కెరీర్ ఎంపికలో వినూత్న కోర్సులు.. సమాచారం తెలుసుకోండిలా..!
Sakshi Education
ఈ ప్రపంచం అవకాశాలను వడ్డించిన ఓ విస్తరి..! మునుపెన్నడూ లేనన్ని వినూత్న కెరీర్లు యువతకు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో విభిన్న జాబ్ ప్రొఫైల్స్‌తో ఉద్యోగాలు ఊరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ది బెస్ట్ కెరీర్‌ను ఎంచుకోవడం ఎలా?! కెరీర్ ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి.. డొమైన్‌ల వారీగా ఏయే కెరీర్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది? తదితర ప్రశ్నలు విద్యార్థులకు ఎదురవడం సహజం. ఈ నేపథ్యంలో.. కెరీర్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
అవగాహన..
ఆసక్తులు, సమర్థతలపై నిర్ణయానికొచ్చిన తర్వాత సదరు సబ్జెక్టు అందించే కెరీర్ల గురించి అధ్యయనం చేయాలి. ఏయే విభాగాలు, రంగాల్లో అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికోసం ఇప్పటికే ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారిని సంప్రదించాలి. అలా సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఏ కెరీర్‌ను ఎంచుకోవాలి? దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవాలి.
సైన్స్..
సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి కెరీర్లు ఎంచుకోవచ్చు.
కామర్స్..
కామర్స్ నిపుణులు కంపెనీకి వెన్నుముకగా నిలుస్తారు. కామర్స్ రంగంలో పలు జాబ్ ప్రొఫైల్స్‌కు అధిక డిమాండ్ ఉంది. సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు పూర్తి చేయడం ద్వారా మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ఆర్ట్స్..
డిగ్రీ చేతికొచ్చింది. ఇంకేముంది ఉద్యోగంలో స్థిరపడటమే తరువాయి...! అయితే అందివచ్చిన ఏ ఉద్యోగంలోనైనా చేరేందుకు సిద్ధమా.. లేదా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా.. రెండో మార్గాన్ని అనుసరించిన వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగం సరితూగుతుంది.. ఏ జాబ్ ఫ్రొఫైల్ సూటవుతుంది.. వంటి అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకున్న వారికి ఉజ్వల భవిష్యత్ సొంతమవడం ఖాయం. కెరీర్‌ను ఎంపిక చేసుకొనే సమయంలో అభిరుచి, స్వీయ నైపుణ్యాలను మేళవించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఫలితాలు ఫలప్రదంగా ఉంటాయి.
మిమ్మల్ని తెలుసుకోండి..
కెరీర్‌ను ఎంచుకునే ముందు ప్రతి విద్యార్థి తన గురించి తాను తెలుసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, తెలిసినవారు, సీనియర్ల అభిప్రాయాలు పరిగణించాలి. దాంతోపాటు స్వీయ అవలోకనం చేపట్టాలి.
మిమ్మల్ని తెలుసుకోండి..
కెరీర్‌ను ఎంచుకునే ముందు ప్రతి విద్యార్థి తన గురించి తాను తెలుసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, తెలిసినవారు, సీనియర్ల అభిప్రాయాలు పరిగణించాలి. దాంతోపాటు స్వీయ అవలోకనం చేపట్టాలి.
- ఆసక్తులు: అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉంది.. ఏ రంగంపై ఇష్టం ఉంది.. వేటికి సంబంధించిన బుక్స్ ఎక్కువగా కొనడం, చదవడం చేస్తున్నారు.. వంటి ప్రశ్నలు సంధించుకోవాలి. ఇలా చేయడం ద్వారా స్వీయ ఆసక్తులను తెలుసుకోవచ్చు. స్వీయ ఆసక్తులను తెలుసుకోకుండా కెరీర్ నిర్ణయం తీసుకుంటే.. సదరు ఉద్యోగంలో రాణించడంలో ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. అంతేకాకుండా కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోవాల్సి వస్తుంది.
- సమర్థత: ఏయే సబ్జెక్టుల్లో అసక్తి ఉందనే విషయం తెలుసుకోవడంతోపాటు వాటిలో ఏ టాపిక్స్‌లో అత్యంత సమర్థతను, నైపుణ్యాలను కలిగున్నారో గుర్తించాలి. ఆ దిశగా ఆసక్తులు, సమర్థతలు, నైపుణ్యాలతో కూడిన జాబితాను తయారుచేసుకోవాలి.
అవగాహన..
ఆసక్తులు, సమర్థతలపై నిర్ణయానికొచ్చిన తర్వాత సదరు సబ్జెక్టు అందించే కెరీర్ల గురించి అధ్యయనం చేయాలి. ఏయే విభాగాలు, రంగాల్లో అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికోసం ఇప్పటికే ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారిని సంప్రదించాలి. అలా సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఏ కెరీర్‌ను ఎంచుకోవాలి? దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవాలి.
సైన్స్..
సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి కెరీర్లు ఎంచుకోవచ్చు.
- ఇంజనీరింగ్: ప్రస్తుతం అత్యధిక మంది ఎంచుకుంటున్న కెరీర్ ఇంజనీరింగ్. ఇది గత కొన్నేళ్లుగా ఎవర్‌గ్రీన్ కెరీర్‌గా నిలుస్తోంది. ఇంజనీరింగ్‌లో సైంటిఫిక్, మ్యాథమెటికల్ సూత్రాలను వాణిజ్య రంగానికి వినియోగించాల్సి ఉంటుంది. అలాంటి సామర్థ్యాలను సొంతం చేసుకోగలిగితే కెరీర్‌కి ఆకాశమే హద్దని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్(సీఎస్‌ఈ) బ్రాంచ్ కొలువుల అందించడంలో ముందుంటోంది. అలాగే బీటెక్‌లో ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ వంటి కోర్ బ్రాంచులతోపాటు పలు నూతన డొమైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని అభ్యసించడం ద్వారా వినూత్న కెరీర్లను సొంతం చేసుకోవచ్చు.
- మెడిసిన్: మెడికల్ ఫీల్డ్ ఎవర్‌గ్రీన్ కెరీర్‌ను అందిస్తుంది. ఈ విభాగంలో ఎంబీబీఎస్ నుంచి యానిమల్ హజ్బెండ్రీ వరకు, హోమియోపతి నుంచి ఫిజియోథెరపీ వరకు భిన్న జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే యువతకు నర్సింగ్, ఎక్సరే, డయాగ్నసిస్ విభాగాల్లోనూ సుస్థిర కెరీర్ లభిస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను చూస్తుంటే.. భవిష్యత్‌లో హెల్త్‌కేర్ రంగం మరింతంగా విస్తరించి విభిన్న అవకాశాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
- ఫార్మసీ: సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రామిసింగ్ కెరీర్.. ఫార్మా. మానవాళి ప్రాణాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మందులు తయారుచేసే బృహత్తర బాధ్యతను ఫార్మా రంగం నిర్వహిస్తోంది. ఫార్మా రంగం రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఇందులో ప్రవేశించిన వారు తమ అనుభవం, నైపుణ్యాలతో ఆకర్షణీయ కెరీర్‌ను సొంతం చేసుకునే వీలుంది.
కామర్స్..
కామర్స్ నిపుణులు కంపెనీకి వెన్నుముకగా నిలుస్తారు. కామర్స్ రంగంలో పలు జాబ్ ప్రొఫైల్స్‌కు అధిక డిమాండ్ ఉంది. సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు పూర్తి చేయడం ద్వారా మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- చార్టెడ్ అకౌంటెంట్: ట్యాక్సేషన్, ఆడిట్స్, మెర్జర్స్(విలీనం)లో కంపెనీలకు సీఏల సేవలు కీలకంగా నిలుస్తాయి. ఇంటర్ తర్వాత సీఏ కోర్సులో చేరొచ్చు.
- ఆక్చ్యుయేరియల్ స్పెషలిస్టు: కంపెనీల ఫైనాన్షియల్ రిస్కులను అంచనా వేస్తారు. విద్యార్థులు ఆక్చ్యుయేరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ఏసెట్)కు హాజరవ్వడం ద్వారా డిగ్రీ అభ్యసించేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్చ్యుయేరియల్ ఆఫ్ ఇండియా వద్ద నమోదు చేసుకోవచ్చు.
- కంపెనీ సెక్రటరీ: నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లు, టాప్ మేనేజ్‌మెంట్, కంపెనీ నడుచుకునేలా కంపెనీ సెక్రటరీ జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యార్థులు ఇంటర్ తర్వాత సీఎస్ కోర్సులో చేరొచ్చు. అలాగే సీఎంఏ కోర్సు కూడా కామర్స్ విద్యార్థులకు ఉజ్వల అవకాశాలు కల్పిస్తోంది. ఇంటర్ అర్హతతో ఈ కోర్సులో చేరే వీలుంది.
- వీటితోపాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ కామర్స్ విద్యార్థులకు క్రేజీ అవకాశాలు లభిస్తున్నాయి.
ఆర్ట్స్..
- లా: ఆర్ట్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాల్లో ముందు వరుసలో నిలుస్తోంది..లా కోర్సు. న్యాయవాద కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. అలాగే సొంతంగా ప్రాక్టీస్ చేయొచ్చు.
- హ్యుమానిటీస్: ఇందులో ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌వర్క్, ఆంత్రోపాలజీ తదితర స్పెషలైజేషన్లు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- మీడియా: బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సులు పూర్తి చేసిన వారికి న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, టెలివిజన్, సినిమా రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
- వీటితోపాటు ఆర్ట్స్ విద్యార్థులకు డిజైన్ అండ్ యానిమేషన్ రంగం సైతం చక్కటి కెరీర్‌ను అందిస్తోంది.
Published date : 19 Aug 2020 05:35PM