి పోజిషన్‌కు చేరుకోవచ్చు. షిప్ట్ బేస్డ్ పని విధానం ఇందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టెక్‌సపోర్ట్‌కైతే ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి. సంబంధిత హార్డ్‌వేర్‌పై అవగాహన అవసరం. లీగల్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్, హ్యుమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ రీసెర్చ్ అవుట్ సోర్సింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ వంటి నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్(కెపీఓ)లో మాత్రం ఎంబీఏ/ఎంసీఏ/సీఏ/లా వంటి ప్రొఫెషనల్ అర్హతలు తప్పనిసరి.
కావలసిన స్కిల్స్:
బీపీఓ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కొన్ని రకాల ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. అవి.. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఆంగ్లభాషా ప్రావీణ్యం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సమస్యలను విశ్లేషించే సామర్థ్యం నాయకత్వ లక్షణాలు మంచి లీజనింగ్ స్కిల్స్ ఓపిగ్గా వినడంతోపాటు కస్టమర్‌లను ఒప్పించగలిగే నైపుణ్యం టైపింగ్ స్పీడ్ మార్కెటింగ్ నైపుణ్యాలు డేటాబేస్‌లోకి సమాచారాన్ని వేగంగా చేర్చగలగడం, తిరిగి తీసుకోవడం తెలియాలి. ఎంపిక విధానం: ఎంపిక విధానం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. స్థూలంగా బీపీఓ కంపెనీలు నాలుగు దశలతో కూడిన ఎంపిక విధానాన్ని అనుసరిస్తాయి. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్, టైపింగ్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ. అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. ప్రధానంగా అభ్యర్థిలోని మ్యాథ్స్, ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మ్యాథ్స్.. విభాగంలో.. అనాలిటికల్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్ వంటి అంశాలు ఉంటాయి. ఇంగ్లిష్‌లో గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు. టైపింగ్ స్కిల్స్: ఈ రౌండ్‌లో అభ్యర్థి నిర్దేశిత సమయంలో ఇచ్చిన ప్యాసేజ్‌ను దోషాలు లేకుండా టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్: ఇది ఒక రకంగా స్పీచ్ రౌండ్ . ఇందులో అభ్యర్థి వాక్చాతుర్యాన్ని పరీక్షిస్తారు. నిర్దేశించిన/ఎంపిక చేసుకున్న ఒక అంశంపై స్పష్టంగా, ఎటువంటి దోషాలు లేకుండా ప్రసంగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా లీజనింగ్ స్కిల్స్‌ను కూడా పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ: ఇందులో మీ వ్యక్తిగత విషయాలు, క్వాలిఫికేషన్స్, జాబ్ పట్ల ఆసక్తి, కరెంట్ ఆఫైర్స్ తదితర అంశాల ప్రస్తావన ఉంటుంది. కొన్ని కంపెనీలు అవసరాన్ని బట్టి కంప్యూటర్ టెస్ట్(టెక్నికల్)ను కూడా నిర్వహిస్తాయి. కెపీఓ సంబంధిత కంపెనీల్లో ఎంపిక విధానం బీపీఓలతో పోల్చితే కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో రాత పరీక్ష తర్వాతి రౌండ్‌లో ప్యానల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో సంబంధిత సబ్జెక్ట్‌పై ప్రశ్నలు ఉంటాయి. చివరగా హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ. వీటికి తోడు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో అదనంగా గ్రూప్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. కెరీర్ స్కోప్: శరవేగంగా విస్తరిస్తున్న బీపీఓ, కెపీఓ రంగాల్లో అవకాశాలకు కొదవలేదు. అనుభవం, పని తీరు ఆధారంగా కాల్ ఎజెంట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి టీమ్ లీడర్, ప్రాజెక్ట్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్, ట్రైనర్, ట్రైనింగ్ మేనేజర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ సపోర్ట్ వంటి విభాగాల్లో సీనియర్ మేనేజర్‌గా స్థాయికి చేరుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అర్హతలు, స్కిల్స్ ఎంత పెంచుకుంటే అంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం కల్పించే రంగమిది. కొన్ని కంపెనీలు ఉద్యోగుల సామర్థ్యాన్ని బట్టి కంపెనీ ఇతర విభాగాల్లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు విప్రో కంపెనీ.. ఆసక్తి, సామర్థ్యాన్ని బట్టి కన్జ్యుమర్ కేర్, ఇన్ఫాస్ట్రక్చర్ విభాగాల్లో అవకాశం కల్పిస్తుంది. కెరీర్‌గ్రోత్‌కు ఉపయోగపడే పలు రకాల కోర్సులు చదవడానికి ఆర్థికంగా (పేయిడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్)కూడా సహాయపడుతున్నాయి. వేతనాలు: బీపీఓ కంపెనీలో పే ప్యాకేజ్‌లు ఇతర రంగాలకు దీటుగా ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణంగా ప్రారంభ వేతనం కంపెనీని బట్టి నెలకు *8,000-17,000 మధ్య ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ఏడాదికి *2-2.5 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు. టీమ్ లీడర్ స్థాయికి చేరుకుంటే నెలకు *25,000-30,000 వరకు సంపాదించవచ్చు. అయితే స్వదేశీ క్లయింట్స్‌ను నిర్వహించే వారి కంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్‌ను డీల్ చేసే వారి పే ప్యాకేజ్ ఎక్కువ. ఈ విభాగంలో మేనేజర్, టీమ్‌లీడర్ల పేప్యాకేజ్ వారి స్థాయిని బట్టి సంవత్సరానికి *5-8 లక్షలు. కేవలం వేతనమేకాకుండా ఉద్యోగుల పనితీరు ఆధారంగా పలు ప్రోత్సహకాలను కూడా అందజేస్తున్నాయి. వాటిలో.. పర్‌ఫార్మెన్స్ బేస్డ్ బౌనస్, షాపింగ్ డిస్కౌంట్స్, హెల్త్ సెంటర్లలో సభ్యత్వం, సబ్సిడీతోకూడిన లోన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉంటాయి. జాబ్ ప్రొఫైల్స్: బీపీవో కంపెనీల్లో సాధారణంగా ఫ్రెషర్స్‌ను ట్రైనీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ అసోసియేట్‌గా పేర్కొంటారు. వాటి తోపాటు ఉండే ఇతర జాబ్ ప్రొఫైల్స్... కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అనలిస్ట్ వాయిస్ ట్రైనర్ ప్రాసెస్ ట్రైనర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ టెలీ కాలర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ అసోసియేట్ కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్ టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శిక్షణ: సాధారణంగా రిక్రూట్ చేసుకున్న కంపెనీలే వాటి అవసరాలకనుగుణంగా అభ్యర్థులకు శిక్షణనిస్తాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా బీపీఓ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారి కోసం సంబంధిత అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాయి. శిక్షణలో భాగంగా వాయిస్ ట్రైనింగ్, లీజనింగ్ స్కిల్స్, స్లాంగ్ ట్రైనింగ్, అసెంట్ న్యూట్రలైజేషన్, టెలిఫోన్ ఎటిక్యుటి, టెలి సేల్స్, సైబర్ గ్రామర్, ఇంటరాక్షన్ స్కిల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్, మేనేజ్‌మెంట్ స్కిల్స్, కాల్ సెంటర్ టెర్మినాలజీ తదితర అంశాలను నేర్పిస్తారు.
ట్రైనింగ్ సెంటర్స్:

- ఇవాల్వ్
- కలెక్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
- హిరోమైండ్మైన్
- మాఫాయ్ అకాడెమీ
- యాడ్వ్యాల్యూ ట్రైనింగ్ సొల్యూషన్స్
- ఫాండ్స్ ఇన్ఫోనెట్ ప్రయివేట్ లిమిటెడ్
- ఫ్యూచర్ కాల్
- నెక్స్ట్
- ఆన్‌ట్రాక్
- అసెంచర్‌తో కలిసి ఇగ్నో 6 నెలల ఆన్లైన్ బీపీఓ శిక్షణ కోర్సును ప్రారంభించింది.
- జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నిట్... యూఎన్ ఐక్యూయూఏ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:
- జెన్‌ప్యాక్ట్
- విప్రో
- టీసీఎస్ బీపీఓ
- ఐసీఐసీఐ వన్‌సోర్స్
- హెచ్‌సీఎల్ బీపీఓ
- ఇన్ఫోసిస్ బీపీఓ
- వీఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్
- అసెంచర్ ఇండియా
- ట్రాన్స్‌వర్క్స్
- ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్
- ఆదిత్య బిర్లా మినాక్స్
- ఏజీసీ బీపీఓ
- హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్
- 24/7 కస్టమర్
Published date : 06 Feb 2012 04:11PM